Others

సృ స్థి ల (సృష్టి స్థితి లయ) 2 వ భాగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

- సాంధ్య శ్రీ 8106897404
సత్యం శివం సుందరం
*
నిన్నటి రాత్రి
నీలిమాకలిత నిధృతకాంతి నిశ్శబ్దం క్రింద
నక్షత్రాలు పూచిన వెనె్నల సోయగాన్ని కప్పుకున్న
తోట- తెల్లారే సరికల్లా
శబల కోమల మహావిలాస సౌరభాన్ని
చిగుళ్ళమీంచి మంచుబొట్లుగా దొర్లిస్తూ
నగ్నశరీరంమీద నట్టు త్రొక్కుతోంది తోట...
సంపూర్ణ స్వప్న మండల యాత్ర చేసి
జీవన వాటిలో దర్శనమిచ్చే
సమయ వియోగ తప్త కాంక్షా హృదయాన్ని
స్మృతిగా
కొమ్మల చివర నవకింశుక సమూహ స్మితాచ్ఛ
సౌందర్యంగా కుట్మల్తింది - తోట...
నాదభరితమైన వౌన తంత్రుల్ని
కింజిల్కాలుగా వికసిత పుష్ప హృదయ పీఠమెక్కించి
కాలపరిణామ స్వర సంకీర్తనల్ని
ప్రత్యూష భ్రమరానికందించి
పరుగెత్తే ప్రవాహాన్ని పరిమళ తరంగోద్భాసితం చేసి
లోకాన్ని
రసప్లావితం చేస్తుంది- తోట
ఇంకాఉంది