Others

కల్తీకి కాదేదీ అనర్హం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సమస్త జగత్తూ కల్తీమయమైపోయింది. ఈ ఆధునిక కాలంలో కల్తీ లేనిదేదంటూ వెతుక్కోవాల్సిన పని మనుషులమైన మనందరిదీ. ఇటీవల కల్తీపై సమగ్ర పరిశోధన నిమిత్తం తల్లిపాలపై శాస్తవ్రేత్తలు పరిశోధనలు జరిపితే ఆ పాలలో కూడా 17 శాతం మేరకు విషపదార్థాలు ఉన్నట్లు నిర్ధారణ అయిందట. తల్లి కావాలనే వ్యక్తి ఆ విషపదార్థాలకు ఉనికి కాలేదు. గర్భం ధరించినప్పటి నుంచి ఆ మహిళ తీసుకున్న ట్యాబ్‌లెట్స్, కాప్స్యూల్స్‌ని ఇతర బలవర్ధక ఔషధాలు, బిడ్డ ఆరోగ్యంగా గర్భాశయంలో ఎదగటానికి తీసుకున్న మందులు, బలవర్ధక ఔషధాలలో సంక్షిప్తంగా నిక్షిప్తమైన శకలాలే ఆ పరీక్షలలో తేలినట్లు శాస్తవ్రేత్తలు తేల్చి చెప్పిన సమాచారం. ఇక వేసవికాలం రానున్న తరుణంలో ఇష్టారాజ్యంగా కల్తీ నీటి వ్యాపారం లెక్కకు మిక్కిలిగా కొనసాగి పేద ప్రజల ప్రాణాల్ని డయేరియా, వాంతులు లాంటి వివిధ రకాల జబ్బులకు నీటి కలుషిత వ్యాపారులు బలి చేస్తున్నారు. కల్తీ నిరోధక చట్టం ఈ రాష్ట్రంలోనే కాదు. ఉభయ తెలుగు రాష్ట్రాలలో నామమాత్రంగా ఉందే కానీ నిరోధించిన కేసులు చాలా తక్కువే. అందుకు కారణం కల్తీనిరోధక శాఖలో ఉద్యోగుల కొరతేనని వేరేగా చెప్పనవసరం లేదు. మానవ ప్రగతికి ఆరోగ్యం, వైద్యం, సక్రమగతిలో పోషకాహారాల లభ్యత ఎంతో అవసరం. అసలు రోగాల పుట్టుక కలుషిత నీరు తాగడం వలననే పుట్టుకు వస్తున్నాయని వైద్యులు, శాస్తవ్రేత్తల నిశ్చిత అభిప్రాయం. అలాగే ఈ సమాజంలో కల్తీలేని వస్తువేదని నిపుణులు ఆరా తీయాలనే హెచ్చరిక జారీ చేయడంతో పాటు సవాల్ విసురుతున్నారు నిష్ణాతులు.
జనంలో పెరుగుతున్న వస్తువుల గిరాకీని పరిగణనలోకి తీసుకున్న విషయలోలురు, అధిక ఆదాయానికి ఆశపడిన వ్యాపారవేత్తలు, రెండు రాష్ట్రాల (తెలుగు) వ్యాప్తంగా దాహాన్ని ధనసంపత్తిగా మార్చుకునే టోకు వ్యాపారం మొదలెట్టి మంచినీళ్లతో (కలుషిత) కోట్లాది రూపాయల్ని దండుకొని, ప్రజలకు రకరకాల జబ్బులకు కారకులైన కలుషిత జలాల్ని స్వేచ్ఛావిపణిలో అమ్ముకొంటున్న వైఖరిని జలనిపుణులు తీవ్రంగా ఖండిస్తున్నారు. వాయుకాలుష్యం, జలకాలుష్యం, వాతావరణ కాలుష్యం, కల్తీ సరకుల కాలుష్యంతో ఇప్పటికే ప్రజల్ని రోగాలలోకి నెడుతున్నా ప్రభుత్వాల పరంగా కల్తీల నిరోధక విషయంలో యుద్ధప్రాతిపదికన తీసుకున్న చర్యలు అంతంతమాత్రమే.. నీరే రసభరిత జీవులకు ఆరోగ్యం, ఆహ్లాదకర జీవనానికి ప్రాతిపదిక అయిన తరుణంలో అశుద్ధిజలాల్ని విచ్చలవిడిగా షోకేసులలో పేర్చిన జిగేల్‌మనిపించే బాటిళ్లులో నింపి దాహార్తుల ధనాన్ని దోచుకుంటున్నా ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు ప్రవర్తించడం గర్హణీయం. జనాకర్షణ పథకాలు పదుల, ద్విపదుల సంఖ్యలో రాష్ట్రాలలో చేబట్టినా ప్రాథమిక రోగాంశాన్ని ప్రభుత్వాలు ఆవల తోయడం ఏమాత్రం సబబు కాదు. ఈ దేశ పౌరులకు ఆరోగ్యాన్ని, వైద్య సంపత్తిని, పోషకాహార లోపాల్ని సవరించి సమగ్ర పోషకాహార విలువల్ని సమకూర్చే పథకాల్ని కేంద్ర ప్రభుత్వం ఏనాడో రూపొందించింది. వాటికి అత్యాధునిక సొబగుల్ని అద్దుతూ కేంద్ర ప్రభుత్వం ఎన్నో పారదర్శక ఆహార, ఆరోగ్య, వైద్య చికిత్సా విధానాల్ని ప్రవేశపెట్టింది. ఒకవైపు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు దేశ ప్రజల కోసం అనాథలైన గర్భిణీల కోసం వివిధ ప్రభుత్వ పథకాలను ప్రవేశపెడుతున్నా ఆయా జిల్లాల అధికారుల అలసత్వం, నిర్లిప్తత కారణంగా ప్రభుత్వ పథకాలు పక్కదారి పడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నవరత్నాలలో భాగంగా తీసుకువస్తున్న పథకాలు, రాష్ట్ర ఆర్థిక సంక్షోభం కారణంగా అడుగు ముందుకు వేయలేని పరిస్థితి. ఈనాడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేవలం ఆర్థిక సంక్షోభంతోనే కాకుండా సి.ఎం. జగన్ అనుసరిస్తున్న అనేకానేక ఆర్థిక ఆలోచనల సందర్భంగా సి.ఎం. వ్యవస్థీకృత జమానాలో తప్పటడుగులు వేయడం ఏడు నెలల పాలనలో గొప్ప రికార్డు కాబోదు. వేచి చూడడం వలన కాలం వృధాయే కానీ కలిగే అనర్థాలు ఆ వ్యక్తికే జమ పడతాయి.

- దాసరి కృష్ణారెడ్డి 98853 26493