Others

జ్ఞానదీపం.. దీపావళి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రాగ్జ్యోతిష పుర పాలకుడు నరకుడు
అదితికుండలాల తస్కరణ,మణిపర్వత వశం పరుచుకున్న దానవుడు
మహేంద్రుని విన్నపం, హరి అడుగులు కదిలెను నరకవధకై
వెంటబడెను సత్యభామ సమరమును తిలకించుటకు

రణరంగం అది విహారస్థలం కానేరదది
అతి అత్యంత భయంకమదంటూ వారించె మురారి
సత్యభామ అంగీకరించక మొండిగా అడుగులుకదిపెను
పక్షీంద్రునిపై నెక్కి వచ్చిరి పూరించె పాంచజన్య శంఖమున్ శ్రీకృష్ణుడు

ధ్వనిని విని లేచెను నీటిలో నిదురించుచున్న మురాసురుడు
మురుడి ఐదు 3శిరంబులు2 ఖడింపబడెను
పిదప మురుడిని 3ఏడుగురు2 కుమారులను వధించె శ్రీకృష్ణుడు
నరకాసురుని గాంచినంతనే కోపోద్రిక్తయై లేచి నిలబడె సత్యభామ

శ్రీకృష్ణుడు ఆశ్చర్యంతో సత్యభామను గాంచి పల్కెను
లేమా దనుజల గెలువగ, లేమా నీవెలకడగి లేచితివిటురా
లే మాను మానవే నౌ, లేమా విల్లందికూనుము లీలంగేలన్2
శోభించె భామ శృంగార వీర రౌద్ర రసాలను కలియబోసి

చక్రమునుపయోగించి నరకాసుడి శిరంబుత్రుంచె
గురిపించిరి పుష్పవృష్ఠిని దేవతాగణము లెల్ల
మగువ మగవారి ముందర మగతనమును చూపె
భూమాత సమర్పించె అదితి యొక్క కుండలములన్

చెరవిడిపించి పదునారువేల యువతులను పరిగ్రహించి పంపెను ద్వారకకు
శ్రీకృష్ణుడు కుండలముల నొసంగె అదితికి అతి సంతసంతో
పారిజాత వృక్షమును కోరె సత్యభామ మదమెక్కి ప్రతిఘటించె ఇంద్రుడు
మనిషిలో ధనమద మావరించిన వేళ లక్ష్యపెట్టడు మాధవుడిని కూడా

దీపావళి వేడుక
ధరించు నూతన వస్త్రం భజించి పూజించు ధనలక్ష్మి దేవిని
ప్రారంభించు నూతల లెక్కల దస్త్రం భుజించు తీయని భక్ష్యములను
పెంపొందించు మానవ ధర్మాచరణ చూపించు సకల జీవులపై దాక్షిణ్యం
త్యజించు దురాశామోహములను తరించు సచ్చిదానంద కాంతులను దర్శించి

బిందువుల సమ్మేళనం సింధువు అనంతాకాశపుటంచులు చుంబించు
స్థంబాకార అరుణకిరణాల వెలుగులు కురుసెను భూమాతపై
బింమాతర్గత ప్రభల మోక్షకాంతి చీకట్లను దునిమె
జ్యోతిర్లింగాకారమై ప్రజ్వలించె దివ్వెల కాంతి కిరణ గుచ్ఛములు

దీపారాధనం దీపకాంతుల జ్ఞాన ప్రసారం సకల శుభారంభం
ప్రణవ శంఖారావం నొసగు వీనుల విందు పరమానందంతో చిందులు
తేజోమయం జగత్సర్వం దివ్యకాంతుల మయం
విశ్వవ్యాపకం విష్ణువక్షస్థల వాసిశ్రీమహాలక్ష్మీదేవి చూపుల కాంతులు

వేచిచూడడమే వేడుక వేదన లేని సాధన
చూచి తరించు దేహాలయ గోపుర ఆకాశ దీపం శ్రీశైల శిఖరాగ్రం
అదొక అలౌకిక రసధామం మధుర భావాల నిలయం
శారదానిలయ భ్రుకుటి మధ్య ప్రచోతనమైన 3్భర్గ2

పడిలేచే కడలి తరంగం జీవితం కొడిగట్టి రెపరెపలాడుతున్న దీపం
అజ్ఞాన తిమిర సంద్రం లగరుతో పని లేని దీపస్తంబం జ్ఞానం
జ్ఞాన కుసుమ పరాగం జీవిత పుష్పవికాస విలాసం
వేచియుండకుము సంధ్యాసమయ అంతం వరకు మేలుకో
తిరిగి రాదు పోయిన సమయం
ఎటుపోతుందో ఈ జీవిత పయనం
మనసా చూడు ఇదే నీ లోకం చీకటి గొయ్యారం
పుట్టిన గూటికే చేరుకో కల్లోలములేని దీపావళి వెలుగులో కలసిపో!

- ఆర్.లక్ష్మణమూర్తి, 7207074899