Others

సత్యం శివం సుందరం సృ స్థి ల (సృష్టి స్థితి లయ) 2 వ భాగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఘనమై యొప్పగ నయ్యవంతి పురి బ్రాకామ్యత్వ వాల్లభ్యముల్
మొనపున్ సజ్జన కోటికిన్ పరమవౌ మోక్షంబు రక్షించు తా
తన భక్తాళి నకాల మృత్యుకృత సరిత్రాసమ్ము పోద్రోలి- పా
యని రక్తిన్ పరమేశు వేడెద భయాహర్తన్ మహాకాలునిన్

కావేరికా నర్మదా విమల సంగమ
స్థావరంబైన మాంధా తృపురమున నిల్చి
సంతతము సకల సజ్జన తారణము సల్పు
శివుని నోంకారేశు జిత్తంబులో కొల్తు..
***
కేదారం బిది పుణ్య బీజములకు గేదారమై శైల రాట్
పాదంబై తగునందు దేవగణముల్ భక్తుల్ మహర్షుల్ మహా
మోదం బేర్పడ జేయు పూజలకు సంఫుల్లాంతరంగుండవై
కేదారేశ్వర! యుంటివా సుఖము నిన్ గీర్తింతు నిష్టాప్తికై..

శాకినీ డాకినీ ముఖ్య సకల విట
రాక్షస సమాజ పూజాభిరామ చరణు
శరణు వేడెద శశికళాభరణుడైన
భీమ శంకరు కింకర క్షేమకరుని..
ఇంకాఉంది

- సాంధ్య శ్రీ 8106897404