Others

పౌరసత్వ సవరణపై అపోహలు-విద్వేషాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశ విభజన కాలం నుండి మన నేతలు ఇస్తున్న హామీలకు కార్యరూపం దాల్చుతూ భారత పార్లమెంట్ పౌరసత్వ సేవరణ చట్టాన్ని తీసుకు వస్తే దేశంలో పలు చోట్ల జరుగుతున్న నిరసనలు, అవి హింసారూపం దాల్చడం కేవలం సంకుచిత రాజకీయ ప్రయోజనాల నేపథ్యంలోనే అని భావించవలసి వస్తుంది. ఈ చట్టాన్ని చదివిన ఎవ్వరికైనా దీని ప్రభావం భారత పౌరులు ఎవ్వరిపై పడబోదని స్పష్టం అవుతున్నా ఎందుకు ఇంతగా విద్వేషాలు రెచ్చగొడుతున్నారో అర్ధం కాదు. నిరసన పేరుతో అస్సాంలో సచివాలయంపై దాడి చేయడం కోసం వామపక్ష తీవ్రవాద శక్తులు, తీవ్రవాదులు, కొన్ని రాజకీయ శక్తులు కుట్ర పణ్ణిన్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం చూస్తుంటే దీని వెనుక లోతైన రాజకీయ కుట్ర దాగి ఉన్నట్లు భావించవలసి ఉంటుంది. నిరసన ఆందోళనలతో పాల్గొంటున్న వారిలో చాలామందికి ఈ చట్టం స్వరూపం గురించిన అవగాహన కూడా లేదని తెలుస్తున్నది.
పైగా, ఇప్పటి వరకు ప్రభుత్వం నిర్దిష్ట చర్యలు కూడా చేపట్టని జాతీయ పౌరసత్వ రిజిస్టర్ అంశంతో దీనిని కలిపి గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. భారత పౌరులు ఎవ్వరిపై ప్రభావం చూపని ఈ చట్టం, ముస్లింలను రెండో తరగతి పౌరులుగా చేస్తున్నారంటూ.. ఏవేవో ఆరోపణలను ముఖ్యమంత్రులు, పలు పార్టీల అగ్రనేతలు అంటూ ఉండటం గమనిస్తే పజ్రల మధ్య కలతలు పెంచడానికే ఆందోళనలకు ఆజ్యం పోస్తున్నట్లు స్పష్టం అవుతుంది.
ఈ చట్టం భారతీయ ముస్లింలకు ఆందోళనకరమైనది అంటూ ఒక అధ్వాన్నపు అసత్యాన్ని ప్రచారం చేస్తున్నారు. పౌరసత్వ సవరణ చట్టం ముస్లింలకు మాత్రమే కాదు భారత దేశ పౌరులు ఎవ్వరికీ సంబంధించింది కానే కాదు. కేవలం మూడు దేశాలు - పాకిస్థాన్, బాంగ్లాదేశ్, ఆఫ్ఘానిస్తాన్ ల నుండి ఇప్పటికే భారత దేశంలోకి వచ్చి, నివాసం ఉంటున్న మతపర మైనారిటీలైన హిందువులు, జైనులు, బౌద్దులు, శిఖులు, పార్సీలు, క్రైస్తవులకు మాత్రమే పౌరసత్వం కల్పించడం కోసం ఉద్దేశించిన చట్టం ఇది.
మతపరమైన హింస కారణంగా 2014కు ముందు భారతదేశంలోకి శరణార్థులుగా వచ్చి, నివాసం ఉంటున్న వీరు ఇప్పుడు భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఈ చట్టం అవకాశం కల్పిస్తుంది. ఈ చట్టం అమలులోకి వచ్చిన తర్వాత భారత పౌరులు ఎవ్వరిని తమ పౌరసత్వం నిరూపించుకోవడం కోసం ఎటువంటి పత్రం సమర్పించమని కోరే ప్రసక్తే తలెత్తదు. కేవలం ఆ విధంగా కొందరు తప్పుడు ప్రచారం వ్యాప్తి చేస్తున్నారు.
స్పష్టంగా పేర్కొన్న మూడు దేశాలలో మతపరమైన వివక్షతకు, హింసకు గురి కావడంతో భారత దేశంకు వలస వచ్చి, నివాసం ఉంటున్న ఆ దేశాలలోని మైనారిటీలకు పౌరసత్వం కల్పించడం కోసం ఉద్దేశించిన చట్టం ఇది. ఈ చట్టం అమలులోకి రావడంతో ఇప్పటికే అమలులో ఉన్న సహజ న్యాయ చట్టాలు ఏవీ రద్దు కాబోవు. ప్రస్తుతం అమలులో ఉన్న చట్టాల ప్రకారమే ఏ దేశానికి చెందిన పౌరులైనా భారత పౌరసత్వం కావలి అనుకొంటే దరఖాస్తు చేసుకోవచ్చు.
ప్రస్తుత చట్టాల ప్రకారం ప్రపంచంలోని ఏ దేశానికి చెందిన ముస్లింలైనా భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అటువంటి అవకాశాన్ని ఈ చట్టం రద్దుచేసే ప్రసక్తి లేదు. సహజన్యాయం క్రింద భారత పౌరసత్వం జారీ చేసే పౌరసత్వ చట్టంలోని సెక్షన్ 6 క్రింద వారు భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అంటే ముస్లింలను తప్పించే ప్రయత్నం ఏమీ లేదని చెప్పవచ్చు.
ఈ చట్టం మూడు దేశాలలోని ఆరు మతాలకు చెందిన వారికి భారత పౌరసత్వం ఇవ్వడం కోసం ఉద్దేశించినది. భారత దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన హిందువులు, జైనులు, బౌద్దులు, శిఖులు, పార్సీలు, క్రైస్తవులను తిరిగి వెనుకకు పంపే ముందు భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఈ చట్టం ఉద్దేశించినది అయినప్పటికీ, ఇందులో ఎవ్వరిని దేశం నుండి పంపించి వేయడం గురించి ప్రస్తావించనే లేదు.
ఎందుకంటే ఆ అంశం మరో చట్టం - విదేశీయుల చట్టం పరిధిలోకి వస్తుంది. భారతదేశంలోకి అక్రమంగా ప్రవేశించి, నివాసం ఉంటున్న ఎవ్వరినైనా వెనుకకు పంపించి వేయడం అనేడిది నిరంతరం జరిగే పక్రియ. ఆ పక్రియలో ఈ చట్టం ఎటువంటి మార్పు తీసుకురాదు.
ఈ చట్టం హిందువులకు అప్పటికప్పుడు పౌరసత్వం కల్పించదు. వారు భారత్ లో కనీసం ఐదేళ్లపాటు నివసించి ఉండాలి. ఆ తర్వాత పౌరసత్వం కోరుతూ దరఖాస్తు చేసుకోవాలి. ఈ పక్రియ మొత్తం జరగడానికి సంవత్సరానికి పైగా పడుతుంది. చాలామంది వాదిస్తున్నట్లు ఈ చట్టం హిందువుల పట్ల పక్షపాతంతో కూడుకున్నది కానేకాదు.
మూడు దేశాలకు చెందిన ఆరు మతాల వారికి సడలింపు ఇవ్వడం జరిగింది. మిగిలిని అన్ని దేశాలకు చెందిన వారికి సాధారణ సహజన్యాయ చట్టం వర్తిస్తుంది. ఉదాహరణకు, తమిళనాడులోని శరణార్ధుల శిబిరాలలో శ్రీలంకకు చెందిన చాలామంది తమిళ హిందువులు నివసిస్తున్నారు. వారిని ఈ చట్టం పరిధిలోకి తీసుకు రాలేదు. ఈ శ్రీలంక తమిళులు అందరు 1990వ దశకంలో ఎల్.టి.టి.ఇ.తో యుద్ధం జరిగిన సందర్భంగా భారత దేశంలోకి పారిపోయి వచ్చినవారు. వారు చాలా శిబిరాలలో నివసిస్తున్నారు.
షియాలు, అహ్మదియాలు, బలోచిలు, రోహింగ్యాలను ఎందుకని చేర్చలేదని ప్రశ్నిస్తున్నారు. ముస్లింలలోనే ఉన్న ఈ వర్గాలు అన్ని కూడా ప్రపంచంలో ఎక్కడా ప్రత్యేక మతంగా గుర్తింపు పొందలేదు. వీరంతా ముస్లింలు కావడంతో వారు పాకిస్థాన్, బాంగ్లాదేశ్, ఆఫ్ఘానిస్తాన్ లలో మైనారిటీలు కారు. ఈ దేశాలు అధికారికంగా ఇస్లామిక్ దేశాలు లేదా ఆయా దేశాలలో అత్యధికంగా ముస్లిం జనాభా ఉండటం తెలిసిందే.
ఈ చట్టం ఆ దేశాలలోని మైనారిటీ ప్రజలకు ఉద్దేశించినది కావడంతో దీనిలో ముస్లింలను చేర్చడం సాధ్యం కాలేదు. అయినా, ఈ ఇస్లామిక్ దేశాలలో తమ ఇస్లాం పద్దతులను ఆచరిస్తున్నందుకు ముస్లింలు ఎవరైనా హింసను ఎదుర్కొంటు ఉంటె వారి భారత దేశంలో ఆశ్రయం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
మతం పేరుతో వివక్షతను రాజ్యాంగం నిషేధించడంతో ఈ చట్టం భారత రాజ్యాంగానికి వ్యతిరేకమని కొందరు ఆరోపణలు చేస్తున్నారు. భారత రాజ్యాంగం భారత పౌరులు అందరికి వర్తిస్తుంది. ఈ చట్టం భారత పౌరులు కాని కొందరికి ప్రత్యేకంగా నిబంధనలు రూపొందించింది. కాబట్టి, ఈ చట్టం భారత రాజ్యాంగాన్ని ఉల్లంగిస్తున్నదని చెప్పడం సరికాదు.
పైగా, మన రాజ్యాంగంలో, చట్టాలలో ఇప్పటికే పలు వివక్షత పూరిత నిబంధనలు ఉన్నాయి. మనకు ప్రతి పౌరునికి సమాన న్యాయం లేదు. పలు అంశాలలో వివిధ మతాలకు విభిన్న చట్టాలను మన రాజ్యాంగం అనుమతిస్తుంది. మనకు హిందూ దేవాలయాలు ప్రభుత్వ నియంత్రణలో ఉండగా, మసీదులు, చర్చిలు ఆ విధంగా లేవు. హిందువులు, హిందు వేతరులు నిర్వహించే పాఠశాలలకు విభిన్న చట్టాలు ఉన్నాయి.
ఈశాన్య రాష్ట్రాలలో, ముఖ్యంగా అస్సాంలో కొందరు ప్రజలు ఈ చట్టాన్ని వ్యతిరేకించడం నిజమే. అయితే ఈ చట్టాన్ని దేశంలోని ఇతర ప్రాంతాల వారు వ్యతిరేకించడానికి, ఈశాన్య ప్రాంత ప్రజలు వ్యతిరేకించడానికి పూర్తిగా భిన్నమైన కారణాలు ఉన్నాయి. మతంతో సంబంధం లేకుండా, బంగ్లాదేశ్ నుండి లేదా మరెక్కడి నుంచైనా అక్రమ శరణార్థులను ఈశాన్య ప్రాంత ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. కానీ ఈశాన్య రాష్ట్రాల వెలుపల ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నవారు ఇందులో ముస్లింలను చేర్చలేదని వ్యతిరేకిస్తున్నారు. ఈ చట్టాన్ని వ్యతిరేకించడంతో వీరిద్దరూ పూర్తిగా భిన్నమైన ధ్రువాల్లో ఉన్నారని గమనించాలి.
గతంలో నెహ్రు దగ్గర నుండి ఇందిరాగాంధీ వరకు పాకిస్థాన్, బంగ్లాదేశ్ లలో మతపరమైన వేధింపుల కారణంగా మనదేశానికి వలసవచ్చిన వారికి పౌరసత్వం కల్పించడం గురించి హామీలు ఇచ్చారు. 2013లో నాటి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ పార్లమెంట్‌లో అటువంటి హామీ ఇచ్చారు. మమతా బెనర్జీ నాలుగేళ్ల క్రితం ఈ విషయమై డిమాండ్ చేశారు. ఇప్పుడు వ్యహాతిరేకం అనడం కేవలం రాజకీయ కారణాలతోనే అని స్పష్టం అవుతుంది.
పాకిస్థాన్, బంగ్లాదేశ్‌ల నుండి శరణార్థులుగా వస్తున్నా వారిలో అత్యధి కులు దళితలే అని గమనించాలి. దేశ విభజన అసందర్భంగా ఇస్లాం రాజ్యం లో మైనారిటీలకు రక్షణ ఉండదని, పాకిస్థాన్‌లోని దళితులు అందరూ ఏ దారి దొరికితే అందులో భారత్‌కు తిరిగి వచ్చేయాలని డా.బి.ఆర్ అంబేడ్కర్ పిలుపిచ్చారు. రెండు దేశాల మధ్య - జనాభా మార్పిడి జరగాలని కూడా డిమాండ్ చేశారు. ఇటువంటి అంశంలో సంకుచిత రాజకీయాలకు చోటిచ్చి, రాజకీయ విద్వేషాలు వ్యాప్తి చేయడం ప్రమాదకరం.

- చలసాని నరేంద్ర