Others

త్యాగమే జాతికి మహోదయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందుకే ఆయన తనకు వచ్చిన బహుమతులను ముఖ్యంగా తక్కువ జీవితకాలం గల బహుమతులను వేలం వేయాలని నిర్ణయించాడు. బహిరంగ సమావేవాశాలలో ఆయన వేదికమీద కూర్చుని ‘నా ప్రియమైన బాలికలు ఇక్కడ ఎవ్వరూ లేరు. కాబట్టి నాకు ఈ దండలను ఎలా వినియోగించాలో తెలియడంలేదు. ఎవరైనా ఈ దండను కొనుక్కుంటారా?’’ అని అడిగేవాడు. ‘‘రెండు రూపాయలు ఒకటోసారి, మూడు రూపాయలు, ఐదు రూపాయలు...’’ ఆయన సరదా ధోరణిలో సాగిపోయేవాడు. ఇంత ఖరీదు నిమ్మపండు, పూలదండ లాంటి చిన్న వస్తువులకే. ఒక్కోసారి ఒక్కో దండ 30 రూపాయల నుంచి 300 రూపాయల వరకూ అమ్ముడుపోయేది. ఈ వేలంపాటలో వస్తువులకు ఎక్కువ ధరలు చెల్లించడంలో గ్రామీణులేం వెనుకబడేవారు కాదు. ఒకసారి గాంధీ ఒక నగిషీలు చెక్కిన పెట్టెను వేలం వేస్తూ ‘‘దీని ఖరీదు 250 రూపాయలు. కాదు నేను పొరబడ్డాను 75 రూపాయలు’’ అన్నాడు. ఎవరో 300 రూపాయలు అన్నారు. ‘‘ఆ 300 రూపాయలు, 300 రూపాయలు. రండి బాబూ రండి, 300 రూపాయలేనా? ఒకసారి నేనిలాంటి పెట్టెను 1000 రూపాయలకు అమ్మాను’’. మూడు సందర్భాల్లో కోల్‌కతా పౌరులు ఆయనకు ఘనంగా సన్మానం చేసి ఎంతో ఖరీదైన నగిషీ పెట్టెలను బహూకరించారు. ఆయనా ఆ మూడింటిని అక్కడే వేలం వేశాడు. ‘‘మీరిచ్చిన బహుమతులను వేలం వేస్తున్నానని మీ ప్రేమను కించపరిచినట్లు భావించవద్దు. ఈ పెట్టెలను నేను నాతో తీసుకెళ్లలేను. వీటిని తీసుకెళ్ళేందుకు నా వద్ద పెట్టెలేదు, నా ఆశ్రమంలో వీటిని ఉంచడానికి తగిన వసతీ లేదు’’ అనేవాడు. ‘‘ఇలా వేలం వెయ్యడంలో తప్పేమీ లేదని నా ఉద్దేశ్యం. అవి ఆరోగ్యకరమైన పోటీని ప్రోత్సహిస్తాయి. ఒక మంచి కారణం కోసం విరాళమిచ్చే లక్షణాలను స్ర్తి, పురుషులలో ప్రేరేపించేందుకు ప్రమాదం లేని పద్ధతులివి. నా వేలం పాటలలో పాల్గొనేవారు కేవలం నన్ను సంతోషపెట్టేందుకే పెద్ద ధరలు చెల్లించడం లేదని మనం గమనించాలి. వారి ధనం ఒక ఉదాత్త ఆశయం కోసం వినియోగించబడుతుందని వారికి తెలుసు.’’
ధారాళంగా విరాళాలిచ్చేలాగా ఆయన ఆహుతులను ప్రేరేపించలేని సందర్భం చాలా అరుదు. ఒక నిమ్మకాయను 10 రూపాయలకు, ఒక నూలు దండను 201 రూపాయలకు, బంగారు తకిలీని 5వేల రూపాయలకు, ఒక నగిషీ పెట్టెను 1000 రూపాయలకు ఆయన అమ్మాడు. ఒక సంస్థకు శంకుస్థాపన చేసినప్పుడు దానికి ఉపయోగించిన తాపీని, బొచ్చెను ఆయన వేలంలో 1000 రూపాయలకు అమ్మేశాడు. ఒకసారి వేలంపాటలో ఒక బంగారు లాకెట్ ధరించిన ఒక పిల్లాడిని చూసి చేతులు చాచారు. అతడి తల్లి ఆ పిల్లాడిని ఆయనకు అందించింది. ఆయన పిల్లాడిని ఎత్తుకొని, పిల్లాడి మెళ్ళో బంగారు లాకెట్‌ను వేలం వేశాడు.
ఒకసారి ఆయన ‘‘నా దగ్గర లెక్కలేనన్ని ఉంగరాలున్నాయి. వాటన్నిటినీ అమ్మేయాలనుకుంటున్నాను’’ అని ప్రకటించాడు. మూడుసార్లు వేలంలోకి వచ్చిన ఒక ఉంగరం చివరికి 445 రూపాయలకు అమ్ముడుపోయింది. అప్పట్లో ఆ ఉంగరం ఖరీదు 30 రూపాయలు ఉండేది. ఒకసారి ఆయనకు వచ్చిన విరాళాల మూటలో చాలా కరెన్సీ నోట్లు, వెండి, రాగి నాణేలతో పాటు ఒక గవ్వ కూడా దొరికింది. ఆయన దానె్నంతగానో మెచ్చుకున్నాడు. ‘‘బహుశా ఏ పేదవాడి వద్దో ఇచ్చేందుకు ఏమీ ఉండి ఉండదు. అందుకే తన వద్ద ఆఖరిగా మిగిలిన గవ్వను ఇందులో వేశాడు. అతని త్యాగాన్ని పరిగణనలోకి తీసుకున్నపుడు ఇది బంగారం కంటే విలువైనది’’ అన్నాడు. ఆయన అన్నట్లే అది బంగారు గవ్వకంటే ఎక్కువ ధరకు అమ్ముడుపోయింది. ఒక అభిమాని 111 రూపాయలు చెల్లించి దాన్ని స్వంతం చేసుకున్నాడు.
తీరికలేని ప్రయాణాలు, ఖాళీలేని కార్యక్రమాల భారం, నిరంతరం ఎదురయ్యే చిక్కు సమస్యల వత్తిడి ఆయనలోని ఉత్సాహాన్ని, వైశ్య లక్షణాన్ని అణగార్చలేకపోయాయి. 78 ఏళ్ళవయసులో హిందూ, ముస్లిం మత కలహాలు, ఉద్రిక్తతల ఒత్తిడి తీవ్రంగా వున్న సమయంలో బీహార్‌ను గాంధీ సందర్శించాడు. మత కలహాలలో నష్టపోయిన మస్లింల కోసం విరాళాలు పోగుచేశాడు.
*
బహురూపి గాంధీ
రచయత : అనుబందోపాధ్యాయ
తెలుగు సేత: నండూరి వెంకట సుబ్బారావు
(2014లో అనువదించారు)
ప్రతులకు - మంచి పుస్తకం
12-13-439, వీధినెం.1. తార్నాక,
సికింద్రాబాద్-17.. 94907 46614