Others

సృ స్థి ల (సృష్టి స్థితి లయ) 2 వ భాగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెనుక జన్మాంతర స్మృతి
వెంటదెచ్చి
మాయ బంధమ్మునన్ ద్రోసి
పారజూచు
సూత్రమలాగు తార్కిక సూక్ష్మయుక్తి
గోచరము కాని
హృదయ నిగూఢ శక్తి..
ఎంత తీయని బాధకీ ఎడము తోచె
చేరువను తాకు దూరవౌ చింత నూని
మరల దివసాంత వేళ విమర్శ చేసి
సిత నిశాంత ప్రఫుల్లమై స్నిగ్ధవౌను..
విరహ నైరాశ్య నీలిమ కరడుగట్టి
ఆవృతిగ నిల్చు అనుభూతి కాకరమ్ము
తెల్లవారును విషయము తేటపడదు
ఆత్మ పాలిటి రాహువు అసలు విద్య..
సూర్య శిశువు ప్రాచీ మాతృగర్భంలోంచి వచిచ్నట్లు
మానవ జీవిత మహాకావ్య మరంద ప్రవాహంలోంచి
అక్షర బిందువునై అవతరించాను..
ఇక్కడి నదులు- అడవులు - పర్వతాలు- పీఠభూములు
రాజకీయ కుట్రకు బలియై రక్తాశ్రువులు రాలుస్తున్నాయి
కావాత్మ కర్తవ్య దీక్షగా నా భుజమెక్కిన

ఇంకాఉంది

- సాంధ్య శ్రీ 8106897404