Others

**జర్నలిజంలో ఒక అంశ రాలిపోయింది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ సీనియర్ పాత్రికేయులు శ్రీ పొత్తూరి వెంకటేశ్వరరావుగారు స్వర్గస్థులు అయ్యారన్న వార్త వారి అభిమానులందర్నీ కలచివేస్తోంది. వారు ఎడిటర్‌గా ఆంధ్రప్రభలో చూపిన సంపాదకీయ రచనాపటిమ గమనించిన వారిని కూడా కంట తడిపెట్టిస్తుంది. ఆ సంపాదకీయాలే ఆయనకు ఎనలేని కీర్తిని తెచ్చిపెట్టాయి.
నేను, ఆంధ్రప్రభకు కథలు రాయటం మొదలైన 1972లో నేను హైద్రాబాదులోని పత్రికాఫీసుకు వెళ్లాను. అప్పుడు విద్వాన్ విశ్వంగారు సంపాదకులు. ఆయన నన్ను చూసి బాగా ప్రోత్సహించారు. ఆ ఉత్సాహంతో రాస్తూనే కొనే్నళ్లకు మళ్లీ వెళ్లితే ఈమాటు అక్కడ శ్రీ పొత్తూరి వారున్నారు. ఈయన నన్ను, ‘‘రాయండి, రాయండి, ఆపకండి. మీదగ్గర భాష, భావం రెండూ మెండుగా ఉన్నాయి’’ అన్నారు. అక్కడనుంచి ఆంధ్రప్రభ వారపత్రికలో నా పరుగుకు తిరుగులేదు!
నా మొదటి నవల ‘పడగ్గది వైరాగ్యం’ను పోటీకి పంపాను. బహుమతి రాలేదు. కొంచెం ఆలస్యంగా ‘‘సాధారణకు స్వీకరించాము’’అన్న ఉత్తరం వచ్చింది. ఆ తర్వాత ఆయనే స్వయంగా నాకు చెప్పింది ఇది. ‘‘్భర్యాభర్తల మధ్య శృంగారంలో వచ్చే శ,ష,్భ,షల మీద మీరు రాయటం అపూర్వం. అందుకని దాన్ని ముగ్గురు రచయిత్రులకు పంపించి ‘‘గోఎహెడ్’’అనిపించుమని, తీసుకున్నాను. బహుమతి ఇవ్వలేకపోయాం కనక బాపూగారి చేత బొమ్మలు వేయించాను.’’ ఆ నవల చాలా ప్రాచుర్యం పొందింది, ఆ బొమ్మల వల్లనూ, మధురాంతకంవారి ముందుమాట వల్లనూ- అని నా అభిప్రాయం.
ఆ తర్వాత నా 60 కథల పుస్తకం ‘్భరత మహిళా జోహార్’కి 2003లో పొ.శ్రీ.తెలుగు విశ్వవిద్యాలయంవారు ‘ఉత్తమ కథాసాహితీ పురస్కారా’న్ని ఇచ్చారు. దీనిలో ముందుమాట రాసింది పొత్తూరి వారే. పురస్కారానికి ఇది కూడా కారణం అయి ఉండవచ్చును.
2016లో నేను హైద్రాబాద్‌లో హాస్పిటల్లో ఉండగా వారు వచ్చి నన్ను చూసారు. అప్పటికే ఆయనకు కాన్సర్ ఆవహించింది. ఆయన అన్నారు, ‘‘జిల్లెళ్లమూడి అమ్మ చెబుతూ ఉండేది, నువ్వు జీవుడివి. ఈ ఉపాధి నీది కాదు, ఎప్పుడైనా రావిపోవచ్చు’ అని నా విషయం అంతే!’’
పొత్తూరి వారికి దివిజ లోకంలో పాత్రికేయత లభించుగాక, శీఘ్రమే!

- కథాప్రవీణ గుండు సుబ్రహ్మణ్యదీక్షితులు