Others

గణతంత్ర వేడుకలు సరే..! సమానత్వం మాటేమిటి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మరోసారి దేశవ్యాప్తంగా గణతంత్ర దినో త్సవం వేడుకల కొరకు కార్యక్రమాలు పూర్తిచేశారు. ప్రతి యేటా ఆగస్ట్ 15న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు, జనవరి 26న భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు (రిపబ్లిక్ డే) వేడుకలు జరుపుకోవడం ఏడు దశాబ్దాలుగా ఆనవాయితీగా మారింది. ప్రజల కొరకు, ప్రజల చేత, ప్రజల కోసం ఏర్పడిన మన ప్రజాస్వామ్యంలో అన్ని దేశాల రాజ్యాంగాలకన్నా మన రాజ్యాంగం మహత్తరమైనదని పాలకులు ఎంతగానో గొప్పలు చెప్పుకుంటున్నారు. ఈ విధంగా 71వ రిపబ్లిక్ డే వేదిక మీద దేశ రాజధానిలో ప్రధానమంత్రి ఇతర పెద్దలు, అనేక రాష్ట్రాలలో ముఖ్యమంత్రులు, గవర్నర్లు, జిల్లాలలో కలెక్టర్లు ఇతర ప్రముఖులు జాతీయ జెండాను ఎగురవేసి ఇదీ.. మన ఘరకీర్తి అని గొప్పలు చెప్పడానికి సంసిద్ధులయ్యారు. అయితే.. ఈ డెబ్భై సంవత్సరాల స్వతంత్ర భారతంలో మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించామా? అని ప్రశ్నించుకోవలసి వుంది. 130 కోట్ల జనాభాలో కేవలం ఒక శాతం మంది చేతుల్లోనే డెబ్భై శాతం సంపద కేంద్రీకృతమై వుంది. 30 కోట్ల మంది ప్రజలకు నేటికీ సరైన కూడు, సేద తీరడానికి గూడు, ఒంటినిండా కప్పుకోవడానికి గుడ్డ లేని దుస్థితి కొనసాగుతూనే వుంది. ఈ కోణంలో వర్థిల్లుతున్న దరిద్ర భారతం అని పేర్కొనవచ్చు. గ్లోబల్ వెల్త్ రిపోర్ట్-2019 ప్రకారం భారత్‌లో సంపద అసమానతలు 83.2 శాతం వున్నాయని వెల్లడి కావడంతో నేటి రిపబ్లిక్ డే వేడుకలను చూస్తుంటే నవ్వాలో, ఏడవాలో అర్థంకాని పరిస్థితి ఏర్పడింది. భారతదేశంలో బలమైన మానవ వనరుల సంపద వుంది. సహజ వనరులు పుష్కలంగా వున్నాయి. సహజ వనరులను సద్వినియోగం చేసుకోవడానికి మానవ వనరులకు పని కల్పించడంలో పాలకులు ఏయేటికాయేడు విఫలమవుతూనే వున్నారు. పేరుకు ప్రజాస్వామ్యమే అయినప్పటికీ ఇందులో ధనస్వామ్యం అడుగడుగునా పై చేయిగా మారింది. ఏడాది కిందట జరిగిన సార్వత్రిక పార్లమెంట్ ఎన్నికలలో ఒక్కొక్క అభ్యర్థి సరాసరిన యాభై కోట్ల నుంచి వంద కోట్లు ఖర్చుపెట్టాడని అప్పట్లో మీడియా కోడై కూసింది. నేటి గౌరవ భారత పార్లమెంట్ సభ్యులలో ఎనభై శాతం మంది ఆగర్భ శ్రీమంతులు, కోటీశ్వరులు వున్నారు. ఇందులో నేర చరితుల సంఖ్య కూడా గణనీయంగానే వుంది. నిన్న మొన్న ముగిసిన తెలంగాణ మున్సిపల్ ఎన్నికలలో ఒక్కొక్క ఓటుకు 30వేలు వెచ్చించారంటే.. ధనస్వామ్యం యొక్క స్థాయిని ఏమని ప్రశ్నించాలి. మారుతున్న పరిస్థితులనుబట్టి బూజుపట్టిన చట్టాలను పక్కనబెట్టి కొత్త చట్టాలను తీసుకురావడానికి పార్లమెంట్ ఉభయ సభల ఆమోదంతో రాజ్యాంగ సవరణలు చేయడానికి అవకాశం వుంది. ఇప్పటివరకు 103 రాజ్యాంగ సవరణలు జరిగినప్పటికీ అనేక సవరణలు పాలకుల స్వప్రయోజనాలతో ముడిపడినవేనని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. ఈమధ్యనే అమల్లోకి వచ్చిన పౌరసత్వ సవరణ చట్టం గురించి కొన్నివర్గాలు అరిచి ఘీంకరిస్తుండడం బాధాకరం. పేదరికం కొన్ని బలహీనవర్గాలలో పుట్టుకతోనే వచ్చిందనే కారణంతో అన్నివర్గాల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని కొన్ని వర్గాలకు రిజర్వేషన్ల సౌకర్యాన్ని తీసుకువచ్చారు. అయితే.. ఈ రిజర్వేషన్ల ద్వారా ఆయా కులాల, వర్గాలనందలి వంశపారంపర్యంగా కొన్ని ధనిక కుటుంబాలు మాత్రమే బాగుపడుతున్నాయే తప్ప నిరుపేదలకు ఆ ఫలాలు అందడం లేదు.

- తిప్పినేని రామదాసప్పనాయుడు, 9989818212