Others

సత్యం శివం సుందరం సృ స్థి ల (సృష్టి స్థితి లయ) 2 వ భాగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిన్ను
హిమాలయాన్ని కుశలమడిగిన భాష
ఎంత చల్లనైనదో
సురలోకాన్ని చుట్టి వచ్చి సేచకాన్ని వంచింది
బిందుగతమైన బాంధవ్యం చినుకు జాలైంది..
ఏఱువాక ఏతంలా
తొలకరిస్తున్న తరుణానంద చక్రవాతాన్ని
ఎటు త్రప్పిందో కానీ
ఇతిహాస ద్వారానికి
ఇంద్రధనుసు తోరణం చేసింది
ఎవరి ఏకాంత తపోభూమికల్లో
ఒక గ్రీష్మబింబం ఉదయిస్తుందో
అది శబ్ద జ్వాలగా కావ్య సృష్టి జరుగుతుంది
ఎక్కడ చైత్రమనే చేతన
మరంద పుష్పాల మహానదికి చాళ్ళు దున్నుతుందో
అక్కడ జీవం ఎండ గొంతును తడుపుతుంది
ఎక్కడ
గలగలారావంతో చిటితరంగాల అరవొంకీల వొలికిస్తుందో
అక్కడ పొలం పచ్చని తడుముతుంది
కళ్ళతో తాగుతున్న లాలన పేరు గంగమాయి
బుగ్గలు పూరించుకొన్న గాలికి
ఆనంద స్వరంగా ‘బిస్మిల్లాఖాన్’
అందించిన
షెహనాయి

ఇంకాఉంది

- సాంధ్య శ్రీ 8106897404