Others

శివానందలహరి.. శివజ్యోతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భూలోక సృష్టికి పూర్వం జరిగిన సంఘటన:
ఆధ్యంతరహితము, నిష్కల స్వరూపము ఐన తన అద్భుత లింగాన్ని బ్రహ్మ విష్ణువుల ముందు ప్రకటింపజేశాడు పరంజ్యోతి ఐన ఆ పరమేశ్వర పరబ్రహ్మము. అందులోనుండి వెలువడుతున్న దివ్యకాంతి పుంజాల నడుమ నుండి ఆయన ‘అక్షర’ అనగా వర్ణ రూపాన్ని అ-ఉ-మ అనే వర్ణాల కలయికతో ఓంకారంగా ఉద్భవింపజేశాడు. ఆ ప్రణవ స్వరూప దర్శనంతో పాటు ప్రణవ నాదమైన ఓంకార నాదాన్ని కూడా బ్రహ్మ విష్ణువులు వినగలిగారు. పరవశించినవారు ఆయన సాకార రూపాన్ని కూడా కన్నులారా తిలకించే భాగ్యాన్ని తమకు ప్రసాదించమని ఆయనను ప్రార్థించారు.
వారి ప్రార్థనలకు కరగిన పరమేశ్వరుడు మహేశ్వరాంశ సంభూతుడై ధవళ వర్ణ దివ్య ప్రకాశంతోను, పంచ వదనాలతోను వారికి దర్శనమిచ్చారు. ఆ అద్భుత దర్శనాన్ని వీక్షించిన బ్రహ్మ విష్ణువులు భక్తితో చేతులు ముకుళించి ఆయనను వేన్నోళ్ళ కీర్తించారు.
‘‘ప్రభూ! సర్వాత్ములూ, నిర్మల స్వరూపులూ అయిన మీకివే వందనాలు. ప్రణవ నాదాన్ని ఉద్భవింపజేసి సృష్టి, స్థితి, సంహార, తిరోధాన, అనుగ్రహాలనెడి పంచ కృత్యాలకూ కర్తలయిన మీకు ప్రణామము లర్పిస్తున్నాము. సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశానములని ఖ్యాతి వహించిన మీ పంచవదనాల నుండి కోటానుకోట్ల పంచ బ్రహ్మ మంత్రములను, జనులనను గ్రహించటానికి ఉత్పన్నం చేసిన మీకివే మా నమస్కృతులు’’ అంటూ తమ దైవమూ, గురువూ అయిన మహేశ్వరుడిని ప్రస్తుతించారు బ్రహ్మ విష్ణువులు.
శివపురాణ ఆవిర్భావం
సనత్కుమారోపాఖ్యానం
ఓంకార నాదం నుండి వేదాలు ఉద్భవించాయి. ఆ వేదసారాన్ని క్షుణ్ణంగా అవగాహన చేసుకున్న విష్ణువుకి ‘శ్రీమన్నారాయణుడు’ అని నామ మొసగి భావి సృష్టికి స్థితి కారకుడిగానూ, రక్షకుడిగానూ పోషకుడిగానూ నియమించాడు మహేశ్వరుడు.
ఆయన
నాభి నుండి ఉద్భవించిన బ్రహ్మ దేవుడికి వివిధ జీవరాశులనీ సృష్టించే బాధ్యత అప్పగించాడు. తాను ఈశ్వరుడై కైలాసగిరిపై కొలువైనాడు.
విష్ణు నాభి నుండి ఉద్భవించి తన కర్తవ్యమైన సృష్టికార్యానికి తదేక నిష్టతో శ్రీకారం చుట్టిన బ్రహ్మదేవుడి మానస పుత్రులుగా ప్రప్రధమంగా మహావిరా గులూ, నిత్య పంచవర్ష పరాయణులూ అయిన సనక సనందన సనత్కుమార సనత్సు జాతులు జన్మించారు. వారందరిలోకెల్లా ఉత్కృష్టుడు సనత్కు మారుడు. ఒకానొకప్పుడు సనత్కుమా రునికి శివ తత్త్వాన్ని పూర్తిగా తెలుసుకోవాలని పించి పరమశివుని అభ్యర్థించగా ఆయన తన చరితాన్ని తత్త్వాన్నీ శివ మహాపురాణంగా లక్ష శ్లోకాలలో వివరించాడు. అది విన్న సనత్కుమారుడు ధన్యుడయ్యాడు.
ఒక ప్రక్క దివ్యమైన మణి ద్వీపంలో వెలసి, పరమేశ్వరిని తన వామాంకాన ధరించే ఆ పరమేశ్వరుడిని పరబ్రహ్మగా నిత్యమూ ధ్యానిస్తూనే, ఆయన అంశతో వెలువడి భూబ్రహ్మాండ పాలనకై బ్రహ్మ విష్ణువులను నియమించిన కైలాసవాసి అయిన ఆ మహే శ్వరుడిగానూ ఆయనను గుర్తించి ఆరాధిం చేవాడు సనత్కు మారుడు. అలాగే హిమాల యాలలోని కైలాస పర్వత నివాసి అయిన ఈశ్వరుడే తన రుద్రాంశతో లోకాలని హరించే రుద్రుడని కూడా ఆయనకి సుగ్రాహ్యమే! మేరు పర్వతాన వౌన మూర్తిగా చిన్ముద్ర ధరించి యోగనిష్ఠుడై ఉండే దక్షిణామూర్తిని పరమేశ్వ రుడి గురుస్వరూపంగా గుర్తించి ఆయన వౌన బోధలు గ్రహించిన మహాజ్ఞాని సనత్కుమారుడు. విధి విలాసం!
శివభక్తులలో అగ్ర గణ్యుడిగా, శివతత్త్వ వేత్తగా పేరొంది తండ్రియైన విరించికి గర్వకారణమైన అంతటి సనత్కు మారుడు కూడా ఒకానొక సమయాన మాయావశాన అహంకార పూరితు డయి ఎదుట శివదర్శ మయినా కూడా లేచి నిలబడక, ప్రణామం చేయక నిర్లక్ష్యంగా వ్యవహరిం చాడు.
నిర్వికారుడూ, నిరాడంబరుడూ అయిన శంకరుడది పట్టించుకోకపోయినా, పరమేశ్వరుడి పరమ భక్తుడూ, వాహనమూ అయిన నందీశ్వరుడిని అతని చర్య అమితంగా బాధించింది. అంతే!

- ఇంకాఉంది