Others

జ్యోతిష్యశాస్త్రంలో గర్భస్థకుండలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జ్యోతిష్యమనగా జ్యోతిష్యుల యొక్క శాస్తమ్రు. జ్యోతిః అనగా ఆకసమందు జ్యోతించెడివి. అనగా ప్రకాశించేవి. వీటిని తెలుసుకొనుట వలన త్రుటికాలము మొదలుకొని బ్రహ్మకల్ప పర్యంతంగల కాల భేదములు కొలుచుటకును, ఇంకను ప్రపంచంలో వున్న జీవులకు వెలుగు మొదలైనవి కలుగజేయుటకు, గ్రహ నక్షత్ర మండలములు ఈశ్వరునిచే ప్రసాదించబడినవి. జీవులు సమస్త కర్మల నాచరించు తరి, తమకు జరుగబోవు శుభాశుభములు (్భత, భవిష్యద్వర్తమానములు) తెలుసుకొనుటకు ఉత్సాహపడుదురు. ఈ శాస్తమ్రు జాతక, ముహూర్త, సిద్ధాంత భాగములని మూడు విధములు. దీనిని ‘త్రిస్కంధ’ శాస్తమ్రనవచ్చును.
వేదాంగములు- శిక్ష, వ్యాకరణము, కల్పము, నిరుక్తము, ఛందస్సు, జ్యోతిష్యము. ఇది వేదమువలె గురువు వద్ద అధ్యయనము చేయవలసిన విద్య. ‘జ్యోతిశ్చక్రము’, ‘్భ చక్రము’, ‘శింశుమార చక్రము’ అని పిలువబడే కాలచక్రంలో 108 పాదములు కలిగి, 27 నక్షత్రముల సముదాముచేత ఏర్పడిన మేషాది ద్వాదశరాశి చక్రము ప్రధానమైనది. ఇవి ఫల నిర్దేశనమునకు కేంద్ర స్థానములై ఉన్నవి. మరియు సూర్యాది నవగ్రహములకు తదితర ఉపగ్రహములకు సంచార సమయంలో ప్రత్యేకత నందియున్నవి. రాశి చక్రంలో అన్నిటికంటె ముఖ్యమైనది ‘లగ్నం’. శిశువు తల్లి గర్భమునుండి బయటకు వచ్చి పంచభూతాలలో ఏదో ఒకటి కలిస్తే అదే లగ్నసమయం. దీనినిబట్టే 12 రాశుల నిర్ణయం, దాని అధిపతుల నిర్ణయం చేస్తారు. లగ్నాదిగాగల (ద్వాదశ) భావాలు వాటి ప్రాముఖ్యం, రాశులు, నక్షత్రముల మీద గ్రహములకు గల ఆధిపత్యములు, పరస్పర వేధలనందు నక్షత్రములు, పరస్పర మిత్ర శత్రుత్వాలు, తాత్కాలిక మిత్ర శత్రుత్వాలు కలిగిన గ్రహాలు, సమత్వముగల గ్రహ అన్యోన్యతలు, ఏ యే రాశులందు గ్రహాలకు స్వక్షేత్ర, మూల త్రికోణ, ఉచ్ఛ, నీచ స్థితులు కలుగునది, ఏ యే గ్రహాలు కేంద్ర, కోణాలలో స్థితిమై యున్నవి, ఏ రాశులు అరిష్టానికి సంకేతము, ఏ గ్రహాలు వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నవి సాధన చేసి తెలిసికొనవలెను. గ్రహముల పరస్పర దృష్టి ఫల నిర్దేశమునకు హేతువౌతుంది. అలాగే షడ్వర్గు సాధన, గ్రహాల షడ్బలాలు, అష్టక వర్గు సాధన, గ్రహాల అస్తంగత్వము, గ్రహముల యుతి (కలయిక-ద్విగ్రహ,త్రిగ్రహ,చతుర్థ, చంగ్రహ) శుభ, అశుభ దృష్టులు, గ్రహ యుద్ధాలు, గ్రహముల దశ విధ అవస్థలు, ద్రేక్కాణఫలము, గ్రహముల కార్యకత్వాలు భావకారకత్వాలు, అలాగే వరాహమిహరుడు వ్రాసిన 368 యోగాలు చూసి ఫల నిర్ణయము చేయాలి. ఇపుడు కంప్యూటరు వచ్చిన తర్వాత ఎవరు గణన చేయుటలేదు. జాతకుని పుట్టిన తేది, పుట్టిన వూరు, టైమ్ ( ఏకాలంలో) పుట్టినది చెబితే అదే తయారుచేస్తుంది. ఇపుడు వీధికి నల్గురు జ్యోతిష్కులు తయారై, రాశి చక్రాలు పట్టుకొని ఫలితాలు చెప్పుటకు పూనుకొంటూ, ఏదో చెప్పేస్తున్నారు. టీవీలలో తాము చెప్పినది జరుగుతుందంటూ, జరిగిందంటూ, సవాళ్ళు విసురుతున్నారు. అభాసు పాలౌతున్నారు.
కారణాలు పరిశీలిద్దాం
ఏన్షియంట్ ఆస్ట్రాలజికల్ సైన్స్ ఈజ్ డివైడెడ్ ఇన్ టు 3 స్కందాస్ ఆర్ 6 అంగాస్. ‘గణిత, సంహిత, హోర ఆరు అంగాలు, జాతక, గోళ, నైమిత్త, ప్రశ్న, ముహూర్త మరియు గణిత.
గణిత స్కంధం, గోళ, గణిత చెబుతుంది. హొర, స్కంద, జాతక, ప్రశ్న, ముహూర్త మరియు కొంత నైమిత్త చెబుతుంది. సంహిత నాగం జీవుల అదృష్టాన్ని, వాతావరణాన్ని, జంతువృద్ధి చెబుతుంది.
జ్యోతిష్యము రెండుగా విభజింపబడుతుంది. 1. ప్రమాణము 2.్ఫలము
గణిత స్కంధము ప్రమాణం క్రింద వస్తుంది. మిగిలిన రెండు (సంహిత, హోర) ఫల నిర్దేశం క్రింద వస్తుంది. ప్రమాణం కొలతలు (మెజర్‌మెంట్స్), గణన క్రింద వస్తుంది. ఫలనిర్దేశము వెనువెంటనే చెప్పడానికి వీలు లేదు. ది రీజన్ ఈజ్ ఫల ఈజ్ బేస్డ్ ఆన్ కాజ్ - ఎఫెక్ట్ ఫినోమినా. దిహొరాస్కోప్ మెర్లీ ఇండికేట్స్ ది రిజల్ట్స్ ఆఫ్ వన్స్ ప్రీవియస్ కర్మ. హెన్స్ ది ఫ్యూచర్ ఆఫ్ మాన్ ఈజ్ ఓన్లీ ది ఫ్రూట్ ఆఫ్ హిజ్ పాస్ట్ యాక్షన్స్. జ్యోతిష్యానికి ‘వేదస్య చక్షుః’. ఈ ఫల నిర్దేశానికి అంతర్ చక్షువు కావాలి. యవనులు (గ్రీకులు), మ్లేచులు జ్యోతిష్య పరిశోధన చేశారు. యవనాచార్యులు వ్రాసిన గ్రంథాన్ని వరాహమిహిరుడు అనుసరించి అతనికి మహర్షి స్థానాన్ని ఇచ్చాడు.
జ్యోతిష్యము ఎవరు చెప్పాలి?
దీనికి వరాహమిహిరుడు ‘బృహత్సంహిత’లో కొన్ని అర్హతలను ఉటంకించాడు. జ్యోతిష్యము చెప్పువానికి చక్కటి శాస్తజ్ఞ్రానము జ్యోతిష్యశాస్తమ్రులో, నక్షత్ర (ఖగోళ) శాస్త్రంలో, మంత్ర శాస్తమ్రులో వుండవలెను. వేదాధ్యయనము చేసి వాటి మంత్రార్థ మూలాలు తెలిసి వండవలెను. చక్కటి సంస్కారము కలిగి మన వైదిక ధర్మ మార్గంలో జీవనం సాగించాలి. మరియు కొన్ని గోప్యమైన ‘మంత్రాలు’ గురూపదేశంతో అభ్యాసము (జపము) చేసి ‘సిద్ధి’ పొంది యుండవలెను. ఆ సిద్ధి పొందిన మంత్రబలము వలన భూత, భవిష్యద్వర్తమానములు చెప్పగల శక్తి లభ్యవౌతుంది. ఇంకా వరాహమిహిరుడుఇలా చెబుతాడు, ఆ జ్యోతిష్యుడు సంస్కారవంతుల కుటుంబంలో జన్మించి యుండవలెను. వినయ విధేయతలతో, గుణగణములతో భగవంతునిపై అచంచల భక్తి విశ్వాసము కలిగి వుండవలెను. కొన్ని సాధన సమయాలలో బ్రహ్మచర్య దీక్ష పాటించాలి. ఇది అతని అతీంద్రియ జ్ఞాన సముపార్జనకు దోహదపడుతుంది. మరియు జ్యోతిష్కునకు పంచ సిద్ధాంతాలపై (బ్రహ్మ, సూర్య, వాశిష్ట, రోమస, పౌలస్య) సాధికారత సంపాదించాలి.
‘అనేక హోరాతత్వజ్ఞ పంచ సిద్ధాంతకోవిదః
ఊహా పోహపదుః సిద్ధమన్త్రోజానతి జాతకమ్ ఇతి
ఒక మంచి రోజు గురువు లగ్నంలో వుండగా చంద్రుడు మృదు, శీఘ్ర, వర్గులలో వుండగా సద్గురువు దగ్గర జ్యోతిష్యము నేర్చుకొనుట ప్రారంభించాలి. జ్యోతిష్యములో పట్టు సాధించుటకు మహాగ్రంథాలు ఎన్నో కొన్నింటిపై అధికారిత సాధించాలి.
- ఇంకావుంది...

- కె. రఘునాథ్.. 9912190466