Others

కర్మఫలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏది ధర్మము ఏది అధర్మమో తెలుసుకోవాలి. అప్పుడుకూడా ధర్మసూక్ష్మం తెలుసుకునే ఏపనినైనా ఆచరించాలి. లేకుంటే భగవత్పరితం చేయాలి. అంటే పని చేసేటపుడు తాను కేవలం నిమిత్తమాత్రుడని అనుకొంటే అధర్మభయం అంటదు అని అంటారు. కానీ అందరూ నేనే చేస్తున్నాను పని అనుకొంటారు. దానితోనే ఈ తంటా వస్తుంది. కర్మఫలం ఎంత బలవత్తరమైంది అంటే ఒకసారి తన సోదరుని వివాహం కోసం కాశీరాజు ముగ్గురు కుమార్తెలు, అందగత్తెలు అంబ, అంబిక, అంబాలికలు - వీరిని స్వయంవరం నుండి తన తమ్ముడు విచిత్రవీర్యుని కోసం సాల్వరాజును ఓడించాడు. భీష్ముని వెంట రావడానికి అంబ నిరాకరించింది. తాను సాల్వరాజును ప్రేమించానంది. భీష్ముడు దయాభావంతో సాల్వుని వివాహమాడి జీవించమంటే, సాల్వుడు నన్ను ఓడించి భీష్ముడు నిన్ను గెల్చాడు, అతనితో ఉండటం సబబన్నాడు.
అంబిక, అంబాలికలను విచిత్రవీర్యునికిచ్చి వివాహమొనర్చాడు. అంబ ఎవరికీ చెందక, ఎవరినీ వివాహమాడక అబలగా మిగిలింది. అక్కడనుంచి వెళ్లిపోయింది. పరమేశుని ప్రార్థించి శిఖండిగా జన్మించింది. భీష్ముని ప్రాణం పోవడానికి కారణమయ్యింది. భీష్ముడు ఒక కన్యకు వివాహం కాకుండా తన వలన జరిగిన ఈ కర్మఫలం శిఖండి రూపంలో ప్రతీకారం తీర్చుకుంది. ఈ ఫలం అనుభవించడానికి భీష్ముని పూర్వాశ్రమంలో చేసిన కర్మనే కారణం *