Others

మరోసారి ‘మదర్ ఇండియా’ మననం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆరు దశాబ్దాల క్రితం ‘మదర్ ఇండియా’ అనే హిందీ చలనచిత్రం విడుదలైంది. ఆ చిత్రానికి నిర్మాత-దర్శకుడు మెహబూబ్‌ఖాన్, చిత్రానువాదం (స్క్రీన్‌ప్లే)- మెహబూబ్‌ఖాన్, వజాహత్ మిర్జా, ఎస్. అలీరజా. సంగీతం- నౌషద్. ప్రధాన పాత్రధారి నర్గీస్. ఈ చిత్రాన్ని దేశ పౌరులందరూ ఆదరించారు. అక్కున చేర్చుకున్నారు.
మదర్ ఇండియా అనేది ఆంగ్ల పదం... దాన్ని తెలుగులోకి, హిందీలోకి తర్జుమా చేస్తే భారతమాత. ఈ భారతమాతను అందరూ అభిమానించారు, చూసి పరవశించిపోయారు. ఆ భారతమాత (మదర్ ఇండియా)ను నిర్మించింది ‘ఇస్లాం’ ధర్మాన్ని ఆచరించే సున్నిత మనస్కులైన వారు.
ఆంగ్ల సాహిత్యంలో గాని ఇతర ప్రాంతీయ సాహిత్యాల్లోగాని మనకు ‘మదర్ ల్యాండ్’ అనే మాట వినిపిస్తుంది. దాన్ని పవిత్రంగా భావించే విధానం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రపంచమంతటా కనిపించేదే భారతదేశంలోనూ ప్రతిఫలించడంలో విడ్డూరమేమీ కాదు.
అయితే ఆరు దశాబ్దాల క్రితంనాటి మత సహిష్ణుత, మానవీయ లక్షణం... ఆ సున్నితత్వం.. క్రమంగా తగ్గి కరుడుగట్టిన వైనం... రాడికలైజేషన్ పెరిగింది. దరిమిలా మదర్ ఇండియా... భారతమాతకు వందనం పలకడం, జైకొట్టడం, జేజేలు పలకడం నామోషీగా భావించడం అలవడింది. అలా పలకడం తమ మత వ్యతిరేకమని కొందరు బాహాటంగా చెబుతున్నారు. దాంతో ‘ఘర్షణ వాతావరణం’ పెరగసాగింది. ఓట్ల రాజకీయం... ఇతర అవసరాలకోసం కొందరు నిస్సిగ్గుగా ఈ అంశాన్ని వాడుకోవడం హెచ్చింది. దేశ పౌరుల మధ్య విద్వేషం పెంచేందుకు ఉబలాటం పెరిగింది... పెరుగుతోంది.
వాస్తవానికి ప్రపంచంలో తొట్టతొలి ‘మసీదు’ దేవతల భూమిగా భావించే భారత్‌లోని కేరళ రాష్ట్రంలో నిర్మితమైంది. ఆనాటి రాజుల ఔదార్యం, మానవీయత, మంచితనానికి చిహ్నమే ఆ మసీదు అని ఇప్పటికీ ఎందరో భావిస్తారు. ఇప్పటి ఇరాన్ ప్రాంతం నుంచి జొరాష్ట్రియన్లను కత్తితో నరికినా, నానా విధాలుగా వేధింపులకు గురిచేసినా వారు అక్కడి నుంచి సముద్రం గుండా పయనమై ప్రస్తుత గుజరాత్ ప్రాంతానికి చేరుకుని తమ పవిత్ర అగ్ని దేవాలయాన్ని నిర్మించుకున్నారు. అప్పటి అక్కడి రాజు అనుమతితో ఆవాసాలు ఏర్పాటు చేసుకుని అగ్నిని ఆరాధిస్తూ శతాబ్దాలుగా జీవనం కొనసాగిస్తున్నారు. ఆశ్రయం కల్పించిన దేశాన్ని వారు (పార్సీలు) తమ సొంత దేశంగా భావించి మత సహిష్ణుతతో జీవించి, తమ శక్తియుక్తిని దేశ సంపద పెరిగేందుకు పాటుపడుతున్నారు. ‘‘పాలలో చక్కెరలా’’ కలిసిపోయారు. పార్సీలు సైతం ఇరాన్ వెలుపల గుజరాత్‌లో తొలి అగ్ని దేవాలయాన్ని (ప్రార్థనా మందిరాన్ని) నిర్మించారు. అంతకుముందే కేరళలో ఇస్లాంను ఆచరించేవారు ప్రపంచంలోనే మొట్టమొదటి మసీదు (ప్రార్థనా మందిరాన్ని)ను నిర్మించుకున్నారు. వారు సైతం పాలలో చక్కెరలా కలిసిపోతారని ఆశించారు. కానీ వారిలో అందరూ అలా కలిసిపోలేదు. ప్రపంచంలో తొట్టతొలి మసీదును నిర్మించుకునేందుకు అంగీకరించిన, సహకరించిన దేశానికి విధేయతగా, వినమ్రతతో ఉండాలని ప్రముఖ మేధావి, ఆలోచనాపరుడు, జర్నలిస్టు-రచయిత, ఇస్లాంపై సాధికారికంగా మాట్లాడే తారిక్ ఫతే చాలాకాలంగా చెబుతున్నారు. భారత ఉపఖండం చరిత్రను, పర్షియా ప్రాంత పరిణామాలు, చరిత్ర సాకల్యంగా, సాధికారికంగా ఉటంకించి చెప్పే తారిక్ ఫతే విశే్లషణ ఎంతో హేతుబద్ధంగా, తార్కికంగా, మానవీయంగా ఉంటుంది. ఆయన భారత్‌మాతాకు జేజేలు పలకడంలో ఎవరికీ ఎటువంటి అభ్యంతరం ఉండాల్సిన అవసరంలేదని ఘంటాపథంగా చాలాకాలంగా చెబుతున్నారు. అది వినమ్రత, విధేయత, మంచితనం, మానవీయతకు నిదర్శనమవుతుందని గట్టిగా వాదిస్తున్నారు. హిందీ సినీ కవి, రచయిత జావేద్ అక్తర్ రాజ్యసభలో ఈ విషయమై చాలా ఆవేశంగా మాట్లాడుతూ మాతృదేశాన్ని గౌరవించడం, జేజేలు పలకడం ఏ ధర్మం నిరసించదని చెబుతూ భారత్ మాతాకి జై... అని నినదించారు. నిండు సభలో పారవశ్యంతో ‘జై’ కొట్టారు. సభ వెలుపల సైతం ఆయన అనేకసార్లు భారతమాతకు ‘జె’ అనడంలో ఎలాంటి ‘్ధర్మ’ సంకటం లేదని వివరించారు. ఈ నినాదం ఇవ్వవద్దని జారీ అయిన ‘‘్ఫత్వా’’ను ఆయన తప్పుపట్టారు. తారిక్‌ఫతే, జావెద్ అక్తర్ లాంటి అనేకమంది ఇస్లాం మతానికి చెందిన మేధావులు, ఆలోచనాపరులు వర్తమాన చైతన్యానికి ప్రాముఖ్యతనిస్తూ ఉండగా కొందరు మాత్రం దీన్ని తమ స్వప్రయోజనాలకోసం ఉపయోగించుకోవడం విడ్డూరం.
అందులో భాగమే పార్లమెంట్‌లో ఆమోదం పొందిన ‘‘పౌరసత్వ సవరణ బిల్లు’’పై జరుగుతున్న ఆందోళనలు, అల్లర్లు, అగ్నికీలలు.
ప్రధాని నరేంద్ర మోదీ పదే పదే నచ్చజెప్పినా, ఈ బిల్లు వల్ల ఎవరికి ఎటువంటి నష్టం జరగదని, ఇవ్వడమే తప్ప తీసేసుకోవడం ఎరుగని సంప్రదాయం భారత్‌కు ఉందని అనునయించినా, అమిత్‌షా భరోసా ఇచ్చినా వివేకం- విచక్షణ కోల్పోయి, విజ్ఞత మరిచి రాజకీయం చేసేందుకు, ప్రశాంతంగా ఉన్న ప్రాంతాలను కల్లోలపరచడానికి పూనుకోవడం విషాదం.
పాకిస్తాన్, అఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ ఇస్లామిక్ దేశాలు ఆ దేశాల్లో మైనార్టీలుగా ఉన్నవారు మత సహిష్ణుతకు పెద్దపీటవేసి వేల సంవత్సరాల మానవీయ సంప్రదాయాలను ఆచరిస్తున్నవారు తమకు రక్షణ, భద్రత, స్వాంతన లభించే చోటుకు వస్తే వారికి, పౌరసత్వం కల్పించడంలో తప్పుడు విచక్షణ, వివేచన ఎలా అవుతుంది? ఆయా దేశాల్లో వారు మైనార్టీలన్న ప్రధాన అంశాన్ని ఆందోళనకారులు పూర్తిగా విస్మరిస్తున్నారు. ఆ దేశాల్లో మెజార్టీగా ఉన్నవారికి సైతం పౌరసత్వం కల్పించాలనడంలో సహజ న్యాయం కనిపించదు. ఆయా దేశాల్లోనే వారికి భద్రత, రక్షణ, సాంత్వన లభిస్తుంది తప్ప భారతదేశంలో మైనార్టీలుగా పూర్తి ‘సాంత్వన’ వారెలా పొందుతారు? మెజార్టీ ప్రజలమధ్యనే వారికి ఎక్కువ భద్రత, రక్షణ సాంత్వన లభిస్తుందన్న విషయాన్ని గాలికొదిలేసి మాట్లాడితే ఎలా?

శరణార్థులు ఎవరినైనా ఆదరించాలి... వారికి పౌరసత్వం కల్పించాలి... దేశ పౌరులుగా గుర్తించాలి అంతే 21వ శతాబ్దంలో అది సాధ్యంకాదని అమెరికా లాంటి అగ్ర దేశమే కుండబద్దలుకొట్టి చెబుతోంది. సరిహద్దుల్లో ఎతె్తైన కంచెను, భద్రతా బలగాలను ఏర్పాటుచేసి శరణార్థులెవరూ తమ దేశంలోకి చొరబడరాదని ఆంక్షలు విధిస్తున్న దృశ్యాలు, వెనక్కి పంపుతున్న చిత్రాలు చూస్తూనే, మొత్తం ప్రపంచం అర చేతిలోకి వచ్చేసిన సందర్భంలో ఎక్కడేమి జరుగుతోందో తెలుసుకునే సౌలభ్యం ఏర్పడిన కాలంలో, ఏ దేశానికా దేశం ఆ దేశ పౌరుల రక్షణకు- భద్రతకు, ఆహార భద్రతకు, ఉపాధి అవకాశాలకు అధిక ప్రాధాన్యమిస్తున్న తరుణంలో, అక్రమ వలసదారులను అమెరికా తరిమేస్తుండగా ఆర్థికంగా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న భారత్‌లో ఇంత ‘లొల్లి’ పౌరసత్వ సవరణ బిల్లుపై జరగడం విడ్డూరం. అలాంటి వారి జ్ఞానచక్షువులు పూర్తిగా ముడుచుకుపోయాయనిపిస్తోంది. మూడువైపుల ఉన్న ముస్లిం దేశాల వద్దగల సరిహద్దు గేట్లను తెరవండి, అలా వచ్చిన వారందరికీ పౌరసత్వం ఇవ్వండి అన్నట్లు వీధులోకి వచ్చి వీరంగం వేయడం పూర్తిగా విషాదం. ఆ రకంగా భారత్‌మాతాకి జై... అనని వాళ్ళ సంఖ్య పెంచుకుంటామన్న ఎత్తుగడతో, మానసిక వైక్లభ్యంతో ఊరేగితే ఎలా? ఈశాన్య రాష్ట్రాల సమస్యకు సరైన పరిష్కారం చూపుతామని, ప్రధాని, హోంమంత్రి చెబుతున్నారు. హామీ ఇస్తున్నారు. వారిని విశ్వసించాలి కదా? పౌరసత్వ సవరణ బిల్లులో ప్రమాదకరమైన అంశాలు ఏమున్నాయో చూపకుండానే ‘‘మతపరంగా విభజన’’ అన్న అసంబద్ధ మాటను ముందుకు తెచ్చి ఉద్రేకాలు రెచ్చగొట్టడం దారుణాతి దారుణం. ద్విజాతి సిద్ధాంతం ప్రకారం భారత ఉపఖండం విభజనకు గురై ఏడు దశాబ్దాలు గడిచాక వర్తమానంలో మతపర విభజన అన్న మాటకు మాన్యత ఎక్కడుంది? ఉదారవాద స్వభావమంటే విరోధులకు, ‘ఎర్ర తివాచి’ పరచి స్వాగతం పలకడమని కాదు కదా?
దేశ సర్వసత్తాక స్వభావాన్ని, లక్షణాన్ని, గుణాన్ని మంటగలిపే ప్రయత్నం ఎలా ఆహ్వానించదగ్గదవుతుంది? ఈ ప్రశ్న జాతీయవాదమవుతుందని, సంకుచితమని కొందరు కమ్యూనిస్టులు వారిని ఆశ్రయించే మత ఛాందసవాదులు గగ్గోలు పెట్టినప్పటికీ ప్రపంచమంతటా ఇప్పుడు కమ్యూనిజం నామరూపాలు లేకుండా కూలిపోయిన... కూలిపోతున్న సందర్భంలో... ఏ దేశానికి ఆ దేశం స్వీయరక్షణకు ప్రాధాన్యతనిస్తున్న కాలంలో తమ పౌరులకు సకల సౌకర్యాలు, హక్కులు-బాధ్యతలు దఖలుపరచాలని భావిస్తున్న తరుణంలో భారత్ మాతాకి జై... అనడం నామోషీగా భావించి, అసలు ‘మదర్ ఇండియా’ను ప్రేమించలేమని తెగేసి చెప్పేవారి సంఖ్య ఇండియాలో... భారత్‌లో గణనీయంగా పెరగాలని కోరుకునే వారే వర్తమాన పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకిస్తున్నారు. మరి అదెలా న్యాయం- ధర్మం అనిపించుకుంటుంది? ఆలోచించండి!

- వుప్పల నరసింహం, 9985781799