Others

గీతాయజ్ఞం పరమపద సోపానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కలియుగంలో జనించిన మానవులు తమపుట్టిన రోజును వైభవంగా, ఆడంబరాలతో, తమ తమశక్త్యానుసారంగా జరుపుకుంటూ ఆనందించడం భారతదేశంలో ఒక సంప్రదాయ వేడుకగా మారింది. శ్రీకృష్ణ్భగవానుడు కురుక్షేత్ర సంగ్రామమున అర్జునునికి గీతోపదేశం చేసిన పవిత్ర పుణ్యదినము. మార్గశిరశుద్ధఏకాదశి కావున ఆ సుదినమును మహాపర్వదినమగా భావింపబడుచున్నది. గీతాచార్యుడు ‘మార్గశిరమును గీతలో మాసానాం మార్గశిర్షోహం అంటూ మార్గశిరమాసాన్ని నేనేనన్నారు.
శ్రీరామకృష్ణ, బుద్ధ, దత్తాత్రేయ, ఆదిశంకరుల జయంతి మున్నగు ఉత్సవములు జరిగే పవిత్ర దినాలలో ఆయా అవతార పురుషులకు జనులు ఏరీతిగా అర్చిస్తారో శ్రీగీతాజయంతి రోజున కూడా గీతాగ్రంథమును గీతామాతగా భావించడమేకాక ఆగీతాదేవిని అర్చించు సంప్రదాయం ఎంతోప్రశస్తిగా సాగుతోంది.
వీటిఅన్నింటికన్నా ముఖ్యమైనది గీతబోధను రోజు పారాయణం చేయడంతో పాటుగా అందరూ గీతను నిత్యజీవితంలో ఆచరించేలాగా చేసుకోవడం నేటి యుగంలో ఎంతో అవసరమై ఉంది. గీతలో ఒక్క శ్లోకం చదివినా దాని వల్ల ఎంతో పుణ్యఫలం దక్కుతుంది అనడంలో అంతరార్థం ఆ ఒక్క శ్లోకానైన్నా ఆచరణలో పెట్టుమని చెప్పడమే. ఇరువది మూడు శ్లోకాలతో గూడిన వరాహపురాణాంతర్గత గీతామాహాత్మ్యము ఎక్కువగా వాడుకలో ఉంది. శ్రీమహావిష్ణువును భూదేవి అచంచలభక్తి ఎలా లభిస్తుందని ప్రశ్నించగా శ్రీహరి భూదేవికి ఇలా ఉపదేశించాడు. ప్రారబ్ధకర్మను అనుభవిస్తూ ఎవరైతే ఎల్లపుడూ గీతాభ్యాసమునందు నిమగ్నుడై ఉండునో అట్టి వాడే ముక్తుడౌతాడు. కర్మలచే అంటబడక జగతిలో సుఖాలనుభవించే మార్గం కేవలం గీతాభ్యాసం వల్లనే లభ్యవౌతుంది అని మహావిష్ణువు చెప్పాడు .
గీతాగ్రంథమున్నచోట, గీతాపారాయణలు జరుగుచోట ప్రయాగాది సర్వతీర్థములుంటాయి. సమస్త దేవతలు, ఋషులు, యోగులు, నాగులు, గోపాలురు, నారద , ఉద్ధవాదులు వచ్చి గీతాభ్యాసకులకు తోడుగా నిలుస్తారు. గీత ఉన్నచోట నేనుంటాను. గీతయే పరమ విద్య. బ్రహ్మస్వరూపం, గీత నాశరహితమైంది. నిత్యమైంది. అనిర్వచనీయమైంది. పరమానంద స్వరూపం. అని గీతాభగవానుడు స్వయంగానుడివినాడు.
గీతాతత్వమును తెలుసుకొన్నవారు పండితులచే గౌరవించబడుతారు. గీతాభ్యాసం ఉన్నతభావాలను వ్యాప్తి చెందిస్తుంది. గీతపై మక్కువ కలిగినట్లయితే వారిలో భక్తిశ్రద్ధలు అధికమవుతాయి. పరోపకారబుద్ధి ఏర్పడుతుంది. బ్రహ్మవిద్యాదానమునకును, గీతాజ్ఞాన వితరణమునకును, జనులకు నైతిక, ఆధ్యాత్మిక విలువలు పెంపొందుతాయి. గీతాకార్యక్రమాలు చేయువారు జ్ఞాన యజ్ఞం ఆచరించినవారు అవుతారు. గీతాభ్యాసకులు శ్రీకృష్ణపరమాత్మ అనుగ్రహానికి పాత్రులవుతారు. ఆధ్యాత్మిక భావాలు పెరిగి కల్మషరహితమైన వాతావరణం ప్రపంచాన నిలవాలంటే మత,కుల భేదం లేకుండా గీతాభ్యాసకులు కావాలి. గీతాప్రచారాన్ని భగవత్ కైంకర్యముగా తలచాలి. ముముక్షువులు, గీతాజ్ఞాన వ్యాప్తికి ప్రచారమునకు చేయూత నిచ్చి తాము తరించి ఇతరులను కూడా తరింపచేయుటకు యత్నించుచూ పరమాత్మ కృష్ణ భగవానుని అపారకృపకు ప్రతివారు పాత్రులు కావాలి.గీతాజ్ఞానం పొందినవారు గంగాస్నాన ఫలం పొందుతారు. గీతను చదివిన వారు కేవలం శారీరిక మాలిన్యం పోగొట్టుకున్నవారుకాక మనసు మాలిన్యాన్ని కూడా దూరం చేసుకొన్నవారు అవుతారు. గీత అన్న రెండు అక్షరాలల్లో గీ అంటే త్యాగమును, త అనగా తత్వమును అనగా గీత ఆత్మస్వరూపాన్ని ఉపదేశించుచున్నది.

- పి.వి. సీతారామమూర్తి 9490386015