Others

అనంత నామధారిణి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమ్మా! అయ్యా!శివ, శివా మీరు దైత్వమా
అద్వైతరూపములోన శివాశివశకె్తైక రూపిణివా
ఆదిశక్తి అనేకకోటి బ్రహ్మాండ జననీ
ఆత్మవిద్యా మహావిద్యా శ్రీవిద్యా శ్రీమాత రూపిణీ!

త్రికోణిరూపిణి శక్తిఃబిందురూప శివహ
త్రిపురా త్రిగద్వంద్యా త్రిమూర్తి సిద్ధేశ్వరీ
త్రివర్గ రాత్ర సుభగా త్రయంబికా త్రిగుణాత్మకా
త్రికోణాంతర దీపికా తేజోవతీ భగవతి భగమాలినీ

పరంజ్యోతి పరంధామ పరమాణః పరాశక్తిః
ప్రజ్ఞాన ఘన రూపిణీ మద ఘూర్ణిత రక్తాక్షీ
పరా ప్రత్యక్షిరారూపా పశ్యంతీ పరదేవతా
పంచ ప్రేతాసనాసీనా పంచబ్రహ్మస్వరూపిణీ

అంబ దివ్యాంబరాయై అయ్య దిగంబరాయుడే
జగజ్జనన్యై జగదేవ పిత్రేనమః
బంగారు ఆభరణాలతో ప్రకాశించు అమ్మ
భుజంగముల భుజములతో సుందరుడు అయ్య

అర్ధనారీశ్వర రూపం అద్వైత సారంశరీ
అంబరూపములో శివశక్తి సమ్మేళనమే సర్వస్వం
అమ్మలేనిదే అయ్య లేడు అయ్యలేనిదే అమ్మలేదు
ఆదిమధ్యాంత రహితం అనంత శక్తి అనంత పద్మనాభం

ఆగమ కోవిదులు నిన్ను బ్రహ్మపత్ని సరస్వతిగా
హరిపత్ని పద్మగా హర సహచరి హిమాద్రి తనయగా
నీవు ఈ మువ్వురిలో ఎవ్వరూ కాదు పరబ్రహ్మమహిషీ
నీవు మహిమోపేత మహామాయవు విశ్వభ్రమణ కారిణివి తురీయవు
రుద్రుడు పురుషుడు ప్రకృతి ఉమ
రుద్రుడు బ్రహ్మ ఉమ వాణి
రుద్రుడు విష్ణువు ఉమ లక్ష్మి
రుద్రుడు సూర్యుడు ఉమ ఛాయ
రుద్రుడు సోముడు ఉమ తార
రుద్రుడు పగలు ఉమ రాత్రి
రుద్రుడు యజ్ఞం ఉమ యావేది
రుద్రుడు అగ్ని ఉమ స్వాహాదేవి
రుద్రుడు వేదం ఉమ శాస్త్రం
రుద్రుడు వృక్షం ఉమ తీగ
రుద్రుడు పుష్పం ఉమ గంధం
రుద్రుడు అర్థం ఉమ అక్షరం
రుద్రుడు లింగం ఉమ పాణివట్టం
రుద్రుడు అవ్యక్తం ఉమ వ్యక్తం
రుద్రుడు ప్రణవం ఉమ ఓంకారమధ్యమం
ఉమారుద్ర ఉమా కలయిక శివశక్తుల ప్రణవం
ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః

శంకరార్థాంగ సౌందర్య శరీరాయై
మహాతిశయ సౌందర్య లావణ్యాయై
నవావరణ నవరాత్రుల నర్మగర్భ రహస్యం
సృష్ఠ్యారంభంలో వ్యాకోచం ప్రళయంలో సంకోచం

శ్రీచక్ర నవావరణ శ్రీచక్ర రహస్యం
త్రిపుర సుందరీ దేవి విలాపం లలితాదేవి లాస్యం
శ్రీచక్రం మాతృకా యంత్ర రహస్య అక్షర మాల
శ్రీరాజరాజేశ్వరి శ్రీలలితాపరమేశ్వరి
శ్రీచక్ర మధ్య బిందు రూపిణీ

-ఆర్. లక్ష్మణమూర్తి 7207074899