Others

నిత్యమూ, సత్యమూ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిత్య జీవితంలో మనిషి ఎనె్నన్నో కలలు కంటూ వాటిని నిజం చేసుకునేందుకు ప్రణాళిక ప్రకారం ముందుకు సాగుతుంటాడు. కొందరు కళల పట్ల ఆసక్తిని పెంచుకుంటూ కళాభిమానులుగా కళాకారులుగా రాణిస్తుంటారు. కలలు నిజమవడమైనా కళల్లో రాణించడమైనా భగవదనుగ్రహం తప్ప మరొకటి కాదంటారు. కళలే కాదు ఏ రంగంలో రాణించాలన్నా భగవదనుగ్రహం తప్పక ఉండి తీరాల్సిందే.
ఇలాంటి భగవదనుగ్రహం సాధించాలంటే పొందాలంటే అనుభవంలోకి రావాలంటే మనిషి మనిషిగా జీవించాలి. నటన పనికిరాదు. సృష్టిలోని పదార్థమే కానీ తాను అన్యం కాదని మనిషి తెలుసుకోవాలి. సర్వసృష్టి నియామకుడు, సర్వాధి కారి కూడా భగవంతుడు. భగవంతుడు కానిది అంటూ ఏదీ లేదు. భగవంతుడు గుణాలకు అతీతుడు. స్తోత్ర ప్రియుడూ కాదు. కానీ మన మనస్సు నిశ్చలంగా, నిర్మలంగా, భగవంతుడు కార్యాకారణుడు అని, సర్వ వేళలా సర్వావస్థలలోను తెలుసుకొని ఉండడానికి భగవంతుడిని అష్టోత్తర శతనామాలతో పూజిస్తుంటాడు మనిషి.
అపోహలతో, అవివేకంగా ఆలోచించి భగవంతుడు కూడా మనలాంటి వాడే. ఆయనకు లాభం వస్తే మనకు మేలు చేస్తాడన్న దురా లోచనలను, దూరూహలను కలిగించు కోకూడదు.
సర్వానికి కర్త కర్మ క్రియ అయన సర్వేశ్వరుడిని ఎవరికి తోచినట్లు వారు పిలుస్తుంటారు. పూజి స్తుంటారు. కానీ నదులన్నీ వేరు వేరుగా ఉన్న ప్పటికీ, వాటి వాటి ప్రత్యేకతలు కలిగి ఉన్నప్పటికీ కూడా చివరకు సముద్రంలో కలిసి నట్లుగానే భగవంతుడిని పూజించడానికి ఎవ రెవరో ఎనె్నన్నో మార్గాలు అనే్వషిస్తూ వారి కిష్టమైన పద్ధతిలో భగవంతుడిని పూజిస్తుంటారు. కానీ ఈ కర్మసాక్షి, సర్వేశ్వరుడు, సర్వసాక్షీస్వరూపుడు, విశ్వరూపుడు శశిశేఖరుడు, నారాయణుడు, ఏ పేరుతో పిలిచినా ఏ యే రీతులల్లో పూజచేసినా అందించవలసిన కర్మ ఫలాన్ని మాత్రమే అందిస్తాడు.
పుణ్యఫలాలను ఎవరికి ఎంత ఇవ్వాలో అంతమాత్రమే మరీ ఇస్తాడు. నీవు తప్ప అన్యధా శరణం నాస్తి అని వేడుకుంటే చాలు ఏ పూజలు చేయకపోయనా, ఏ స్తుతులు పాడకపోయనా ఏ నుతులు చదవకపోయనా భగవంతుని కరుణ అపారంగా వర్షిస్తూనే ఉంటుంది. అంటే కేవలం మనసు నిర్మలంగా ఉండాలి. మానవత్వం కలిగి ఉండాలి. తోటిప్రాణి ని హింసిస్తే మనకూ అదే బాధ కలుగుతుందన్న విశ్వాసం ఉండాలి. భగవంతు నిపైన అపారమైన నమ్మకం ఉండాలి. అంతే ఆ విశాలాక్షుడు, సదానందుడు, వికుంఠుడు, లక్ష్మీ వల్లభుడు, ఇందిరా మనోహరుడు, పినాకి పాణి పార్వతీప్రియ నందనుడు తన భక్తులను తానే కాపాడుకుంటాడు. తన సృష్టిని తానే రక్షించు కుంటాడు.
అది కాదని వివేకం ఇచ్చాడు కదా అని వివేచనాదూరులై అహంకరిస్తే అజ్ఞానం దరి చేరుతుంది. శివమాయో లేదా విష్ణుమాయో కమ్మేస్తుంది. ఆ విష్ణువే, ఆ శ్మశాన వాసే తరలి వచ్చి కంఠాన్ని దునిమి ఇదిగో ఇది అసలు సంగతి. నీవు దుష్టుడివైనా, సన్మార్గుడివైనా చివరకు ఇదే నీకు దారి అని చూపిస్తాడు. దుష్టుడివైతే నా ఆగ్రహాన్ని రుచిచూస్తావు. గడ గడలాడుతూ వణుకుతూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని హరి హరి అంటావు
అదే నా అనుగ్రహం కలిగితే నీఅంత అదృష్టవంతుడు లేడని, నాకృపే చాలని, ఆనందాను భూతి లో మునుగుతూ ప్రాణాలు కూడా నాకు అక్కర్లేదు. నిత్యమూ, సత్యమై వెలిగే ఆ పరంజ్యోతి స్వరూపం నాకనుల ముందు ఉంటేచాలు. ఈ క్షణభంగురాలైన ఈ సుఖాలు నాకు అక్కర్లేదు. ఎన్ని భోగాలు ఎన్ని వేలకోట జన్మలదాకా ఇచ్చినా నాకు అక్కర్లేదు. కేవలం నీ దృష్టి నాపై ఉంటే చాలు అని పులంకాకురాలు పొందుతూ కళ్లల్లో ఆనంద భాష్పాలు రాలుస్తూ ఆనందాంబుధిలో మునకలు వేస్తూ హరోం హరా శంభో శంకరా అని అంటుం టావు అంటాడా భగవంతుడు.
మరి నీవేదారిలో వెళ్త్తావో నీఇష్టం. నీకేం కావాలో దానే్న నేను ఇస్తాను అంటాడు సర్వశక్తి సమన్వితుడైన సర్వ శుభలక్షణుడు.
అతి చిన్నవాడు అయనా కావాల్సింది నారాయ ణుని దయతప్ప మరేం వద్దని ద్రువుడు అన్నా నీకు నక్షత్రమండలాన్ని ఇస్తాను. కానీ కొన్నాళ్లు ఈ భూలోకంలో రాజుగా వర్థిల్లు అన్నాడు ఆ నారాయణమూర్తి. కంసుడు, హిరణ్యకశిపుడూ అసలు భగవంతు డనే వాడే లేడు లేడు అని ముప్పది మూడుకోట్ల సార్లు అరిచి మొత్తుకుని ఎక్కడా ఎక్కడా ఆ భగవంతుడు నేను వానిని తుంపేస్తాను. తెంపేస్తాను అని గాండ్రించినా వూరుకున్న ఆ మహితోత్తముడు తన భక్తులను, సాధువులను, సత్పురుషులను హింసించడానికి పూనుకోగానే, అంతటా నేనే ఉన్నానని సర్వానికి కారణుడను నేనే అని ఎవరు కోరుకున్న రీతిలో వారికి కనిపించి అహర్నిశమూ వైరభక్తితో తనే్న స్మరించినా యమసదనానికి చిటికెలో పంపేశాడు. వారికోసం తన్ను తాను అఖిల భువనాలు స్తుతించేట్టుగా సృజియంచు కున్నాడు. ఒకసారి నరమృగ రూపాన్ని ధరిస్తే మరొక మారు అతి సామాన్య యాదవ కులంలో పుట్టాడు. అందరినీ ఆకర్షించే కృష్ణుడయ్యాడు. మరొకసారి ప్రభువుగా ఇలను పాలించే ధర్మప్రభువుగా పుట్టి సామాన్య మానవునిగా ఎన్నో కష్టనష్టాలను భరించి తుదకు ధర్మపరా యణులకు, సత్యనిరతులకే కాలం కలిసి వస్తుంది. మహాపురుషులు వారికై వారు దరిచేరుతారు. చివరకు విజయలక్ష్మి వరిస్తుంది అని ఆచరించి చూపిం చాడు.. యుగాలు మారినా ప్రతివారి మనసులో తిష్టవేసుకొని కూర్చున్నాడు. వాడే భగవంతుడు. సర్వాంతర్యామి. చరాచరసృష్టిలో అంతర్యామియై వెలుగొందుతున్నాడు.

- రాయసం లక్ష్మి