Others

సినీ, రాజకీయ రంగాల సవ్యసాచి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పట్టుదలకూ, క్రమశిక్షణకూ మారుపేరైన తెలుగు భాషకు, తెలుగు జాతికి దేశవ్యాప్త గుర్తింపు తెచ్చిన బహుముఖ ప్రజ్ఞులు నందమూరి తారక రాముడు. నాలుగు దశాబ్దాల సినీ ప్రస్తానంలో, పదమూడేళ్ళ రాజకీయ జీవితంలో చిరస్మరణీయుడై వెలుగొందారు ఆయన. ‘‘అన్నగారు’’ అని ముద్దుగా తెలుగువారు పిలుచుకున్న ఎన్టీఆర్ విశ్వవిఖ్యాత నట సార్వభౌముడుగా ఖ్యాతినొందారు. రాముడు, కృష్ణుడు, సుయోధనుడు, రావణుని వంటి పౌరాణిక పాత్రలతో పాటు వైవిధ్య భరిత సాంఘిక, జానపద చిత్రాలలో విభిన్న పాత్రలను పోషించి, సాటిలేని మేటిగా చిత్రసీమ రారాజుగా భాసిల్లిన రామారావు 13చారిత్రక, 55జానపద, 186సాంఘిక, 44పౌరాణిక చిత్రాలతో పాటు పలు తెలుగు, తమిళ చలన చిత్రాలలో పాత్రలకు జీవం పోశారు. 1982లో తెలుగుదేశం పార్టీని స్థాపించి, కేవలం 9 మాసాల కాల వ్యవధిలోనే అప్పటి వరకు కొనసాగిన కాంగ్రెస్ పాలనకు చరమగీతం పాడించి, ఆంధ్రరాష్ట్ర పరిపాలనా పగ్గాలు చేతబుచ్చుకుని, 8 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ప్రజల హృదయాలలో స్థిర స్థానం పొందారు.
1923 మే 28న కృష్ణ జిల్లా పామూరు మండలం నిమ్మకూరులో లక్ష్మయ్య, వెంకటరామమ్మ దంపతులకు జన్మించి, తారకరాముగా నామాంకితులై, విజయవాడ మున్సిపల్ స్కూల్‌లో, తర్వాత ఎస్సారార్ కళాశాలలో చదివారు. కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ తెలుగు భాషోపాధ్యాయునిగా రామారావుకు ఆడవేషం వేసే అవకాశం కల్పిస్తే, మీసాలు తీయకనే నటించి, మీసాల నాగమ్మగా పిలువబడ్డారు. 1942లో మేనరికంగా బసవ రామతారకంను వివాహమాడారు.
ప్రఖ్యాత నటులు కొంగర జగ్గయ్య, నాగభూషణం, కేవిఎస్ శర్మ, ముక్కామల లాంటి వారితో నేషనల్ ఆర్ట్ థియేటర్ నాటక సంస్థను స్థాపించారు. తర్వాతికాలంలో సదరు సంస్థ కొన్ని చిత్రాలు కూడా తీసింది.
జయకృష్ణ, సాయికృష్ణ, హరికృష్ణ, మోహనకృష్ణ, బాలకృష్ణ, రామకృష్ణ, జయశంకర్ కృష్ణ కుమారులుకాగా, పురంధరేశ్వరి, భువనేశ్వరి, ఉమామహేశ్వరి అని ముగ్గురు కూతుళ్ళు కలిగారు. 1947లో పట్ట్భద్రుడై, మద్రాసు సర్వీసు కమిషన్ పరీక్షలు రాసి, 1100మందిలో ఏడుగురిలో ఎంపికై, సబ్ రిజిస్ట్రార్ ఉద్యోగం పొంది, తన కార్యక్షేత్రం సినీరంగంగా ఎంచి, ఉద్యోగాన్ని వదిలారు. ప్రముఖ నిర్మాత బీ.ఏ. సుబ్బారావు మద్రాసు పిలిపించి, పల్లెటూరిపిల్ల చిత్రంలో కథానాయకుని పాత్ర, 116 రూపాయల పారితోషికం అందించారు. అయితే 1949లో విడుదలైన మనదేశం ఆయన కెమెరా ముందు నిలిచిన తొలి చిత్రమైంది. తర్వాత మద్రాసులో దర్శకుడు యోగానంద్‌తో కలిసి చిన్న గదికి మకాం మార్చారు. 1951లో నటించిన నాటికీ, నేటికీ తెలుగు ప్రజల హృదయాలలో నిలిచిన పాతాళ భైరవి చిత్రం 10కేంద్రాలలో శత దినోత్సవాలు జరుపుకుంది. 1956లో మాయా బజార్ చిత్రానికి ఎన్టీఆర్ తీసుకున్న 7500 రూపాయల పారితోషికం అత్యధికం. తర్వాత భూకైలాస్, వేంకటేశ్వర మహాత్మ్యం భారీ విజయాలు సాధించగా, శ్రీమద్విరాటపర్వంలో ఐదు పాత్రలు పోషించి ఔరా అనిపించుకున్నారు.
1972నుండి పారితోషికం లక్షల్లోకి చేరింది. లవకుశ, సీతారామ కళ్యాణం, దానవీరశూర కర్ణ, నర్తన శాల, విశ్వామిత్ర లాంటి చిత్రరాజాలు ఆయన నటనకు కలికితురాయిలుగా నిలిచాయి. న భూతో న భవిష్యతి అనిపించాయి. అడవి రాముడు, యమగోల బాక్సాఫీసు విజయాలు సాధించాయి. చిత్ర సీమలో రారాజుగా ఉన్న ఎన్టీఆర్ ప్రజాసేవవైపు తమ దృష్టి మరల్చారు. 1982 మార్చి 21న హైదరాబాద్‌కు చేరి, మార్చి 29 సాయంత్రం రాజకీయ పార్టీని స్థాపించనున్నట్లు ప్రకటించి, తెలుగుదేశం అని పేరు ఖాయం చేశారు. చైతన్య రథంపై ఆంధ్రదేశమంతా పర్యటించారు. ఆంధ్రుల ఆత్మగౌరవ నినాదంతో ప్రజల మనోభావాలను ప్రభావితం చేసి, ఢిల్లీలో తాకట్టు పెట్టిన ఆత్మగౌరవ పునరుద్దరణే పార్టీ లక్ష్యమని చాటి, ఎన్నికల బరిలో దిగి, సర్వం తామే అయి, 1983 జనవరి 7 ప్రకటిత ఫలితాలలో 199 శాసనసభ స్థానాలను సునాయాసంగా గెలుచుకుని, 97ఏళ్ళ కాంగ్రెస్ పాలనకు బ్రేక్ వేయగలిగారు. టీడీపీ వ్యవస్థాపక నేతలలో ఒకరైన నాదెండ్ల భాస్కర్‌రావు, 1984 ఆగస్టు 16న ప్రధాని ఇందిర, గవర్నర్ రాంలాల్‌ల సహకారంతో ఎన్టీఆర్‌ను పదవీచ్యుతిని గావించి, అధికారం హస్తగతం చేసుకోగా, ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమ ఫలితంగా సెప్టెంబర్ 16న తిరిగి ముఖ్యమంత్రి అయినారు.
1985 జూన్ 1న శాసనమండలి రద్దు, హుస్సేన్ సాగర్ కట్టపై ప్రసిద్ధుల విగ్రహాల ఏర్పాట్లు, సినిమా థియేటర్లకు స్లాబ్ విధానం, 1989లో మొత్తం మంత్రి వర్గాన్ని ఏకపక్షంగా రద్దుపరిచి, కొత్త మంత్రిమండలి ఏర్పాటు, నేషనల్ ఫ్రంట్ ఏర్పాటులో కీలకపాత్ర, రెండు రూపాయల కిలోబియ్యం పథకం, సంపూర్ణ మద్యనిషేధం, స్ర్తిలకు ఆస్తిలో వాటా, 1991లో నంద్యాలలో గౌరవ సూచకంగా నాటి ప్రధాని పీవీకి పోటీ నిలపక పోవడం, 1989-94మధ్య ప్రతిపక్షపార్టీ నేతగా, 1993లో లక్ష్మీపార్వతిని వివాహమాడడం, సాహచర్యం తారకరాముని రాజకీయ ప్రస్తానంలో ముఖ్యాతి ముఖ్య అంశాలుగా మిగిలాయి. నేటి విడిపోయిన తెలుగు రాష్ట్రాల తొలి ముఖ్యమంత్రులు కేసీఆర్, నారా చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ మంత్రివర్గంలో పనిచేసిన వారే కావడం విశేషం.
'చిత్రం... ఎన్టీఆర్

- సంగనభట్ల రామకిష్టయ్య