Others

మనుగడకు పెను ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేడు ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం
*
న్యప్రాణులు ప్రకృతితో భాగమై జీవావరణ మరియు జీవవైవిధ్య సంరక్షణలో కీలక పాత్ర వహిస్తాయి. భూగోళంపై వన్యప్రాణులు మానవునికి ఆర్థికంగా, వాణిజ్యపరంగా, విజ్ఞానపరంగా, వ్యవసాయ పరంగా, సాంస్కృతిక పరంగా దోహదపడుతూ ప్రకృతికి సౌందర్యాన్నిస్తాయి. భూమి, ఆకాశం, నీటిలో ఉన్న ఎన్నోరకాల వన్యప్రాణులు మనచుట్టూ జీవిస్తున్నాయి. అనేక కారణాల రీత్యా వైవిధ్యమైన వన్యప్రాణులు రోజురోజుకు అంతరించిపోతూ వాటి మనుగడ ప్రశ్నార్థకంగా మారుతూ పర్యావరణ సమతుల్యత దెబ్బతినడం జరుగుతుంది. మాంసంకొరకు వేట, పర్యావరణ మార్పులు, అడవులు అంతరించిపోవడం, కాలుష్యం, మానవజాతి ఆహారం, ఆక్రమణకు కావడం, సెల్‌ఫోన్ టవర్స్ రేడియేషన్ వలన అంతరించి పోవడం జరుగుతున్నాయి. అదే విధంగా అభివృద్ధి పేరుతో జరుగుతున్న పట్టణీకరణ, పారిశ్రామీకరణ వలన అడవులు అంతరించిపోవడంతో వన్యప్రాణుల ఆవాసాలకు మరియు వాటి ఆహారానికి తీవ్ర ముప్పు ఏర్పడుతుంది. తద్వారా వినూత్నమైన జీవ జాతి రకాల మనుగడకు పెనుప్రమాదం పొంచి ఉన్నది.
ప్రపంచ భూభాగం పరిమాణంలో 2.4% ఆక్రమించిన భారతదేశం జీవ వైవిధ్యంలో 8% ఆవాసంగా ఉంది. జీవవైవిధ్యంలో భాగమైన జీవజాతులకు భారతదేశంతోపాటు ప్రపంచదేశాలలో గత కొంతకాలంగా రక్షణ కరువై అంతరించిపోవడం జరుగుతున్నాయని అనేక అధ్యయనాలు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా భారత్‌లో గత రెండున్న దశాబ్దాలుగా చాలా పక్షిజాతుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతోందని 15వేల మందికి పైగా ఔత్సాహికులు అందించిన వివరాల ఆధారంగా ‘ద స్టేట్ ఆఫ్ ఇండియాస్ బర్డ్స్’ పేరుతో వెలువడిన అధ్యయనం పేర్కొన్నది. 867 రకాల పక్షుల స్థితిగతుల గురించి వివరాలు అందించారు. వన్యప్రాణులు ప్రకృతి నేస్తాలని, వాటిని వేటాడితే ప్రకృతి సమతుల్యత దెబ్బతింటుందని, పాడే పక్షులు, కాకులు, పిచ్చుకలు, తీరాలకు వలవ వచ్చే పక్షుల సంఖ్య అత్యధికంగా తగ్గినట్లు నివేదిక తెలిపింది. వన్యప్రాణులకు రక్షణకరువై వేటగాళ్ల ఉచ్చుకు బలవుతున్నాయి. అడవులు నరికివేయడంతో వన్యప్రాణులు మృత్యువాతకు గురవుతున్నాయి. విద్యుత్ షాక్‌లు, వలల ఉచ్చుల్లోపడి మృతి చెందుతున్నాయి. మానవుడి అవసరాలకు అనుగుణంగా అడవులు ఆక్రమణలకు గురవుతున్నాయి. అరణ్యాల్లో ఉండాల్సిన వన్యప్రాణులు జనావాసాల్లోకి వస్తున్నాయి. నిత్యం ఏదోచోట ఉచ్చుల్లో చిక్కుకుని మృత్యువాత పడుతున్నాయి. వేటగాళ్ల ఆగడాలు కొనసాగుతుండటంతో అడవుల్లో వన్యప్రాణుల సంఖ్య గణనీయంగా పడిపోతోంది. దీంతో జంతు, పక్షి ప్రేమికులు ఆందోళన చెందుతున్నారు. మనిషి వల్ల ప్రకృతికి జరుగుతున్న విధ్వంసం అంతాఇంతా కాదు. కొన్ని వన్యప్రాణి జాతులు అంతరించిపోతున్నాయి. వన్యమృగాలు, మత్స్యసంపద, వృక్షాల రకాలు, దాదాపు మొత్తం మరో ఏడువేల రకాలు అంతరించిపోయే జాతిలో ఇప్పుడు చేరాయని ప్రకృతి సంరక్షణ అంతర్జాతీయ సమాజం (ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ది కన్సర్వేషన్ ఆఫ్ నేచర్ - ఐయుసిఎన్) హెచ్చరించింది. ఈ సమాజం ప్రపంచం మొత్తంమీద 1,05,000 తెగలను సమీక్షించింది. వీటిలో 28,000 తెగలు చాలా ప్రమాదంలో ఉన్నాయని వివరించింది. ప్రతి తెగ ఏదో ప్రమాదాన్ని ఎదుర్కొంటోంది. మితిమీరిన వేట, అడవుల నరికివేత వంటి మనుషుల విధ్వంసక చర్యలే వన్యప్రాణి సంతతి విపరీతంగా నశించి పోవడానికి దారి తీస్తున్నాయి. మానవ చరిత్రలో ఊహించని విధంగా ప్రకృతి విధ్వంసం అవుతోంది. ఈ వాస్తవాన్ని తెలుసుకుని ప్రకృతిని సంరక్షించడానికి ముందడుగువేయడమే తక్షణ కర్తవ్యమని ఐయుసిఎన్ హెచ్చరించారు. సముద్ర ప్రాణుల్లో ఐడ్జిచేపలు, గిటారి చేపలు, రైనో రేలు తదితర చేపలు వాటి పొడుచుకు వచ్చే వెడల్పయిన ముట్టి కారణంగా ఇప్పుడు అంతరించే ప్రమాదంలో ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు.
వన్యప్రాణుల సంరక్షణపై ప్రపంచస్థాయిలో జరుగుతున్న చర్యలు పరిశీలించినట్లయితే, ప్రపంచ దేశాలు చట్టపరమైన చర్యలు చేపట్టడానికి ఐక్యరాజ్యసమితి వాతావరణ కార్యక్రమం (యుఎన్‌ఇపి) ఆధ్వర్యంలో వన్యణుల వలస జాతుల రక్షణకై అంతర్జాతీయ వలస జాతుల భాగస్వామ్య పక్షాల సదస్సు (కోప్) ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తూ వాటి సంరక్షణ చర్యలపై చర్చించడం జరుగుతోంది. వన్యప్రాణుల సంరక్షణకు అంతర్జాతీయ స్థాయిలో ఐక్యరాజ్యసమితికి అనుబంధంగా ఐయుసిఎన్ (ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కర్సర్వేషన్ ఆఫ్ నేచుర్ అండ్ నేచురల్ రిసోర్సెస్) అనే సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచంలో అంతరించే దశలో మరియు ప్రమాదంలో ఉన్న జీవజాతులను గుర్తించి రెడ్ డేటాబుక్‌లో పొందుపరచడం జరిగింది. ఆ జాతులను సంరక్షించడానికి తగిన విధంగా చర్యలుచేపట్టాలని ప్రపంచ దేశాలను ఆదేశించడం జరుగుతుంది. దానికనుగుణంగా ప్రతి దేశం కూడా వన్యప్రాణుల సంరక్షణకు అభయారణ్యాలు, జాతీయపార్కులు మరియు ప్రత్యేక రక్షిత కేంద్రాలు లాంటి అనేక రక్షిత కార్యక్రమాలను చేపడుతున్నాయి. అదేవిధంగా వరల్డ్ వైల్డ్‌లైఫ్ ఫర్ నేచుర్ అనే అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ కూడా అంతరించిపోతున్న వన్యప్రాణులను గుర్తించి వాటి సంరక్షణకై ప్రపంచవ్యాప్తంగా చర్యలు చేపట్టడం జరుగుతుంది. భవిష్యత్‌లో అంతరించిపోతున్న వన్యప్రాణి జాతులను గుర్తించి ప్రపంచ దేశాల భాగస్వామ్యంతో పటిష్టమైన చట్టాలు తీసుకురావడానికి ఐక్యరాజ్యసమితి ఇంకా కృషిచేయాలి.
భారతదేశ వన్యప్రాణుల సంరక్షణ చర్యలు పరిశీలించినప్పుడు, చారిత్రకంగా వన్యప్రాణులకు మానవునికి మధ్య అవినాభావ సంబంధం ఉంది. భారతదేశంలో రెడ్ డేటా లిస్టు ప్రకారం పులులు, ఏనుగులు, రాబందులు, స్నోలియోపార్డ్, హోలీవ్‌రిడ్లీ అనే సముద్ర తాబేలు, గంగేస్ రివర్ డాల్ఫిన్ అనే మంచినీటి డాల్ఫిన్, ఆసియాటిక్ లయన్, రెడ్ పాండ, లయన్ తెలుడు మకాకు లాంటి కొన్ని జాతులు ప్రమాదంలో ఉన్నాయని పేర్కొనడం జరిగింది. దానికి అనుగుణంగా భారత్ అనేక ప్రత్యేక సంరక్షణ చర్యలతోపాటు చట్టపరమైన చర్యలుకూడా చేపట్టడం జరుగుతుంది. ముఖ్యంగా వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972, జీవవైవిధ్య సంరక్షణ చట్టం 2002, అడవుల సంరక్షణ చట్టం 1980ను పటిష్టంగా అమలుపరచాలి. అదేవిధంగా భారత రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలలోని ఆర్టికల్ 48ఎలో మరియు ప్రాథమిక విధులలోని ఆర్టికల్ 51ఎలో వన్యప్రాణుల సంరక్షణపై ప్రభుత్వానికి మరియు పౌరులకు ఆదేశాలు జారీచేయడం జరిగింది. ప్రస్తుత సమకాలీన పరిస్థితులకనుగుణంగా నవనూతన విధానాలతో భూమి, ఆకాశం, నీటిలో నివసిస్తున్న వన్యప్రాణుల మనుగడకై కృషిచేయాలి. అదేవిధంగా జీవవైవిధ్య సమతుల్యతలో వన్యప్రాణుల ప్రాముఖ్యతపై పాఠశాల స్థాయిలోనే అవగాహన కల్గించాలి. వన్యప్రాణుల సంరక్షణలో ప్రభుత్వానికి మరియు అటవీ అధికారులకు సహకరించాలి మరియు వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిదని భావించాలి. లేదంటే వాటి అస్తిత్వాన్ని చారిత్రకంగా చెప్పుకోవడం తప్ప, భౌతికంగా ముందుతరాలకు చూపించలేము.

- సంపతి రమేష్ మహారాజ్ 9959556367