Others

సత్యం శివం సుందరం (సృ స్థి ల (సృష్టి స్థితి లయ) 2 వ భాగం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాలో మరో ఆయుష్మంతుడు హృదయావిష్కరణ చేసిన
ఈ ‘మధుచందన’ మకర తోరణ మహర్నవమంతా ఆత్మశిక్షతో
ఛందస్సుందర సౌకుమార్యాన్ని ప్రతిబింబించిన
ఋజుపార్శ్వం జీవితాన్ని అనుభవించకుండా
బ్రతుకుదామనే అల్పజీవులకు ఈ ఊపిరి అందదు
అగ్నిచ్ఛటను ఆవహింపజేసుకున్న
నా మూర్తిమత్వాన్ని దర్శించాలంటే
అనల తత్త్వానుశీలం అవసరం..
తీరాలు కనిపించని దూరాలు ఎక్కడున్నాయని
ఒక దేశ నైసర్గికం వేసిన ప్రశ్నలకు
కలలు పూచే గమేచ్ఛాశక్తికి పొలిమేరలేమిటనే
ఎదురుప్రశ్న జవాబు...
ఏ సీమలోని ఔత్సుక్యం
పరిభ్రమిస్తున్న ప్రాణరహస్యాన్ని వెతుకుతుందో
అక్కడ
ఒక పాట నిశ్శబ్దంగా ప్రవహిస్తూ వుంటుంది...
స్వప్న వర్ణ సమ్మేళనగా సాగే
ఈ అనంతా పగ ప్రవాహ సుషిమాంతరంగానికి
ఏ చూపుల చెయిదం
ఎన్ని క్షణాల్ని సమీకరించిందో
ఇంకాఉంది

- సాంధ్య శ్రీ 8106897404