Others

బాపూజీ.. మళ్లీ పుట్టాలి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాపూజీ.. మీ ‘స్వప్నసౌధం’ బీటలువారింది
మీ అహింస ‘ఆయుధం’ తుప్పుపట్టింది
మీ ఆశయ బాటన ‘పల్లేర్లు’ మొలిచినయ్
మీ స్వతంత్ర భారతం ‘దోపిడీ’ పాలయింది

ఇనే్నళ్లు గడిచినా...
మీ కలలు ‘కల్లలే’ అయినాయ్
దేశమాత కంట ‘కన్నీళ్లే’ మిగిలినయ్

అదేంటో.. ప్రతి ఏటా...
మీ జయంతులు, వర్ధంతులు
మొక్కుబడిగా జరుపుతున్నారు
మర్నాడే.. ఎవరికీ పట్టనట్టు వెళ్తున్నారు

నాటిలా! సత్యాగ్రహాలు...
నిరాహార దీక్షలు...
సహాయ నిరాకరణలు చేసే
ఆదర్శ నాయకులు ఎవరూ లేరు
అంకిత భావం గల నేతలు కానరారు

దేశం గూర్చి ఎవరికీ పట్టదు
సామాజిక మార్పు అస్సలు గిట్టదు
అంతా.. వ్యక్తిగత స్వార్థం
ఇదే జీవన పరమార్థం

జాతిపితా.. మా ప్రియనేతా!
మీరు మళ్లీ పుట్టాలి
మరో స్వతంత్ర ‘పోరు’ చేపట్టాలి
సస్య శ్యామల, శాంతి సౌభాగ్యాల
సమైక్య భారతాన్ని స్థాపించాలి

-కోడిగూటి తిరుపతి 95739 29493