Others

ముద్రాపకుడు ప్రచురణకర్త

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇండియన్ ఒపీనియన్, యంగ్ ఇండియా, నవజీవన్ పత్రికలకు గాంధీ సంపాదకత్వం వహించాడు. ఆయన వాటిని తన స్వంత ముద్రాణాలయంలో ముద్రించి, ప్రచురించాడు. ఇతరుల యాజమాన్యంలో నడిచే ముద్రణాలయాలమీద ఆధారపడితే తన అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తం చేయలేనని ఆయనకు తెలుసు. ఇండియన్ ఓపీనియన్ వారపత్రిక బాధ్యతలు ఆయన స్వీకరించినపుడు అది నష్టాలలో ఉంది. ఆయన దాని ముద్రణాలయాన్ని నగరంలోంచి ఊరికి దూరంగా ఉన్న ఫీనిక్స్ సెటిల్‌మెంటులోకి మార్చుదామన్నాడు.
ఆ ఆలోచన ప్రతికూల ఫలితాలనిస్తుందని ఆయన స్నేహితులు భావించారు. ఆయన తన ముద్రణాయంత్రాలు, పరికరాలు, సాధన సామగ్రి పొందికగా ఒక షెడ్డులో బిగించుకున్నాడు. ప్రెస్ నడిపేందుకు ఒక ఆయిల్ ఇంజన్ వాడేవాడు. పక్కనే వేరే గదిలో ఆయన కార్యాలయం ఉండేది. అక్కడ జీతాలు తీసుకొనే సేవకుడు కానీ, సహాయకుడు కానీ ఉండేవారు కాదు. ఇండియన్ ఒపీనియన్‌ను శనివారం బట్వాడా చేసేవారు. శుక్రవారం మధ్యాహ్నానికి వ్యాసాలు కంపోజ్ చేయడం అయిపోయేది. చిన్నా, పెద్దా ఆశ్రమవాసులంతా కంపోజింగు, ప్రింటింగ్, కటింగ్, ఫోల్డింగ్, చిరునామాలను అతికించడం, కట్టలు కట్టడం వంటి పనులన్నీ తలొకటీ చేసేవారు. ఆ కట్టలని సమయానికి రైల్వే స్టేషన్‌కు చేరవేయాలి.
సాధారణంగా వారు అర్థరాత్రివరకూ పనిచేసేవారు. పని మరీ ఎక్కువగా ఆవున్నపుడు మరికొందరితో కలిసి గాంధీ శుక్రవారం రాత్రంతా మెలకువగా ఉండేవాడు. కస్తూర్బా, ఇతర మహిళలూ వారికి అప్పుడప్పుడూ సహాయం చేసేవారు. ఒకసారి ఇంగ్లాండు నుంచి ఆయన ‘‘శనివారం నాడు ఆశ్రమంలోని మహిళలందరూ ప్రెస్‌కు వెళుతున్నారని భావిస్తున్నాను’’ అని రాసాడు. ఇండియన్ ఒపీనియన్ ఆదివారాలు మార్కెట్‌లోకి వెళ్లేది.
ఫీనిక్స్ సెటిల్‌మెంటులో ఇండియన్ ఒపీనియన్ ముద్రించడం ప్రారంభించిన మొదటివారమే ఆయిల్ ఇంజన్ చెడిపోయింది. చేత్తో తిప్పే చక్రంతో గాంధీ, ఇంకా శారీరక బలం వున్న ఇతర ఆశ్రమవాసులూ యంత్రాన్ని నడిపి ముద్రణను పూర్తిచేశారు. మర్నాడు సరైన సమయానికే పత్రిక మార్కెట్‌లోకి వచ్చింది. ప్రెస్ పనికి సంబంధించిన వివరాలు నేర్చుకొనేందుకు ఈ అవరోధం గాంధీకి సహాయపడింది. ఆయన వ్యాసాలు రాయడమే కాకుండా, అక్షరాలు కూర్చేవాడు, ముద్రణలో సహాయపడేవాడు, ప్రూఫులు దిద్దేవాడు. చాలామంది చిన్నవాళ్లు అక్కడ శిక్షణార్థులుగా మారారు. తర్వాత కొన్ని రోజులకు ఒకసారి ఇండియన్ ఒపీనియన్ సంచిక ముద్రణ పనిని పూర్తిగా బాలకులే నిర్వహించారు. మొదట్లో ఇండియన్ ఒపీనియన్‌ను ఇంగ్లీషు, హిందీ, గుజరాతీ, తమిళం- నాలుగు భాషల్లో ముద్రించేవారు. కానీ సంపాదకులు, కంపోజిటర్ల కొరతవల్ల తర్వాత కాలంలో దానిని ఇంగ్లీషు, గుజరాతీలలో మాత్రమే ప్రచురించడం ప్రారంభించారు. గాంధీ భారతదేశ పర్యటననలో అడయారును సందర్శించినపుడు ఆయన అక్కడి ముద్రణా పనులను శ్రద్ధగా పరిశీలించడం అనిబీసెంట్ గమనించింది.
వారపత్రికలతోపాటు హిందీ, ఇంగ్లీషు, ఇతర భాషలకు చెందిన అనేక పుస్తకాలను ఫీనిక్స్ ప్రెస్‌లోనూ, నవజీవన్ ప్రెస్‌లోనూ ముద్రించేవారు. ప్రభుత్వానికి గాంధీ ఎలాంటి సెక్యూరిటీ డిపాజిట్లు కట్టేవాడు కాదు. ఆయన రచనలమీద వచ్చిన లాభాలను ఖాదీ పనికి ఉపయోగించేవాడు. ఆయన నవజీవన్ ప్రెస్‌కోసం ఒక లక్ష రూపాయల విలువైన ట్రస్టును ఏర్పాటుచేశాడు.
చెడ్డ ముద్రణను ఒక హింసాత్మక కార్యంగా గాంధీ పరిగణించేవాడు. స్పష్టమైన అక్షరాలు, నాణ్యమైన కాగితం, సాదాగా అందంగా ఉండే ముఖపత్రాలు తప్పనిసరిగా ఉండాలని గాంధీ పట్టుబట్టేవాడు. భారతదేశం లాంటి పేద దేశంలో ఖరీదైన బైండింగుతో, ముఖపత్రాలతో వున్న పుస్తకాలు సామాన్య పాఠకులకు అందుబాటులో ఉండవని గాంధీ అభిప్రాయం. ఆయన జీవితకాలంలో నవజీవన్ ప్రెస్ అనేక పుస్తకాలను చౌక ధరలకు ముద్రించింది. గుజరాతీలో ఆయన ఆత్మకథ కేవలం 12 అణాలకే అమ్మారు. హిందీలో కూడా ఈ పుస్తకం చౌక సంపుటాన్ని అందుబాలోకి తెచ్చారు.
దేశమంతా ఒకే లిపి వాడితే దేశ వ్యాప్తంగా అనేకమంది ప్రెస్ కార్మికుల సమయం, శ్రమా కలిసి వస్తాయని ఆయన భావించేవారు.
*
బహురూపి గాంధీ
రచయత : అనుబందోపాధ్యాయ
తెలుగు సేత: నండూరి వెంకట సుబ్బారావు
(2014లో అనువదించారు)
ప్రతులకు - మంచి పుస్తకం
12-13-439, వీధినెం.1. తార్నాక,
సికింద్రాబాద్-17.. 94907 46614