Others

బహుపుణ్యప్రదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘దక్షిణాయనం’ దేవతలకు రాత్రి అనీ, ‘ఉత్తరాయణం’ వారికి పగలు అని చెప్పబడింది. దక్షిణాయనంలో ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున యోగనిద్రితుడైన విష్ణుమూర్తి ‘కార్తీక శుద్ధ ఏకాదశి’ రోజున మేలుకొంటాడట! అందుకే దీన్ని ‘ఉత్థాన ఏకాదశి’ అంటారు.
ధనుర్మాసంలో వచ్చే శుద్ద ఏకాదశి వైకుంఠ ఏకాదశిగా వ్యవహరిస్తారు. ఈ ఏకాదశిని హరివాసరం అనీ అంటారు. ఈవైకుంఠ ఏకాదశినాడు వికుంఠుని ద్వారాలు వైకుంఠవాకిళ్లు తెరుచుకుంటాయి. ముప్పది మూడు కోట్ల దేవతలూ, ఆనాడు స్వామి దర్శనార్థమై వైకుంఠానికి వస్తారు. శ్రీమన్నారాయణుడు వారితోకలిసి ఆనందంగా ఉంటాడు. అందుకే దీన్ని ‘ముక్కోటి ఏకాదశి’ అనీ, వైకుంఠ ఏకాదశి అనీ అంటారు. స్వామి నిద్రనుంచి మేల్కొని చీకట్లనుండివెలుగుకు తీసుకొవెళ్తాడు కనుక మోక్షం లభిస్తుంది. కనుకనే ఈ ఏకాదశిని ‘మోక్షైకాదశి’ అనీ, ‘హరివాసరం’, ‘హరిదినం’ అనీ కూడా పేర్లు పెట్టారు. ఈ ఏకాదశీవ్రతాచరణ మూడు కోట్ల ఏకాదశీ వ్రతాలతో సమానమని, అందువల్లనే ముక్కోటి ఏకాదశి అని పేరు వచ్చిందని మరొక కథనం
ఈ ముక్కోటి ఏకాదశి నాడు ‘ఉపవాసం’ ఉండి, జాగరణ చేస్తే అనంత కోటి పుణ్యం లభిస్తుందట! వీలైతే నిరాహారంగాను, ఉండలేనివారు పాలు పండ్లు వగైరాలను తీసుకుంటూ, ఉపవాసం చేసి మరునాడు ద్వాదశి ఘడియల్లో ‘పారణ’ చేసి వ్రతాన్ని ముగించాలి. సుకేతుడను రాజు ఏకాదశి వ్రతం చేసి పుత్రులను పొందాడు కనుక దీనిని పుత్రైకాదశి అనీ అంటారు.
ఉత్తర ద్వార దర్శనం: శరీరానికి శిరసు స అతిముఖ్యమైన భాగము ‘ఉత్తరం’ అవుతుంది కాబట్టి, అది పవిత్రమైనది అంటారు. ఆ శిరస్సు మధ్యభాగంలో బ్రహ్మరంధ్రం అని ఒకటి ఉంటుందని, శరీరానికి ఉత్తరంలో ఉన్న ఆ ద్వారంలో భగవంతుడు ఉంటాడని కూడా తెలియజేశారు. అలా, ఆ ద్వారం గుండా సహస్రారంలో ఉన్న భగవంతుడిని జ్ఞానదృష్టితో దర్శించుకోవడమే ఉత్తరద్వార దర్శనం. ఈ విషయానే్న తెలియజేస్తూ, దేవాలయానికి ఉత్తర ద్వారం వైపు ఉన్న తలుపులను తెరిచి, ఆ ద్వారం నుండి భగవంతుడిని దర్శింపజేస్తారు. జీవుడు ‘సాధన’ ద్వారా, కొన్నాళ్ళకైనా, శిరోమధ్యభాగాన ఉన్న బ్రహ్మరంధ్రాన్ని, ఆ రంధ్రాన్ని మూసివేసి ఉన్న అజ్ఞానమనే తలుపులను తెరచి, దైవదర్శనం కొరకు ప్రయత్నించాలని, అదే నిజమైన ‘ఉత్తరద్వార దర్శనం’ అని పెద్దలు చెప్పిన విషయం!

- ఎం.వి. రఘునాథరావు , 9490258519