Others

విద్యతో బాలల భవిత బంగారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిరక్షరాస్యత నిర్మూలనే ఏకైక ధ్యేయంగా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తూ పథకాలెన్నో అమలుచేస్తున్నా, భారతీయ బాలలందరికీ విద్య గగన కుసుమమే అవుతున్నది. అందరికీ విద్య ధేయంగా, సార్వత్రిక విద్యా వ్యాప్తియే లక్ష్యంగా, ప్రభుత్వాలు చిత్తశుద్దితోకృషి చేస్తున్నా వివిధ కారణాలవల్ల అధిక శాతం పిల్లలు విద్యాగంధం సోకక బాలకార్మికులుగానే ఉండి పోతున్నారు. బాలల శ్రేయస్సుకై కృషి ఎంతో జరుగుతున్నా లక్ష్య సాధనలో సత్ఫలితాలను అందించ లేకపోతున్నది. పాఠశాల సౌకర్యాలు లేక కొందరు, ఉన్నా వివిధ కారణాల చేత బడికి వెళ్లలేక మరికొందరు తమ ఉజ్వల భవిష్యత్తును అంధకారమయం చేసుకుంటున్నారు. రాజకీయ, ఆర్థిక, సామాజిక అంశాలతో ముడివడి, ప్రభుత్వ సంక్షేమ పధకాలలో లోపాల మూలంగా గ్రామీణ జీవితం బరువై, జీవనోపాధి కరువై, చదువు నేర్పించే స్తోమత లేక ఎందరో పేద తల్లిదండ్రులు గత్యంతరం లేనిస్ధితిలో పసి వయసులోనే చిన్నారులపై భారాన్ని మోపుతున్నారు. హోటళ్లు, కిరాణా దుకాణాలు, వ్యవసాయ కూలీలుగా, చివరకు భిక్షకులుగా అధికశాతం బాలకార్మికులు చేయని పనంటూలేక అనుక్షణం శ్రమిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలకు నీళ్లువదిలి వెట్టిచాకిరి చేయించుకుంటున్నా, విముక్తికలిగించడంపై దృష్టి కేంద్రీకరించక పోవడం బాధాకరం. యజమానులు చెప్పిందే చట్టంగా, వారు చేసేదే సంక్షేమంగా, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నా అధికారులు ఏనాడూ పట్టించుకున్న దాఖలాలేవీ కానరాక పోవడం విచారకరం. 14సంవత్సరాల లోపుపిల్లలందరికీ ఉచిత నిర్భంధ విద్య అమలు చేయాలని భారత రాజ్యాంగంలోని 24వ నిబంధన స్పష్టం చేస్తున్నా అది కాగితాలకే పరిమితమవడం శోచనీయం. ఆర్ధిక లేమివల్ల గ్రామీణ ప్రాంతాల్లో పసిపిల్లల బంగారు కలలు చెదిరి పాల బుగ్గల లేత వయసులో పాలేర్లుగా మారడం బాధాకరం. కార్మిక చట్టాలకు విరుద్దంగా పిల్లలతో పనిచేయించే యాజమాన్యాలు తగిన వేతనాలు అందించక, భద్రతా సౌకర్యాలు కల్పింక పోవడం ఆక్షేపణీయం. ప్రాధమిక హక్కులను పేర్కొన్న రాజాంగం లోని 3వ ప్రకరణంలోని 15(3)వ అంశం బాలల కోసం ప్రత్యేక శాసనాలు చేసే అధికారం ప్రభుత్వానికి కలుగజేస్తున్నది. 23వ అధికరణం ప్రకారం బాలలను వ్యాపార వస్తువుగా మార్చడం, నిర్భంధ సేవ అపరాధాలుగా పేర్కొన బడుతున్నది. 14సంవత్సరాలలోపు పిల్లలను కర్మాగారాలలో, గనులలో, ఇతర ప్రమాదకరమైన పనులలో నియమించడాన్ని 24వ ఆర్టికల్ నిషేధించింది. 39(ఇ) లేత వయసులోని బాలలు, వారి వయసుకు తగని, శక్తికి మించిన పనులలో వారి ఆర్ధిక పరిస్ధితిని సాకుగా చేసుకుని నియమించడం నిషేధించాలని ప్రభుత్వాలను ఆదేశించింది. ఇలాచట్టాలు ఎన్ని ఉన్నా చాలామంది పిల్లలు బాల కార్మికులుగానే మిగిలిపోతున్నారు. భారత రాజ్యాంగంలో పేర్కొనబడిన నిర్భంధ ప్రాథమిక విద్య, ఈనాటికీ ఫలించని కలగానే మిగిలిపోతున్నది. ప్రపంచ బాలకార్మికుల్లో, మూడవ వంతు భారత దేశం లోనే ఉన్నారని ఒక అంచనా. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలించడానికి, నిర్భంధ ప్రాథమిక విద్య అమలుకు చిత్తశుధ్థితో కృషి సల్పుతూ, పిల్లల తల్లిదండ్రుల అర్థిక, సామాజిక నేపథ్యాన్ని సరియైన రీతిలో అంచనావేసి, ప్రభుత్వ పరంగా తగు ఆర్థికసాయం అందించి, తద్వారా పిల్లల చదువుపట్ల వారిలో అవగాహన పెంపొందించి, అవసరమైతే బాలకార్మికులకు వసతి గృహాలుగల ప్రత్యేక పాఠశాలలను ఏర్పాటుచేస్తే, తల్లిదండ్రుల తోడ్పాటుతో, అధికారుల చొరవతో, ఔత్సాహికులైన విద్యార్థులు విద్యాభ్యాసం కొనసాగించే అవకాశం ఉండగలదని మేధావులు, విద్యావేత్తలు, అనుభవజ్ఞులైన విద్యాభిమానులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

-సంగనభట్ల రామకిష్టయ్య 9440595494