Others

శ్రీ సాయి గీత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక గట్టు శ్రద్ధ, రెండవ గట్టు దైవంపట్ల సంపూర్ణమైన విశ్వాసం ఈ రెండూ వుండినప్పుడే ఈ జీవితమనే నది అనుగ్రహమనే సాగరంలో లీనమైపోతుంది. గట్టులు లేని నది, గట్టులు తెగిన నది ఈ విధంగా గ్రామాల మీద, పట్టణాలమీద పడి బీభత్సం సృష్టిస్తుందో, జీవితంమీద శ్రద్ధ, దేవునియందు విశ్వాసంలేని మనిషి ప్రవర్తన ఫలితంకూడా సమాజంపై అదే విధంగా ఉంటుంది. ఈనాడు సమస్త అనాచారములకు మూలకారణం జనం ఆధ్యాత్మికతను కోల్పోవడమే.
జోలపాటలో జ్యోతి ప్రకాశం
‘‘ఓంకారమనియేటి ఒక తొట్టిలోనూ
తత్వమసి అనియేటి పరుపు తాపరచి
ఎఱుకనే బాలుణ్ణి ఏమరక ఉంచి
ఏడు లోకమువారు ఏకమై ఊచ...
జో...జో...
‘ఓం’కారమనే తొట్టిలో తత్, త్వం, అసి అనేటటువంటి పరుపువేసి, ‘ఎఱుక’అనే బాలుడికి ఏమరక. ఏడు లోకములవారు ఏకాత్మభావంతో జోకొట్టి ఆనందించారని అర్థము. ‘ఎఱుక’అనగా ఆత్మ, ప్రజ్ఞానము, చైతన్యము, బ్రహ్మ కనుక ఇలాంటి బాలుణ్ణి నేను కేవలం నా కుమారునిగా భావించుకోవడం చూస్తే నేను ఎంత అజ్ఞానురాలునని భావించేవారు తల్లులు ఆ కాలంలో. వారు సత్యాన్ని గుర్తించి, పిల్లలకు బోధించి, దివ్యత్వమైన ఆత్మతత్త్వమును జోల పాటలలోనే అనేక రకములుగా నూరిపోసేవారు. కనుకనే ప్రాచీన కాలమునందలి పవిత్రమైన చరిత్రలు బాల బాలికలయందు ప్రతిబింబించేవి.
భజగోవిందం
శంకరుడు కాశీలో వుండగా ఒక బ్రాహ్మణుడు పాండిత్యం సంపాదించే దానికి పడుతున్న శ్రమను గమనించాడు. అతనికి సలహాయిచ్చాడు.
‘్భజ గోవిందం, భజ గోవిందం
గోవిందం భజ మూఢమతే!
సంప్రాప్తే సన్నిహితే కాలే
నహి నహి రక్షతి డుకృఞ కరణే’
‘డుకృఞ కరణే’అంటూ వ్యాకరణ సూత్రాలు వల్లెవేస్తున్నావు. కాని అవి మరణం సంప్రాప్తమైతే నిన్ను రక్షించవు. కనుక గోవిందుని భజించు. ఏనాటికైనా మానవుడు అర్థంచేసుకోవలసిన అంశం ఇదే!
పొట్టకూటికా విద్య?
రావణాసురుడు గాని, దుర్యోధనుడు గాని శక్తిసామర్థ్యముల లోపల ఎవరికినీ ఏమాత్రం తీసిపోనటువంటి వారు. వీరి శక్తులు అనంతమైనటువంటివి. కాని వీరి మనస్సులలో మాలిన్యం చేరింది. అందుకే వారికి పతనం తప్పలేదు.
కనుక, మానవత్వాన్ని ప్రకాశింపజేసేటటువంటివీ, వికసింపజేసేటటువంటివీ సరియైన విద్యలు. ఏదో పొట్టనింపుకొనే నిమిత్తమై విద్యల నార్జిస్తున్నాం. పొట్టలు నింపుకోవటానికి మానవుడిగానే పుట్టలా? కుక్కలు, నక్కలు, కోతులు పొట్టలు నింపుకోవటం లేదా? కాదు... కాదు... హృదయాన్ని పండించుకొనే నిమిత్తమై విద్యలుకావాలి. ప్రేమ నింపుకొనే నిమిత్తమై విద్యలుకావాలి. విజ్ఞాన సుజ్ఞాన ప్రజ్ఞానములు ప్రకటింపజేసే నిమిత్తమై విద్యలు కావాలి. అటువంటి విద్యలనందించే బోధ గురువులు కావాలి గాని విషయ వ్యామోహాన్ని బోధించే బాధ గురువులెందుకు?
అలసస్య కుతో విద్యా
అవిద్యస్య కుతో ధనం
అధనస్య కుతో మిత్ర
అమిత్రస్య కుత స్సుఖం?
బద్ధకస్తునికి చదువు, చదువు లేనివానికి సంపాదన. సంపాదన లేని వానికి మిత్రులు, స్నేహితులు లేని వానికి సుఖం ఎలా లభిస్తాయి?
సాధన యోగం
తొలి దశ
ఆధ్యాత్మిక సాధనలో మొదటి మెట్టు నిర్ణీత సమయాలలో పూజచేయటం. స్తుతులూ, కీర్తనలూ చదవటం, భజన చేయటం. కొందరు అడవులకు వెళ్లి ఘోర తపస్సుచేసి భగవత్సాక్షాత్కారం పొందారు. అయితే తొలి దశలో శ్రద్ధాసక్తులతో అర్చన, భజన, ఆరాధనాచేయటం ఎంతో ప్రయోజనకరంగా వుంటుంది. తృప్తినీ, సఫలతనూ కలిగిస్తుంది.
ఇంకా ఉంది
*
శ్రీ సాయ గీత - భగవాన్ శ్రీ సత్యసాయ సందేశ సారాంశ సుమమాల
- కూర్పు, సమర్పణ : శ్రీ వేద భారతి , హైదరాబాద్ , వెల:రూ. 100/-లు.