Others

సృ స్థి ల (సృష్టి స్థితి లయ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేనొక్కణ్ణీ ధాత్రి నిండా నిండిపోయి
నా కుహూరుత చందన శీకరాలే లోకమంతా జల్లులాడే
ఒకే ఒక ముహూర్తం
అదిగో- అప్పుడే
మొదలయింది, సగమయింది...
***
క్షభయ సంధ్యాన్ని ఉత్సంగాన చేర్చుకునే ఇంత ఆకాశం
నా కంటి పాపలోకొదిగిపోయిన ఓ నీతి పుష్పం
మేఘాలు తరముతున్న గాలితో బాటూ
నక్షత్ర మండలమంతా
నా నాడీ రక్తప్రవాహంలోకి కొట్టుకొచ్చింది
అవయవాల ఆత్మఘోషతో నా దేహం
కర్తవ్యాన్ని భుజాలకెత్తుకున్నది
ఆరు ఋతువుల ఆహార్యం నన్నావరించుకున్న
మరుక్షణమే
నా గొంతు మీటిన నభోజాతం
చెలిమి గంధం చాచిన చందన వృక్షమైంది
కలలు
మొలకెత్తటంకోసం
పాంధుడు పక్షధరుడిపక్క ఎక్కి కూర్చున్నాడు
శే్వత మరాళ మొకటి మెడను బైటికి పెట్టి
నాలోకి రావటానికి ఱెక్కలాడిస్తోంది
ఊపిరికంటె అవ్యక్తమైన ఆత్మను ధరించిన పూవు
సీతాకోక చిలుకై
దేవదారువులాంటి నా దేహాన్ని ఆక్రమించింది
వెనె్నలతో క్రిక్కిరిసిన రాత్రిని
ఒడిసి
నక్షత్ర మొకటి నవక మద్దుతోంది
నేల గంధాన్ని
వెలికి తెచ్చే చినుకు వెనుక అగ్నిని
అంగుళులతో స్పృశించాను
నా ఆత్మవక్షంమీద అదరపు చక్రాలు
అక్షరాల దుమ్మురేపుతున్నాయి...
***
క్రోధాగ్నులు పుక్కిలిస్తూ కన్నీళ్ళు కార్చిన వాడి
తపోభూమికల్లో
మోయాల్సిన బరువు- పాటలో దరువు
పారదర్శక వౌతున్నాయి
స్వప్న ఖనిజాలతో స్వాత్మను సంస్కరించి
సమాజాన్ని గుర్తించిన
వాడే కదమనిషి-ఋషి- మహర్షి

ఇంకా ఉంది

- సాంధ్య శ్రీ 8106897404