Others

శ్రవణమే శుభప్రదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శౌనకాదులారా!
శివపురాణ శ్రవణం చేయదలచిన వారు ముందుగా పురోహితుడి చేత మంచి ముహూర్తాన్ని నిర్ణయింపజేసుకోవాలి. కథా శ్రవణ కార్యక్రమాన్ని శివాలయాలలోనూ, పవిత్ర క్షేత్రాలలోనూ లేదా భూశుద్ధి చేసిన తమ పూజా గృహాలలోనూ నిర్వహించవచ్చు. భక్తులనూ, మునులనూ, తమ బంధు మిత్రులనూ ఆహ్వానించి ముందు ‘విఘ్నేశ్వర పూజ’ గావించిన తరవాత కథాశ్రవణం ఆరంభించాలి. కథ చెప్పే బ్రాహ్మణుడు ఉత్తరాభిముఖంగానూ ఇతరులు తూర్పు పడమరలకి అభిముఖంగానూ కూర్చోవటం పరిపాటి. కథా శ్రవణ సమయాన మధ్య మధ్యలో కాస్సేపు ‘ఓం నమశ్శివాయ’ మంత్రాన్ని జపిస్తూ ఉండాలి. కథా ప్రవచనం చేసే బ్రాహ్మణుడు పండిత శ్రేష్ఠుడై, శ్రోతల సందేహాలు తీర్చగల జ్ఞానియై ఉండాలి. కథాశ్రవణం చేసేవారు ముందుగా గురూపదేశం పొందితే శ్రవణ ఫలితం అధికంగా ఉంటుంది.
కథా శ్రవణ దీక్ష గైకొన్న వ్యక్తి తన మనసుని పవిత్రంగా ఉంచుకుని, కామక్రోధాది అరిషడ్వర్గాలను దగ్గరకు రానీయక సాయంత్రం కథా ప్రవచనం పూర్తయేవరకూ ఫలాలను మాత్రమే ఆహారంగా తీసుకోవాలి. రాత్రి నేలపై చాపమీద శయనించాలి. కథా దీక్షను గైకొన్న భక్తుడు గృహస్థుడైతే, కథా శ్రవణం నిరంతరాయంగా సాగటానికి ఆవు నేతితో శివుడికి హోమము రుద్ర సంహితలోని మంత్రాలతో కానీ శివపురాణంలోని శ్లోకాలతో కానీ చేయాలి. ప్రవచనమంతా పూర్తయాక బ్రాహ్మణులకి దక్షిణ, భోజన, తాంబూల, దానాది సత్కారాలు చేయాలి. ప్రవచనం ముగిసిన మరుదినం ‘శివగీత’ పఠనం చేయటం అధిక ఫలాలనిస్తుంది. రుద్ర మంత్రాలను పఠిస్తూ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయటం బ్రహ్మహత్యా పాతకాన్ని సైతం హరింపజేస్తుంది’’ అని వివరిస్తూ సూత మహర్షి శివపురాణ విశిష్ఠతను గూర్చి మునులతో,
‘‘పుణ్య చరితులారా!
ఒక్క మాటలో చెప్పాలంటే శివ పురాణ పఠనం లేదా శ్రవణం ఇహ, పర, మోక్షాలలో దేనిని కోరితే దానిని ప్రసాదిస్తుంది. ఏ కోరికా లేక మానసికంగా ఏకాగ్రతతో తనంతట తాను శివ పురాణ మననం చేసుకుంటే ఆ వ్యక్తికి మోక్షం కరతలామలక మవుతుందనటంలో అతిశయోక్తి ఎంత మాత్రమూ లేదు. ఆయురారోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించటంలో ఆ శంకరుడిని మించిన దైవం లేదు. పూర్వం కుష్ఠు వ్యాధి గ్రస్థుడైన శత్రుసింహుడనే రాజు గంగా భవాని ప్రేరణ చేత శివపురాణ శ్రవణం చేసి ఆ భయంకర రోగం నుండి విముక్తి పొందాడు. నిర్మలాంతః కరణతో సేవిస్తే ధన, కనక, వస్తు వాహన విద్యా కీర్తి పుత్ర పౌత్రాదులతో పాటూ ఆరోగ్యమూ, ఆనందమూ అంత్యాన మోక్షమూ కూడా ప్రసాదించే భక్త సులభుడు ఆ పరమ శివుడు.
పుణ్యమునులారా! శివ పురాణంలో భక్తి, జ్ఞాన, వైరాగ్యాలనే మూడు మోక్ష సాధనాలు వివరించబడినాయి. పూర్వం ఒకప్పుడు మహర్షులు కొందరిలో వాదోపవాదాలు చెలరేగాయి. సకల తత్వములకూ అతీతుడైన పరాత్పర పురుషుడెవరో తెలుసుకోగోరి వారు సృష్టికర్త అయిన బ్రహ్మదేవుని వద్దకు పయనమై వెళ్ళారు. బ్రహ్మదేవుడు వెనువెంటనే దేవదేవుడైన ఆ పరమేశ్వరుడొక్కడే ఈ సకల విశ్వాన్నీ ధరించి భరించి పోషించేవాడనీ, ఆయనను శ్రవణ మనన కీర్తనములనే భక్తి సాధనలతో మాత్రమే పొందవచ్చుననీ సమాధానమిచ్చాడు. శివ తత్వమునూ, నామ గుణములనూ, లీలలనూ గురుముఖము నుండి శ్రవణము చేసి, వాటిని మనస్సు చేత మననము చేసి, వాక్కు చేత భక్తితో ఆయనను కీర్తించిన వారు క్రమేపీ శివసాయుజ్యాన్ని పొందుతారని బ్రహ్మదేవుడు వారికి తెలిపాడు.
మహామునులారా! మరొక ప్రాచీన వృత్తాంతాన్ని తెలుపుతాను. ఒక పర్యాయం అత్యంత విరాగీ, పరమ పూజ్యుడూ అయిన సనత్కుమారుడు నా గురువుగారు తపమాచరిస్తున్న సరస్వతీ నదీ తీరానికి వచ్చి వారి పూజలందుకుని ఆయనతో ఇలా పలికాడు.
‘‘వ్యాస మునీంద్రా! మీరు ఏదో సందిగ్ధంలో ఉన్నట్లూ, మోక్షాన్ని గూర్చి ఆలోచిస్తున్నట్లూ నాకు తోస్తున్నది. ఆ శంకరుడిని శ్రవణ మనన కీర్తనలతో సదా ధ్యానించుట ఒక్కటే ఉత్తమోత్తమ ముక్తి సాధనము. ఒకప్పుడు నేను కూడా మీలాగే ఆ ‘సత్య పదార్థం’ గూర్చి చింతిస్తూ దిక్కు తోచని స్థితిలో మందారాచలములో సంచరిస్తూ ఉన్నాను. అపుడు...

ఇంకా ఉంది