Others

ప్రలోభానికి గురవుతున్న ఓటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రజాస్వామ్య దేశంలో ప్రజలే అంతిమ నిర్ణేతలుగా పేర్కొంటున్న తరుణంలో వారి నిర్ణయాన్ని ఓటు హక్కు అనే ఆయుధం ద్వారా తెలియజేయడం జరిగింది. సార్వత్రిక వయోజన ఓటు హక్కు ద్వారా 18 సంవత్సరాలు నిండిన ప్రతి భారతీయుడు కుల, జాతి, మత, లింగ, భాషా భేదం లేకుండా ‘ఒక ఓటు ఒక విలువ’ ద్వారా ప్రజాప్రతినిధులను ఎన్నుకునే అవకాశం కల్పించి సమానత్వ సూత్రాన్ని ఆపాదించిన గొప్ప ఘనత ప్రజాస్వామ్యానిదే. కావున ఎన్నికలలో పోటీచేసే అభ్యర్థుల భవితవ్యాన్ని ప్రజల ఓటుహక్కు అనే ఆయుధం ద్వారా నిర్ణయించే అవకాశం ప్రజాస్వామ్యంలో ఓటర్లకు కల్పించబడింది. కావున ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కు అనేది వ్యక్తి అస్తిత్వాన్ని నిలబెడుతూ, వ్యవస్థ మార్పుకు నాంది పలుకుతుంది. నేడు భారతదేశంలో ఓటర్ల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. అందులో యువ ఓటర్ల సంఖ్య కూడా పెరగడం సంతోషించదగ్గ విషయం. కానీ పార్లమెంట్ ఎన్నికల నుండి నేటి పురపాలక ఎన్నికల వరకు బరిలో నిలబడిన అభ్యర్థులు విచ్చలవిడిగా డబ్బు మరియు మద్యంతో ఓటర్లకు గాలం వేసే సంస్కృతి విజృంభించడం విచారించదగ్గ విషయం.
కాలానుక్రమంలో ఎన్నికలలో జరుగుతున్న మార్పులను పరిశీలిస్తే అభ్యర్థులు గెలిచిన తరువాత అధికారంతో అవినీతి వైపు వెళ్తున్నారు.. ఎన్నికలలో ప్రలోభాలు అనే అవినీతికి పాల్పడి అంధకారంలోకి వెళ్తున్నారు. తద్వారా 70 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో కోట్లాది పట్టణ ప్రజలు సరైన పారిశుద్ధ్య వ్యవస్థకు నోచుకోక మురికివాడల్లో దోమలు స్వైరవిహారం మధ్య జీవిస్తూ పేదరికం, దారిద్య్రం, నిరుద్యోగం, నిరక్షరాస్యత, అజ్ఞానం, అనారోగ్యం అనే వెనుకబాటుతనానికి చిరునామాగా మారారు. వీటిని మార్చడంలో రాజకీయ నాయకులు, ప్రభుత్వాలు తాత్కాలిక పరిష్కారం వైపు వెళ్తున్నారు తప్ప శాశ్వత పరిష్కారాన్ని చూపడంలో వైఫల్యం చెందుతున్నారనేది చేదు నిజం. ఈ నేపథ్యంలో ఎన్నికలలో నీతి నిజాయితీలతో ఓటువేసే సంస్కృతికి ఓటర్లు దూరంగా ఉంటున్నారు. అదేవిధంగా రాజకీయ నాయకులు కూడా ప్రలోభ సంస్కృతితో ఓటు వేయించుకోవడంలో ముందు వరుసలో ఉంటున్నారు. తద్వారా నేటి ఎన్నికల క్రీడాయుద్ధంలో గెలుపొందిన అభ్యర్థులు పాత్రకే విలువను ఆపాదిస్తూ, ఓటర్ల పాత్ర శూన్యంగా పరిగణించడం జరుగుతోంది.
నేటి పురపాలక ఎన్నికల ముఖ చిత్రాన్ని పరిశీలిస్తే కూడా ప్రలోభ రాజకీయాలకు లోనై తమ ఓటుహక్కు అనే ఆయుధాన్ని మద్యానికి, మాంసానికి, డబ్బుకి అమ్ముకోవడానికి సిద్ధమై సమర్థవంతమైన నాయకుడిని ఎన్నుకోవడంలో విఫలం అవుతున్నారు. అదేవిధంగా ఓటర్లు తాత్కాలికంగా రాజకీయ కూలిగా మారి పార్టీల జెండాలను మరియు అజెండాలు మోసే బానిసలుగా మారడం జరుగుతుంది. మొత్తంగా ఎన్నికల క్రీడలో ఓటర్లు, రాజకీయ పార్టీల అభ్యర్థులు మునుపెన్నడూ లేని స్థాయిలో దిగజారుతూ నోటుతో ఓటు పొందడం పార్టీల ఆచారంగా మరియు ఓటుతో నోటు పొందడం సామాన్య ప్రజల ఆచారంగా మారుతుంది. తద్వారా ఓటు ఒక సరుకుగా, ఎన్నికల వ్యవస్థ ఒక మార్కెట్‌గా మారి నవ నూతన ధనస్వామ్య వ్యవస్థకు దారితీయడం జరుగుతోంది. కావున చైతన్యం అనేది రాజకీయ పార్టీలలో, రాజకీయ నాయకుల్లో, ఓటర్లలో రావలసిన అవసరం ఉంది. అదేవిధంగా ఎన్నికలలో పోటీచేస్తున్న అభ్యర్థిబాధ్యతపైన మరియు ఓటర్ల ఓటు హక్కు ప్రాముఖ్యతపైన భారతీయ ఎన్నికల కమిషన్, అధికారులు మరియు స్వచ్ఛంద సేవాసంస్థలు విస్తృతంగా అవగాహన కల్పించవలసిన అవసరం ఉంది. అప్పుడే ఓటర్లు తమ ఓటు అనే వజ్రాయుధాన్ని నిజాయితీగా, నిష్పక్షపాతంగా, నిర్భయంగా, వినియోగించుకొని సమర్థవంతమైన ప్రజాసేవకుడ్ని ఎన్నుకునే అవకాశం ఏర్పడుతుంది. తద్వారా ప్రజాస్వామ్య వికేంద్రీకరణలో భాగంగా పురుడు పోసుకున్న ‘పట్టణ స్వయం పరిపాలన’కు సార్థకత చేకూరి పట్టణాభివృద్ధికి బాటలు పడతాయి.

- సంపతి రమేష్ మహారాజ్, 9959556367