Others

పశువృద్ధే పశు సంరక్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రమ, తెలివితేటలు తప్ప మరో పెట్టుబడిలేకుండా సేంద్రియ ఎరువును తయారుచేయవచ్చును. ఆయన ఆశ్రమాలలో మలమూత్రాలను ఒక లోతు తక్కువ పొడుగాటి గోతులలోకి పంపి మట్టి కప్పేవారు. అడుగు లోతులోపల మట్టిలో వుండే సూక్ష్మజీవులు మలాన్ని వేగంగా ఎరువుగా మార్చేయగలవు. లోతుగా పాతేసిన మలం, చెత్త చెడు వాయువులను ఉత్పత్తి చేస్తాయి. గాలిని కలుషితం చేస్తాయి. ఇలా పారిశుద్ధ్య పనిని, రైతు పనిని కలిపి నిర్వహించటం సాంప్రదాయ రైతులకు నచ్చేదికాదు. రసాయన ఎరువుల కంటే సేంద్రీయ ఎరువులనే గాంధీ ఇష్టపడేవాడు. తక్కువ కాలంలో ఎక్కువ దిగుబడి కోసం రసాయన ఎరువులను వినియోగించటం ప్రమాదకరమని ఆయన నమ్మేవాడు.
నాగలి బదులు ట్రాక్టరు వాడకం కూడా ఆయనకు ఇష్టం ఉండేది కాదు. సబర్మతీ ఆశ్రమంలో ఆయన దాదాపుగా అన్ని రకాల కొత్త నాగళ్లనూ ప్రయోగించి చూశాడు, వాటిలో సాంప్రదాయమైన ఎద్దుల నాగలే మంచి ఫలితాలనిచ్చినట్లు రుజువయ్యింది. పంట పండేందుకు ఎంత లోతు అవసరమో అంతవరకే అది దున్నుతుంది, నేలను నాశనం చేసేంత లోతులకు వెళ్లదు. దాంతోబాటు వందలాది మంది మనుషులు చేసే పనిని తానొక్కటే చేసే యంత్రాల వినియోగం ఆయనకు అసలు ఇష్టముండదు. యంత్రాల వాడకం రైతుల సృజనాత్మకశక్తిని మొద్దుబరుస్తుందని ఆయన భయం. తరాలనుంచి వస్తున్న చిన్న కమతాల సాగు ఆయనకు నచ్చేది కాదు. వందమంది రైతు కుటుంబాలు కలిసి విశాలమైన భూమిని సాగు చేసి వచ్చిన దిగుబడిని 100 భాగాలు చేసి పంచుకోవాలని ఆయన సూచించేవాడు. ప్రతి ఇంటికీ ఒక జత ఎద్దులు, బండీ ఉండటం వృధా అని ఆయన భావించేవాడు. సామూహిక పశువుల పెంపకంవల్ల పశువులకు సరైన చికిత్స, ఆహారానికి తగినంత పచ్చిక బయళ్లు, విత్తనానికి మంచి ఆబోతుల నిర్వహణ సాధ్యమవుతుంది. చాలాసార్లు పశువుల దాణాకి వాటి దిగుబడికన్నా ఎక్కువ ఖర్చవుతుంది. పశువుల సంఖ్య పెరిగినకొద్దీ బీదరికంవల్ల రైతు దూడలను అమ్మేస్తాడు, దున్నపిల్లలను చంపేస్తాడు లేదా వాటికి ఆహారమివ్వకుండా మాడుస్తాడు. పశువులపట్ల క్రూరంగా వ్యవహరిస్తూ వాటి బాగోగులు పట్టించుకోకుండా ఉంటాడు. వ్యవసాయ ఆర్థిక వ్యవస్థకు సంబంధించినంతవరకూ అత్యంత విలువైన ఆవును సంరక్షించడంపై గాంధీ చాలా శ్రద్ధ చూపేవాడు. భారతదేశం అంతటా ఆయన చేసిన యాత్రలలో కాంతివిహీనమైన కళ్లతో వున్న రైతులు, ఆవుల దయనీయ స్థితిని చూసి ఆయన చాలా దుఃఖించేవాడు. ఆవును పవిత్రంగా భావించే భారతదేశంలోనే భూమి మీద ఎక్కడా లేనంతగా ఆవులను, వాటి జాతిని అవమానిస్తున్నారు, దురుపయోగం చేస్తున్నారు. ఆవును పవిత్రంగా చూడటమంటే, ఆవులను వధిస్తున్నారని ముస్లింలతో హింసాత్మకమైన ఘర్షణలకు దిగడం, ఆవును ముట్టుకొని మనల్ని మనం పవిత్రం చేసుకొనేందుకు తోసుకుచావడంగా మారిపోయింది. చాలా గోశాలలు, పశువుల శాలలు క్రూరమైన హింసకు నిలయాలుగా మారిపోయాయి. పాలు ఇవ్వలేని, వికలాంగ పశువులను సంరక్షకశాలలు సంరక్షించాలని, పశువుల జాతి అభివృద్ధికి తగిన సలహాలు ఇవ్వాలని ఆయన కోరుకొనేవాడు. బాగుంటాయనే కారణంతో గేదెపాలు, గేదె నెయ్యిలకన్నా, ఆవు పాలు, ఆవు నెయ్యిలనే గాంధీ ఎక్కువగా ఇష్టపడేవాడు. ఆవు మరణించిన తర్వాత దాని చర్మం, ఎముకలు, ఇతర శరీర భాగాలు అన్నీ ఉపయోగపడతాయి. కాబట్టి ఆయనకు ఆవులంటే చాలా ఇష్టం.
ఆశ్రమంలోని గోశాలలో గాంధీ మంచి జాతి ఆబోతులను పోషించేవాడు, చవకైన ఆదర్శమంతమైన ఆవుల పాకను నిర్వహించేవాడు. గోశాలకు సంబంధించిన ప్రతి చిన్న విషయం స్వయంగా చూసుకొనేవాడు. కొత్తగా పుట్టిన లేగదూడలను ప్రేమగా నిమురుతూ పలకరించేవాడు. ఒకసారి ఒక దదూడ వైద్యం లేని జబ్బుతో బాధపడుతోంది. అప్పట్లో ఆ జబ్బుకి ఎలాంటి మందులూ అందుబాటులో లేవు. గాంధీ దాని జీవితాన్ని ముగించేయాలని నిర్ణయించాడు, వైద్యుడు దానికి మందిచ్చే సమయంలో స్వయంగా దగ్గరున్నాడు.
*
బహురూపి గాంధీ
రచయత : అనుబందోపాధ్యాయ
తెలుగు సేత: నండూరి వెంకట సుబ్బారావు
(2014లో అనువదించారు)
ప్రతులకు - మంచి పుస్తకం
12-13-439, వీధినెం.1. తార్నాక,
సికింద్రాబాద్-17.. 94907 46614