Others

సృస్థిల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాయు శిల్పి చేతుల్లోబడి ఆకారాలు అమర్చుకుంటున్న
మబ్బులోంచి ఓ చినుకు
మొక్క కొమ్మలో పూవై కూర్చుంది
తుమ్మెదలై తిరిగే జాతి పారుపత్తేన్ని
ప్రతిఘటించలేక
అది మకరందమనే మధుర విషాదాన్ని నింపుకొంది
గుండెను మిళిందం కొల్లగొడుతున్నా
తావి ప్రాంతాన్ని తరంగితం చేస్తూనే వుంది
తూర్పు ప్రభాతపు తూగుటుయ్యాలలో
శబ్ద సౌష్టవమై ఊగుతున్నప్పుడు
ఈ దేశ దేహ పౌరాతన్యం మీద అనురాగ ధూర్జటి
గళం విప్పి చెట్టు కట్టడం నాకింకా గుర్తు- ఆ
అలంకారాన్ని అందిపుచ్చుకున్నాను
ఇపుడు శకలాలై ఎగిరిపోతున్న ఏ కాంతి శిల్పంలాంటి
కాలాన్ని కన్నీటి బిందువులో పొదుగుతున్నాను
నా దృష్టి పధంలోని దృశ్యానికి తుదల్లేవు
నాకు తెలసు
‘‘గడియారపు చేతులు ఇచ్చే ఆజ్ఞలకు లొంగి
జీవనపణంలో పరుగెత్తే ఏ మనిషీ ఋషికాడు
ఈ చెట్టు పూలను మాటులు చేసి
ఈ దేశపు మట్టిలో చల్లడానికే
నేను వస్తున్నాను...
ఇంకా ఉంది

- సాంధ్య శ్రీ 8106897404