Others

ఊహాత్మక ‘సమస్య’పై ఒవైసీ సమరం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏ ప్రమాదం ముంచుకొచ్చిందని అఖిల భారత మజ్లిస్ ఇత్తేహాద్- ఉల్ ముస్లిమీన్ అధ్యక్షుడు, హైదరాబాద్ పార్లమెంట్ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ ఇంత పెద్దఎత్తున ఆందోళనలు నిర్వహిస్తున్నారు? ఆయనొక ఊహాత్మక సమస్యపై సమరం చేస్తున్నారు. తాజాగా ఆయన పౌర చట్టాన్ని అంగీకరించం, ఆ సవరణ చట్టాన్ని ఉపసంహరించేంతవరకు పోరాడుతామంటూ హైదరాబాద్‌లో ఇటీవల భారీ ‘తిరంగా ర్యాలీ’ని నిర్వహించారు. షరా మామూలుగా ట్రాఫిక్‌జామ్‌లు, అంబులెన్స్‌లకు దారిలేకపోవడం, ద్విచక్ర వాహనదారుల అగచాట్లు అన్నీఇన్నీ కావు. ఈ ర్యాలీలో జాతీయ పతాకాన్ని (తిరంగా) అగౌరవపరిచారని నెటిజన్ల ఆగ్రహం మరోసారి పెల్లుబికింది. కొసమెరుపు ఏమిటంటే.. ఇదే రోజు కొత్త చట్టం అమల్లోకి రావటం.
ఈ భారీ ర్యాలీలో అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ.. ఎవరికీ ఎలాంటి పత్రాలు చూపించాల్సిన అవసరంలేదని అన్నారు. పార్లమెంట్ సభ్యుడుగా పార్లమెంట్ ఆమోదించిన ఆ చట్టం ఏం చెబుతుందో... ఎవరినుద్దేశించి ఆ చట్టం చేశారో కూడా తెలియకుండా ఇలా ప్రసంగించడం, ప్రజల్ని రెచ్చగొట్టడం, ఊరేగింపులు జరపడం విడ్డూరంగా ఉంది.
పౌరసత్వ సవరణ చట్టం (సిఏఏ) అసలు భారతదేశంలోని పౌరులకు సంబంధించినదే కాదు. శరణార్థులుగా ఐదు సంవత్సరాల క్రితం పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన అక్కడి బాధిత మైనార్టీలకు పౌరసత్వం కల్పిస్తున్న చట్టం అది. మరి హైదరాబాద్‌లోని అశేష ముస్లిం ప్రజల్ని పత్రాలు చూపమని ఎవరు, ఎందుకు అడుగుతారు? ఆ విషయం చట్టంలో లేనే లేదు కదా? దశాబ్దాలుగా నానుతున్న సమస్యకు ఓ పరిష్కారం చూపేందుకు రూపొందించిన చట్టాన్ని మేం అంగీకరించం, ఎవరూ ఎవరికీ పత్రాలు చూపించకండి అంటూ ఊరేగింపులు, భారీ ర్యాలీలు నిర్వహిస్తూ చెప్పడం వింతగా, విచిత్రంగా అనిపిస్తోంది.. ఒక ఊహాత్మక సమస్యను ఇంత పెద్ద ఎత్తున రాద్ధాంతం చేయడం అసదుద్దీన్‌కే చెల్లింది. అవసరమైతే ఈ ఆందోళనను, పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని కూడా ఆయన హెచ్చరిస్తున్నారు. అంతేగాక ‘‘పౌరసత్వాన్ని ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదన్నారు’’ ప్రస్తుత భారత పౌరులను ఎవరు, ఎప్పుడు ప్రశ్నించారు? నిలదీశారు? ఇది గుమ్మడికాయల దొంగ కథను గుర్తుకు తెస్తున్న ప్రకటనలా ఉంది తప్ప ఓ పార్లమెంట్ సభ్యుడి మాటగా ధ్వనించడం లేదు. చట్టాలను గౌరవించవద్దని చెప్పడం రాజ్యాంగాన్ని అగౌరవపరచడమే కదా? చట్టాల వల్ల ఏవైనా ఇబ్బందులుంటే చర్చించేందుకు అనేక వేదికలున్నాయి, సుప్రీంకోర్టు ఉంది. ఆ ఇబ్బంది సమంజసమైనదే అయితే పార్లమెంట్‌లో సవరణ చేసుకునే సౌలభ్యమున్నది. వీటన్నింటిని పక్కనపెట్టి వీధుల్లోకొచ్చి ఊహాత్మక సమస్యను, పౌరసత్వ సవరణ చట్టంలో లేని అంశాలను ఉన్నట్టు ‘భ్రమ’ కల్పిస్తూ ప్రజల్ని రెచ్చగొట్టడం ఏ విధంగా ఆహ్వానించదగ్గదవుతుంది?
తెలంగాణ సమాజం మొత్తం ఈ చట్టాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తోందని కూడా ఆయన పేర్కొన్నారు. ఏ ప్రాతిపదికన ఆయన ఆ మాట అన్నారో ఆయనకే తెలియదు. ఈ ఉద్యమం కోసం ప్రకటించిన ‘యునైటెడ్ యాక్షన్ కమిటీ’కి నాయకుడిగా జస్టిస్ బి. చంద్రకుమార్‌ను ఆయన ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఆ కమిటీతో తనకెలాంటి సంబంధం లేదని చంద్రకుమార్ పేర్కొన్నారు. మరికొందరు ఈ దారిలోనే పయనించారు. ఏకపక్షంగా, వారిని సంప్రదించకుండా పేర్లను ప్రకటించి అభాసుపాలైన అసదుద్దీన్ ఇలా తెలంగాణ ప్రజలందరూ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారని చెప్పడం ఎలా సమంజసమవుతుంది? ఆ చట్టానికి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు గాని, దేశ ప్రజలకు ఎలాంటి సంబంధం లేనప్పుడు ఎందుకు వ్యతిరేకిస్తారు? ఎందుకు వ్యతిరేకించాలి? ఇట్లా అబద్ధాలతో ఆధునిక సమాజంలో, జాగృత సమాజంలో ఊహాత్మక సమస్యతో సమరం సాగించడం ఏవిధంగా ఆమోదనీయమవుతుంది? ఇప్పటికే నెటిజన్లు ఈ రకమైన ఆందోళనలపై విరుచుకుపడుతున్నారు. ఉద్యమం పేర కలిగిస్తున్న అసౌకర్యాలను నిరసిస్తున్నారు.
రాజ్యాంగాన్ని కాపాడుకోవలసిన అవసరముందని కూడా అసదుద్దీన్ ఈ మధ్య పదే పదే మాట్లాడుతున్నారు. రాజ్యాంగానికి ముప్పు ఏర్పడితే, ఆ ప్రమాద ఘంటికలు వినిపిస్తే దేశం ఇంత ప్రశాంతంగా ఎలా ఉంటుంది? కేవలం ముస్లిం సమాజమే ఎందుకు ఆందోళన చెందుతున్నది? ఆధారం లేకుండా, సరైన కారణం లేకుండా తమతమ రాజకీయ లబ్ధికోసం ఇలా ఆందోళనలు జరపడం తప్ప అందులో ఇసుమంత సత్యం లేదు గనుకనే మెజార్టీ ప్రజలు యథాప్రకారం తమతమ పనుల్లో నిమగ్నమై జాతి సంపదను పెంచేందుకు కృషిచేస్తున్నారు. దాన్ని చూసేందుకు ఒవైసీ నిరాకరిస్తే ఎలా?
జాతీయ జనాభా పట్టిక (ఎన్‌పీఆర్) ప్రక్రియను ఆపేయాలని కూడా అసదుద్దీన్ డిమాండ్ చేస్తున్నారు. ఒక పార్లమెంట్ సభ్యుడి నోట రావలసిన మాటలేనా ఇవి? ప్రతి పది సంవత్సరాలకోసారి జనాభా పట్టికను రూపొందించడం దశాబ్దాలుగా వస్తోంది. దాని ఆధారంగానే ప్రజలు సంక్షేమ-ఉపాధి కార్యక్రమాల రూపకల్పన జరుగుతుంది. మానవ వనరులు ఏమేరకున్నాయో తెలుస్తుంది. ఏ రంగంలో ప్రజలు వెనుకబడి ఉన్నారో అవగతమవుతోంది. ఆ వెనుకబాటుతనాన్ని పారదోలేందుకు అవసరమైన చర్యలు తీసుకునేందుకు ఆ పట్టిక తోడ్పడుతుంది. అలాంటి కీలక ప్రక్రియను, పట్టికను ఆపేయాలని డిమాండ్ చేయడమంటే మనం ముందడుగు వేస్తున్నామా? మధ్యయుగాల వైపు నడుస్తున్నామా? అన్న ప్రశ్న తలెత్తుతున్నది. ఇలా ప్రాథమిక పరిజ్ఞానం లేకుండా ఓ పార్లమెంట్ సభ్యుడు ప్రసంగాలు చేయడం హైదరాబాద్ ప్రజల దురదృష్టం.
‘‘బాబ్రీ మసీదు వివాదం ముగిసింది. అప్పుడు ఎలాంటి గొడవలు జరగలేదు. దాంతో ద్వేషభావంతో రెండువర్గాల మధ్య గొడవలు పెట్టి లబ్ధిపొందేందుకు భాజపా నాయకత్వం ఇప్పుడు ప్రయత్నిస్తోంది’’ అని అసదుద్దీన్ ఈ సందర్భంగా అనడం పరమ విడ్డూరంగా ఉంది. ఊహాత్మక సమస్యను తెరపైకి తెచ్చి రెండు వర్గాల మధ్య ద్వేషం రగిలిస్తున్నది అసదుద్దీన్ ప్రసంగాలే, చర్యలేనని ప్రపంచానికి తెలుసు. బాబ్రీ మసీదు సమస్యపై సుప్రీంకోర్టు తీర్పుపై రచ్చరచ్చ చేసింది ఆయనే, రివ్యూ పిటిషన్ వేసింది ఆయనే, మెజారిటీ ముస్లింలు ఆ తీర్పును గౌరవిస్తే సవాల్ చేసిందీ ఆయనే. ఆర్టికల్ 370ని రద్దుచేసినప్పుడు ఎగిరెగిరి పడింది ఆయనే. ఇప్పుడు గతాన్ని విస్మరించి భాజపానే ద్వేషాన్ని పెంచి పోషిస్తోందని బహిరంగ సభల్లో చెబుతున్నారు. ఇంతకన్నా అన్యాయం ఇంకొకటి ఏమైనా ఉంటుందా?
జనవరి 4న ట్యాంక్‌బండ్‌పై అనుమతి లేకుండా మిలియన్ మార్చ్ నిర్వహించి, తాజాగా మీరాలం దర్గాదగ్గర శుక్రవారం ప్రార్థనలు ముగిసాక ఆవేశం ఉప్పొంగిన వారితో కలిసి భారీ ర్యాలీ నిర్వహించి, భాజపా దేశాన్ని ద్వేషంతో నింపుతోందని పెడబొబ్బలు పెడితే అది వాస్తవమనిపించుకుంటుందా? ఇవే అబద్ధాలతో చార్మినార్ వద్ద ఈ నెల 25న బహిరంగ సభ, ముషాయిరా, అనంతరం బాపూఘాట్‌వద్ద ఈ నెల 30న మానవహారం ఏర్పాటుచేస్తామని భవిష్యత్ ప్రణాళికను ఆయన ప్రకటించడమంటే ఊహాత్మక సమస్యకు ఎవరు ఊపిరిపోస్తున్నట్టు? ఎవరు రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నట్టు? చట్టంలో లేని విషయాన్ని ఇంతటి ‘‘కార్చిచ్చు’’గా మార్చి ‘ఉల్టాచోర్ కొత్వాల్ కోడాఁటే...’ అన్న చందంగా వ్యవహరిస్తే అదెలా ఆధునిక సమాజానికి ఉపకరిస్తుంది? నెటిజన్లను ఎలా ఆకర్షిస్తుంది? సైబరాబాద్ కమిషనర్‌తో తన హోదాను విస్మరించి ట్విట్టర్‌లో వాదనకు దిగితే అదేం ఆదర్శప్రాయమవుతుంది? లేడికి లేచిందే పరుగన్నట్టుగాక సంయమనంతో, వాస్తవిక దృష్టితో, సత్యనిష్టతో సమాజాన్ని ఆయన వీక్షించాల్సిన అవసరమున్నది.

- వుప్పల నరసింహం, 9985781799