Others

సత్యం శివం సుందరం సృ స్థి ల (సృష్టి స్థితి లయ) 2 వ భాగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

15
తూర్పులోని సూర్యుడి కోడి రాత్రి కన్న కలల్ని
కిరణగళంలో తరుణగీతంలా ముఖరిస్తుంటే
ఎన్ని జ్ఞాపకాల ప్రవాహాలు ఎనె్నన్ని హృదయ బాలిత విహారాలు..?
కాలం ఎప్పుడూ గమిస్తునే వుంటుంది
కనుకనే ప్రత్యభిజ్ఞ ప్రతి అణువులోను
పరామర్శ సూత్రాలను పదిలంగా మోస్తూనే వుంటుంది
ఒడిగట్టుకున్న నీటి నానబ్రాలుతో
కడలి కౌగిలి చేరటం కన్నా ముందు
ఆ ఒడిని సస్యకేదారాల మడి చేస్తుంది
అందుకనే పరుగిడుతున్న ప్రవాహం
స్మృతుల పౌరాతన్యాన్ని అంచులు జారుస్తున్న హృది
శోకంతో కుమిలి దిగులు గొంతులోంచి జీవుని వేదన శ్లోకమైన క్షణం
ఎవరి జ్ఞాపకాలకు ఎవరు గ్రంథస్థం అయ్యారో
అప్పటినుంచి అక్షరాలలోనే బ్రతుకుతోంది అనాది ధ్యాస..
బ్రద్దలైన గుండెలోంచి పుట్టుకొచ్చేదేమిటి
జీవ చైతన్య ప్రాభాత శైశవానికి
గర్భస్థ జ్ఞాపకాల గాయమే మెలికలు తిరిగిన చైత్రశ్వాస
ఎన్ని శిశిరాలను భరించింది ఏటి గట్టి చెట్టు
ఆకుపచ్చ సంతకానికే కదా అంతశే్చతనా కలితమైందీ గుట్టు
రాలిపడ్డ జ్ఞాపకాల గింజే కదా
ఆకారం చెక్కుకున్న భూరి భూజం
మనసులోనే వుంది ఆదిమనిశ
ఆ మనసులోనే అది నిత్యం తూర్పు దిశ..
ఇంకాఉంది

- సాంధ్య శ్రీ 8106897404