Others

పుణ్యశ్లోకుడు, పూర్ణపురుషుడు శ్రీ భండారు చంద్రవౌళీశ్వరరావు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేడు శ్రీవారి జయంతి
*
‘‘ఈశ్వరే నిశ్చితాబుద్ధిః
దేశార్థంజీవన స్థితిః
పృధివ్యాంబంధువద్వృత్తిః
ఇతి కర్తవ్యతాం సదా’’
అనే ఆర్య వాక్యానికి సాకార, సాచరణ, సంప్రదాయ శుభాకృతి శ్రీ భండారు చంద్రవౌళీశ్వరరావుగారు. ఏణ్ణర్ధం కిందట శ్రీ చంద్రవౌళీశ్వరరావుగారి పేరిట దేశ హితైక కార్యతత్పరత, ఏతత్ ప్రచురణల నిమిత్తం వారి కుటుంబంవారు, చంద్రవౌళీశ్వరరావుగారి జీవన సాఫల్యతను నిరంతరం సంస్మరించుకొనే హితులు, సన్నిహితులు, దేశ ప్రేమైకదీప్తమతులు ఒక ప్రతిష్ఠానం (ట్రస్టు) నెలకొల్పారు. ఆ సందర్భంగా రావుగారి జీవనయానాన్ని చక్షు అక్షరం చేసే భావుక సుందరమైన ఒక స్మరణికను ప్రచురించారు (2018 జులై). ఈ స్మరణిక పేరు ‘అందరి బంధువు’. వసంతర్తు సమాగమ కాంక్షిత పరభృతం మధురంగా పదే పదే శబ్దంచగా శ్రోతవ్యమైనట్లు అలలారుతున్నది ఈ ఉత్సవ సంచిక, అన్వర్థంగా ఉంది. వ్యక్తిగతమైన భ్రష్టతలవల్ల జరిగే చెరుపుకన్నా, హానికన్నా వ్యవస్థలు అస్తవ్యస్తమైతే ఒక జాతి సంస్కృతికి, సంప్రదాయానికి, చివరకు మనుగడకు ఉత్పాతం ప్రాప్తించవచ్చు. వ్యవస్థలు దృఢంగా అనుపారితమైనప్పుడు ఆ దేశం, ఆ జాతి, ఆ సంస్కృతి అంతర్బలహీనత పాలుగాకుండా తనదైన అస్తిత్వాన్ని, పటిమను దృఢపరచుకుంటుంది.
తరతరాల భారతీయ చిరంతన వ్యవస్థకు ఆత్మస్వరూపంగా తమ జీవితాన్ని నడుపుకున్నారు, గడుపుకున్నారు, శ్రీ భండారు చంద్రవౌళీశ్వరరావు మహాశయులు. కుటుంబ జీవనం ధర్మతత్పరంగా ఉంటే, ఆదర్శ మహితంగ అలరారితే, సమాజ సుఖానికి, సత్వానికి గొప్ప ఆలంబనం ఏర్పడుతుంది. ఆయన జీవిత కౌమార దశనుంచి నాది, నేను అనికాక మనము, మనది అనే మహితాశయం పాదుకొని ఉంది. పదమూడు సంవత్సరాల పసివయసు నుంచి ఎనభైమూడు సంవత్సరాల పండు వయసు వరకు సమాజహితమే వారి ఆదర్శం.
‘అందరి బంధువు’ అనే ఈ సుందరమైన చంద్రవౌళీశ్వర స్మృతి సంవర్ధన సంచికలో వారి సంతానం రాసిన రచనలు చదువుతుంటే ఉత్తేజమూ, ఉల్లాసమూ, ఉత్సాహమూ సమాజహిత భావన సందడిస్తాయి ఎవరికైనా. హృదయమూ, మనసు స్పందించగల ప్రవృత్తి ఉన్నవారికి తమ కుటుంబానికి, అపరిధిక విస్తృతి సముపేతమైన బంధుప్రపంచానికి వారు ఒక కల్పవృక్షంగా ఆరాధనీయులైనారు. ఈ సంచికలో వారి కుమారులు డా. ఉమామహేశ్వరరావుగారు రాసిన వాక్యాలు పసిడి కాంతులు విరజిమ్ముతున్నాయి. తమ తండ్రిగారిని గూర్చి వీరిట్లా స్మరించారు. ‘మీరు ఒక యోగ్యుడైన కుమారుడు. ఒక ఆదర్శవంతమైన భర్త (గృహస్థు) ప్రేమ, వాత్సల్యం అతులితంగా కలిగిన ఒక తండ్రి. ఒక అకుంఠిత దేశభక్తులు. సామాజిక నిరత సేవకులు, నిరంతర విద్యాపోషకులు. సమర్ధ ప్రజ్ఞాపారంగతులైన న్యాయవాది మీరు.
అప్పుడు శ్రీ చంద్రవౌళీశ్వర మహోదయులు ఇట్లా స్పందించారట. ‘నేను చేసిందేమున్నది నాన్నా! ఈ విశాలప్రపంచంలో ఎందరో మహానుభావులు మాకంటే ఎక్కువ త్యాగాలు చేశారు. నేను జీవిత పర్యంతం నెరవేర్చిందల్లా నా బాధ్యత. అందులో చెప్పుకోవటానికి, రాసుకోవటానికి, కీర్తిప్రతిష్ఠలు, పదవులు ఆశించటానికి చోటులేదు అన్నారు. అంతటితో ముగిస్తూ..
క్లుప్తత, ఆప్తత, గుప్తత ఆయన సహజప్రవృత్తి అంటూ స్వస్తివచనం పలికారు. నాకొద్దిపాటి ఎరుకలో ఇట్లా అలనాటి శ్రీరామచంద్రుడిలాగా తండ్రిని స్తుతించిన సన్నివేశాలు కనపడలేదు. తండ్రికి తగిన కుమారుడు. కుమారుడికి తగిన తండ్రి. ఈ ‘అందరి బంధువు’ స్మరణికలో నాకత్యంత, ఆత్మీయమిత్రులు ప్రొఫెసర్ లక్ష్మణమూర్తిగారు. ‘వరంగల్లు నగరం విద్యావైజ్ఞానిక సామాజిక సాహిత్య కళారంగాలలో సాధించిన ప్రగతికి భండారువారి కుటుంబం చేసిన సర్వతోముఖమైన సేవ అమోఘమైనది’ అని ప్రసక్తంచేశారు. అంటే ఇవి ఐదు ముఖాలు. పరమశివుడు ‘పంచవక్త్రస్సదాశివః అని కదా! కాబట్టి చంద్రవౌళీశ్వరులు ఈ ఇలలో అవతరించిన శివాంశ స్వరూపుడిగా భావించారు.
అందరిబంధువు అనే ఈ స్మరణిక ప్రతిపద కమనీయమూ, అక్షరాక్షర రమణీయముగా అలంకృతమైంది.
శ్రీ చంద్రవౌళీశ్వరరావుగారు తమ 28వ ఏట నిర్వహించిన ‘ప్రగతి’ పత్రిక వారి సర్వాంగీణమైన మూర్తిమత్వాన్ని ప్రత్యక్షీకరిస్తున్నది.
భారతదేశానికి స్వాతంత్య్రం లభించిన రెండేళ్ళకు కానీ హైదరాబాదు సంస్థానానికి నామమాత్రంగానైనా స్వాతంత్య్రం సమకూరలేదు. ప్రగతి పత్రిక సంచికలన్నీ ఇప్పుడు లభించవు. కానీ ఈనాడు ఆ లభించిన సంచికలు చూసినా శ్రీ భండారు చంద్రవౌళీశ్వరరావుగారి సమకాలీన సమాజ విశే్లషణ ఎంత ప్రతిభాస్ఫురణీయమో తెలుస్తుంది. ‘జాగీర్ల రద్దు, 17 సెప్టెంబర్, ఓరుగల్లులో స్వాతంత్య్ర దినోత్సవాలు’ వంటి సంపాదకీయాలు నేటి యువతరం చదవాలి.
అప్పుడు కాని నేటి భారతదేశ ప్రగతిసాధన ఎట్లా నిర్దేశితం కావాలో బోధపడదు.

- అక్కిరాజు రమాపతిరావు