Others

విద్యాసంస్థల్లో ఛాందస భావాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విద్యాలయాలు విద్యార్థుల్లో అజ్ఞానాన్ని పారద్రోలి విజ్ఞానాన్ని వికసింపచేసే జ్ఞాన కేంద్రాలు. ప్రాచీన కాలంనుండి నేటివరకు విద్యాలయాలు విద్యార్థులకు జ్ఞానాన్ని అందిస్తూ వారి సమగ్రాభివృద్ధికి ప్రముఖ పాత్ర పోషించడం జరుగుతుంది. తద్వారా తన జీవితంలోని ఎదురయ్యే ప్రతి సమస్యను శాస్ర్తియంగా పరిష్కరించుకునే సాధికారతను పెంపొందించడానికి ముఖ్య కేంద్రాలుగా విద్యాసంస్థలు దోహదపడతాయి. ఈ సందర్భంగా విద్యాకేంద్రాలు కుల, మతాలకతీతంగా విద్యార్థులకు విజ్ఞానాన్ని అందిస్తూ విద్యార్థులలో లౌకికభావాన్ని పెంపొందిస్తూ నేటి పోటీ ప్రపంచంలో తమ గమ్యాన్ని చేరడానికి కావలసిన జ్ఞానాన్ని అందించడంలో పాఠశాల విద్య కీలకపాత్ర పోషించాల్సిన ఆవశ్యకత ఉంది. అదేవిధంగా పాఠశాల అనేది సమాజం యొక్క సూక్ష్మచిత్రంగా వ్యవహరిస్తూ దానిలో పనిచేసే ఉపాధ్యాయుడు విద్యార్థుల జ్ఞాన సముపార్జనకు దోహదకారిగా పనిచేసే వెలుగు దీపిక లాంటివాడు. కానీ నేడు విద్యాసంస్థల తీరు చూస్తుంటే విద్యార్థులను అజ్ఞానపు మూఢత్వంలోకి నెట్టే చీకటి కేంద్రాలనే భావన కలుగుతుంది.
ముఖ్యంగా ప్రస్తుత కాలంలో కొన్ని విద్యాలయాల్లో యాగాలు, హోమాలు నిర్వహిస్తూ విద్యార్థులకు అనేక మత సంబంధమైన విశ్వాసాలను పరిచయంచేస్తూ అశాస్ర్తియమైన భావజాలాలను పెంపొందించడం జరుగుతుంది. మత సంబంధిత కార్యక్రమాలను ప్రభుత్వ విద్యాసంస్థలలో నిర్వహించడం భారత రాజ్యాంగ ఆదర్శాలకు విరుద్ధం అని భారత రాజ్యాంగంలో పేర్కొన్నప్పటికీ నేటికీ కొన్ని ప్రభుత్వ విద్యాసంస్థలు ఆచరించడం దారుణం. రాజ్యాంగ ఆదర్శాలను, దేశ సంస్కృతీ సంప్రదాయాలను, విలువలను, భారతీయ సామాజిక చైతన్య ఉద్యమాలను, స్వాతంత్య్ర సమరయోధుల పోరాటాలు మరియు సమకాలీన శాస్తస్రాంకేతిక అంశాలను బోధించాల్సిన విద్యాసంస్థలు నేడు మతపరమైన ఆచార సాంప్రదాయాలకు మరియు మూఢ విశ్వాసాలకు నిలయం అవుతున్నాయి. దానికి ఉదాహరణ ఇటీవల వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండలంలోని శంభునిపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు దయ్యాలు, భూతాల కారణంగా విద్యార్థుల సంఖ్య తగ్గిందని, అదేవిధంగా సహ ఉపాధ్యాయురాలితో గొడవలు సద్దుమణగాలని ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు క్షుద్ర పూజలు నిర్వహించడం దీనికి నిదర్శనం.
ఇంతటి దారుణమైన మూఢత్వ భావనలు విద్యాసంస్థల్లో రావడం వెనక ముఖ్యకారణం ఉపాధ్యాయులలో లోపించిన శాస్ర్తియ వైఖరి. అదేవిధంగా ప్రభుత్వ పరిపాలనలోని ప్రజాప్రతినిధులు, అధికారులలో అలుముకున్న వ్యక్తిగత మత విశ్వాసాలు, ఛాందస భావాలు విద్యాసంస్థలలోని కరికులం, విధానాల రూపంలో రోజురోజుకు చొరబడడమే కారణం అని చెప్పవచ్చు.
ఇలాంటి అశాస్ర్తియ భావజాలాలు విద్యాసంస్థలలో దూరం చేయకపోతే మన విద్యాసంస్థలనుంచి డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు శాస్తవ్రేత్తలు బయటకు రాకుండా బాబాలు, స్వాములు మరియు మత ఛాందస ఉగ్రవాదులు వచ్చే ప్రమాదం ఉంది. కావున సాధ్యమైనంత త్వరలో విద్యాసంస్థలలో వైజ్ఞానిక ఆలోచనలతో కూడిన విద్యను బోధిస్తూ, పోటీ ప్రపంచాన్ని జయించే విధంగా విద్యార్థిని తయారుచేసే విద్యను అందించవలసిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉంది. అదేవిధంగా ప్రభుత్వ పరిపాలన, విధానాలు మరియు పద్ధతులు కూడా ప్రగతిశీల భావాలు కనిపించే విధంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ నేపథ్యంలో ఇటీవల కేరళ ప్రభుత్వం పాఠశాలలో ‘రాజ్యాంగ పీఠిక’ను ప్రార్థన సమయంలో చదివించాలని నిర్ణయించడం హర్షించదగ్గ విషయం. ఇలాంటి వినూత్నమైన గొప్ప నిర్ణయాన్ని అన్ని రాష్ట్రాలలోని పాఠశాలలో అమలుచేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.

- సంపతి రమేష్ మహారాజ్, 9859556367