Others

సృ స్థి ల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పవనధాటికి రాలిపోయిన పండుటాకుల తరం
నిశ్శబ్ద నిర్మాణపు వాస్తువును
వర్ణపర్ణాల చాటు ముకుళార్ద్ర జ్వాలగా
ముహూర్తం నిర్ణయించినప్పుడు
మేఘాల మెఱుపు అలంకారాలతో- పద్యం
ప్రతీకల్ని వర్షిస్తోంది
చీకటి సుడిగుండాల గొంతులో
కాంతిదాహం స్పష్టంగా కనిపించింది
విద్యుదుద్యమానికి గవాక్షం తెరుచుకుంది
పవిత్ర నగ్న సౌందర్యాన్ని
పారదర్శక దృశ్యం ఆవిష్కరించింది
మహర్షుల గొంతులో స్వరాలేరుకుంటున్న నాదం
సజీవ శబ్దమైన సభ్యదేశంగా చలామణీ అవుతోంది
ఇక్కడ నిశ్శబ్ద శైశిర తపోభంగిమ
మనుష్యుల జీవన విధానమైన వసంత వనజ్వాల
ఇక్కడే
నవ్వుల్ని సగం సగం విప్పుకొని అర్ధనగ్నత్వాన్ని
అనుభవిస్తున్న బాల్యాలు
రాత్రి వెనె్నల త్రావిన కోవెలదరి కోనేటి కలువల్ని
వలువలు చేసుకున్నాయి
ఉదయం ఉత్ప్రేక్షల్ని మోస్తూన్న తావిగాలి
గుర్తుల్ని ఒలకబోసుకుంటూ
తరగల మీద తాండవిస్తున్నాయి
- ఇంకాఉంది

- సాంధ్య శ్రీ 8106897404