Others

ప్రతి నిర్బంధం...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తన ఆసనంమీద కూర్చునే ముందు ఆంగ్లేయ సెషన్స్ న్యాయమూర్తి బోనులో ఉన్న దేశీయుడికి గౌరవంగా నమస్కారం చేస్తున్నట్లు తలపంకించాడు. విప్లవ కార్యకలాపాలకు గాను ఆయన గాంధీకి అరేళ్లపాటు సాధారణ జైలుశిక్ష విధించాడు. ‘‘మీతో రాజకీయంగా విభేదించేవారు కూడా మిమ్మల్ని ఉన్నతాదర్శాలు వున్న మనిషిగా, పవిత్రమైన సాధు జీవితం గడిపే వ్యక్తిగా గౌరవిస్తారు’’ అన్నాడు ఆ న్యాయమూర్తి. గాంధీ మాట్లాడుతూ, ‘‘్భరతదేశమంతా గౌరవించే దేశభక్తులు చాలామంది ఈ నేరం కిందే జైలుకి వెళ్ళారని నాకు తెలుసు. నాకూ ఇదే సెక్షన్ కింద శిక్ష విధించడాన్ని గౌరవంగా భావిస్తున్నాను. నేను నిప్పుతో ఆటలాడుతున్నానని నాకు తెలుసు, అయినా నేను అదే పని చేస్తాను’’ అన్నాడు.
గాంధీ కోర్టు గదిలోకి వచ్చి, వెళ్లిపోతున్నపుడు అక్కడున్నవారంతా గౌరవంగా లేచి నిలబడ్డారు. టెలిగ్రాంలో పోలీసులు ఆయనని ‘ముంబయి రాజకీయ ఖైదీ నం.50’ అన్న సంకేత నామంతో సంబోధించారు. ఆయన పేరును బారిష్టర్ల జాబితాలోంచి కొట్టేశారు. జైలులో ఆయన ఎత్తు, గుర్తింపు చిహ్నాలు నమోదు చేసుకున్నారు. ఆయనను ఒక ఒంటరి సెల్లులో వుంచారు. అంగవస్త్రం తప్ప ఆయన మరేమీ వేసుకోలేదు. అయినా ఆయన గజ్జల్లో తడిమారు, దుప్పట్లను తనిఖీ చేశారు. తన నీటి లోటాను బూట్లతో తనే్నంతవరకూ గాంధీ దేనికీ ఎదురుచెప్పలేదు. అప్పుడప్పుడూ ఈ ప్రవర్తనమీద అసహ్యంతో చికాకు కలిగినపుడు ఆయన సందర్శకులెవరినీ అనుమతించేవాడుకాదు, లేఖలేమీ రాసేవాడు కాదు.
గాంధీ నిర్బంధంలో ఉన్నప్పుడు ఎప్పుడూ ఆందోళన చెందలేదు. కటువుగా స్పందించలేదు. జైల్లోంచి బయటకు వచ్చిన ప్రతిసారీ ఆయన మెదడు మరింత క్రమశిక్షణ కలిగిందిగా, మరింత పదునుగా తయారయ్యేది. ఆయన దృష్టిలో వ్యక్తుల అలవాట్లను క్రమబద్ధం చేసుకొనేందుకు, మంచి పుస్తకాలతో స్నేహం చేసేందుకు లభించిన అవకాశం జైలు. ఆయనకు పుస్తకాలు చదవడమంటే చాలా ఇష్టం, కానీ జైలు బయట ఉన్నప్పుడు అనేక కార్యకలాపాలతో తీరిక లేకుండా ఉన్నందువల్ల పుస్తకాలు చదివేందుకు సమయం దొరికేదికాదు. జైలులో ఆయన అధ్యయనానికి కచ్చితమైన సమయం ఏర్పాటుచేసుకున్నాడు. ఆయన ఉర్దూ నేర్చుకున్నాడు, సంస్కృతం, హిందీ, గుజరాతీ, తమిళం, ఇంగ్లీషు పుస్తకాలు చదివేవాడు. రెండేళ్లలో ఆయన మతం, సాహిత్యం, సామాజిక శాస్త్రాల మీద ప్రముఖ రచయితలు రాసిన 150 పుస్తకాలు చదివాడు. గీత, ఖురాను, బైబిలు, బౌద్ధ, సిక్కు, జొరాస్ట్రియన్ మత గ్రంథాలు చదివాడు. రామాయణం, మహాభారత, ఉపనిషత్తులు, మనుస్మృతి, పతంజలి యోగ దర్శనం చదివాడు. 65 యేళ్ల వయసులో ఆయన తోటి ఖైదీనుంచి ఖగోళ శాస్త్ర ప్రాథమికాంశాలు నేర్చుకున్నాడు. నక్షత్రాలను పరిశీలించేందుకు జైలు అధికారులనుంచి టెలిస్కోప్ సంపాదించడంలో కృతకృత్యుడయ్యాడు.
జైలులో గాంధీ క్రమం తప్పకుండా ప్రార్థన చేసేవాడు. రోజుకు 4నుంచి 6 గంటల సేపు నూలు వడికేవాడు. చురుగ్గా నడిచేవాడు, ఆగాఖాన్ పాలెస్‌లో ఉన్నప్పడు 75 యేళ్ల వయసులో కస్తూర్బాకు, తన మేనకోడలి కూతురుకి భూగోళం, రేఖాగణితం, చరిత్ర, గుజరాతీ వ్యాకరణం, సాహిత్యం బోధించాడు. అంతకుముందు ఆయన చైనీస్ ఖైదీకి ఆంగ్లం, ఐరిష్ జైలరుకి గుజరాతీ నేర్పాడు. ఆయన పిల్లలకోసం జైలులో ఒక పాఠ్యపుస్తకం రాసాడు, దక్షిణాఫ్రికాలో సత్యాగ్రహ పోరాట చరిత్ర రాసాడు. ఉపనిషత్తులలో భారతీయ రుషులు రాసిన శ్లోకాలను ఆంగ్లంలోకి అనువాదం చేశాడు. అది ‘జైలునుంచి గేయాలు’(సాంగ్ ఫ్రమ్ ప్రిజన్) పేరుతో ప్రచురితమయ్యింది. ఆయన జైలునుంచి ఆశ్రమవాసులకు, సహచరులకు, జైలు అధికారులకు, గవర్నర్లకు, వైస్రాయిలకు, బ్రిటిషు ప్రధానమంత్రికి ఇలా వందలాది మందికి ఉత్తరాలు రాసేవాడు. ప్రతివారం ఆశ్రమంలోని పిల్లలను ఉత్సాహపరుస్తూ, ‘‘మీరు రెక్కలు లేకుండా ఎగరడం నేర్చుకొంటే మీ కష్టాలన్నీ మాయమైపోతాయి. నాకు రెక్కల్లేవు, అయినా రోజూ నా మనసులో ఎగురుకుంటూ మీదగ్గరకు వస్తున్నాను
*
బహురూపి గాంధీ
రచయత : అనుబందోపాధ్యాయ
తెలుగు సేత: నండూరి వెంకట సుబ్బారావు
(2014లో అనువదించారు)
ప్రతులకు - మంచి పుస్తకం
12-13-439, వీధినెం.1. తార్నాక,
సికింద్రాబాద్-17.. 94907 46614