Others

డిజిటల్ నిరక్షరాస్యులవల్లే సైబర్ నేరాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశంలో సాంకేతిక పరిజ్ఞాన వినియోగం ఎంత వేగంగా పరిగెడుతుందో, మొబైల్ ద్వారా అరచేతిలోకి అంతర్జాలం వచ్చిన తర్వాత ఏం జరుగుతుందో, ఎలా జరుగుతుందో, చివరికి ఏవౌతుందోనన్న అనుమానం, ఆశ్చర్యం సగటు మానవుణ్ణి కలవరపెడుతుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. నేడు మనిషి కరెన్సీ లేకుండా లావాదేవీలు జరుపుతున్నాడు. వివిధ రకాలైన బ్యాంకులు సైతంవారి బ్యాంకుకు సంబంధించి ప్రత్యేక యాప్‌లను డెవలప్‌చేసి తమ కస్టమర్లకు అందుబాటులో ఉంచింది. ఇవియేగాకుండా ఫోన్‌పే, గూగుల్ పేలను ఉపయోగిస్తున్నారు.
పట్నాలలో, నగరాలలో ఎక్కువ చదువు చదివినవారు వాడుతున్నారంటే సరే అన్పించినా, నేడు గ్రామస్థాయిలో సైతం ప్రతి పౌరుడు వినియోగిస్తున్నాడు. మరీ ముఖ్యంగా ప్రతి షాపులలో, హోటళ్లలో ప్రతిచోట ఆన్‌లైన్‌పే సౌకర్యం కలదని బోర్డులు వేలాడదీసి ఉంటాయి. ఇదంతా అభివృద్ధిలో భాగమనుకుంటే ఆన్‌లైన్ ఆర్థిక లావాదేవీల అంశంపై ఓఎలెక్స్-2020 ఇంటర్నెట్ బిహేవియర్ పేరిట దేశవ్యాప్తంగా నిర్వహించిన సర్వే ఫలితాలను ‘సేఫర్ ఇంటర్నెట్ డే’ సందర్భంగా విడుదల చేయగా ఎన్నో భయంకరమైన వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.
దేశవ్యాప్తంగా ఎవరైనా తమ ఫోన్‌లోకి ఒక యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని ఉపయోగించాలంటే మన వ్యక్తిగత వివరాలను ఇవ్వాల్సివస్తుంది. మనకు తెలియకుండానే మన సమాచారం ఇతరులకు చేరుతుంది. ఇలా షరతులు, నిబంధనలు పట్టించుకోనివారు 73శాతం ఉండగా, ఇంటర్నెట్ వినియోగించిన వారిలో వన్‌టైం పాస్‌వర్డ్‌ను తమకు తెలియకుండా ఇతరులతో పంచుకున్నవారు 26శాతం ఉన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకొని నేరాలకు దిగుతున్న సైబర్ నేరగాళ్ళు వివిధమార్గాలను ఎంచుకొని వ్యక్తుల బ్యాంకు ఖాతా నంబర్, పాస్‌వర్డ్, క్రెడిట్‌కార్డు, డెబిట్ కార్డు ఓటిపినీ పొందుతున్నారు. వీటి బారినపడి వివరాలను ఇతరులకు చెప్పేవారు 22 శాతం ఉండగా, ఆన్‌లైన్ లావాదేవీలు, వివిధ రకాల వెబ్‌సైట్ యాప్‌లను వినియోగించేటప్పుడు ముందు జాగ్రత్తచర్యలు తీసుకోనివారు 48 శాతం ఉన్నారు. మరీ ముఖ్యమైన ఆసక్తికర విషయమేమిటంటే తాము మోసపోయిన విషయాన్నీ అంగీకరిస్తున్నవారు 48 శాతం వున్నారంటే దేశంలో సైబర్ నేరగాళ్ల బారిన పడుతున్న డిజిటల్ నిరక్ష్యరాస్యులెందరో తెలియకనే తెలుస్తుంది.
ఇక్కడ గమనించాల్సిన విషయం మరొకటి వున్నది. డిజిటల్ నిరక్ష్యరాస్యుడు అంటే చదువు రానివాడు కాదని కాదు. చదువొచ్చినా సాంకేతిక పరిజ్ఞానం, లోపలి లొసుగులు తెలియవని అర్థం.. ఎన్నో చదువులు చదివి, వివిధ రకాల ఉద్యోగాలు చేస్తున్నవారు సైతం సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన వారున్నారంటే ఎలాంటి ఆశ్చర్యం అక్కర్లేదు. ప్రస్తుత సమాజంలో ప్రతి ఉద్యోగి నెల జీతం బ్యాంకుల ద్వారానే తీసుకునే పరిస్థితి, ప్రతి వ్యవసాయదారుడు క్రాప్ లోన్స్, ప్రభుత్వ పథకాల ద్వారా వచ్చే డబ్బును బ్యాంకుల ద్వారానే తీసుకోవాలి, అలాగే మహిళా మండలి ప్రతి నెలవారు కొంత సొమ్మును బ్యాంకులలో జమ చేసుకోవడం అందరికి తెలిసినదే..
అంటే ఇప్పుడు దేశంలో బ్యాంకులలో అకౌంట్ లేకుండా ఉన్నవారెవరైనా ఉన్నారంటే ఏదో చిన్నపిల్లలు మాత్రమే వుంటారు. ఏ బ్యాంకులోనైనా ఖాతా తెరవాలంటే తమ ఆధార్‌కార్డు సమర్పించాల్సిందే. ఎటిఎం కార్డు, పాన్‌కార్డు, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు పొందాలంటే ఆధార్ తప్పనిసరి అయిపోయింది. సాంకేతిక విద్యనభ్యసించి, జ్ఞానం పెంచుకున్న కొంతమంది, వారియొక్క జ్ఞానాన్ని ఉపయోగించి, విభిన్న పరిశోధనలు గావించి, వివిధరకాల సైట్‌లను, వ్యక్తిగత సమాచారాలను హైక్‌చేయడం అంటే అతని తెలియకుండానే, అతనియొక్క పూర్తి వ్యక్తిగత వివరాలను తెలుసుకోవడం జరుగుతుంది.
దేశంలో రోజురోజుకు అభివృద్ధిలో భాగంగా పరిణితి చెందుతూ నూతన సాంకేతికతను పరిచయం చేస్తున్నా.. అంత వేగంతో నేరగాళ్ళు సైతం వారి ఆలోచనలతో కొత్తకొత్త ఆవిష్కరణలతో ముందుకెళ్లుతున్నారనడానికి ఈ సర్వే వెలువడించిన ఫలితాలే కారణమని చెప్పక తప్పదు. ఇక్కడ సైబర్ నేరగాళ్ళు కేవలం అధిక సొమ్ముతో లావాదేవీలు నడుపుతున్నవారినే ఎంచుకొని, ఇలాంటి సంఘటనలకు పాల్పడుతున్నారు. సాధారణ వ్యక్తులకు వీరినుండి ప్రస్తుతం ఎలాంటి ఇబ్బంది లేకపోయినా, భవిష్యత్‌లో జరగబోయే పరిణామాలను దృష్టిలో ఉంచుకొని తదనుగుణంగా ముందుకు నడవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.
ప్రభుత్వం సైతం వివిధ సర్వేల ఫలితాలను పరిశీలించి, సైబర్ నేరగాళ్ల ముప్పు నుండి తప్పించుటకు, సాంకేతిక నిపుణులతో చర్చించి, వారి సేవలను వినియోగించుకుంటూ ఒక ప్రత్యేక యంత్రాంగాన్నీ ఏర్పాటుచేసి, ఇలాంటి నేరాలకు ఎవరు పాల్పడిన వెంటనే వారిని గుర్తించేటట్లు, ఇలాంటి పనులకు పాల్పడితే కఠినమైన శిక్షలు వేసే విధంగా కృషిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఎందుకంటే వర్తమాన సమాజంలో సాంకేతిక పరిజ్ఞానవాడకం ఏ విధంగా పురోగాభివృద్ధి చెందుతుందో చూస్తుంటే భవిష్యత్‌లో జరగబోయే పరిణామాలు సగటు మానవునికి ఒకింత ఆశ్చర్యానికి గురిచేయక మానని పరిస్థితి. అందుకే భవిష్యత్‌లో ఇలాంటి పరిణామాలు చోటుచేసుకోకుండా ఉండాలంటే ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఏదైనా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించినప్పుడు దానివల్ల కలిగే అనర్థాలను పసిగట్టి దానికి తగిన ప్రత్యామ్నాయాలను కూడా ఏర్పాటుచేసుకుంటే ఎంతో మంచిది. కావున ఆ దిశలో ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ప్రపంచీకరణ నేపథ్యంలో సాంకేతిక విప్లవం పరుగెడుతున్న సందర్భంలో వాటి ఫలితాలతోపాటు దుష్ఫలితాలను సైతం అంచనావేసి, తదనుగుణంగా మారాల్సిన అవసరం ప్రభుత్వాల పైనా ఉన్నది. కావున ప్రజలకు అన్ని రకాల రక్షణలు కల్పిస్తూ అండగా ఉండాలని కోరుకుందాం.

- డా. పోలం సైదులు, 9441930361