Others

మరింత క్రియోన్ముఖంగా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రఘుపతి వెంకటరత్నం నాయుడు తలపాగాలాగా గంభీరంగా ఆకర్షించింది ఓమ్ భవనం - సామరస్యాన్ని తన వంట నింపుకొని కాకినాడలో గవర్నమెంట్ జనరల్ ఆస్పత్రికి కాస్త దగ్గరలో, రోడ్డుకు అదే వైపు కనబడుతుంది - కాస్త కళ్ళు తెరచుకుని సాగితే! భారతదేశపు మూడు ప్రధాన మతాల వ్యక్తులూ తమదని భావించేలా నిర్మించబడిన ఈ బ్రహ్మ ఉపాసనా మందిరం - అందంగా ఉంది. అర్థవంతంగా ఉంది. అంతకుమించి స్వచ్ఛంగా ఆకర్షిస్తోంది. ఈ భవనానికి 92 ఏళళు గడిచాయి. తెలుగునాట కొత్త భావనలు ప్రోది చేసి, క్రియోన్ముఖంగా జీవనం సాగించిన రఘుపతి వెంకటరత్నం నాయుడు స్ఫూర్తినీ, మూర్తినీ విస్మరించిన పద్ధతిని స్ఫురింపజేస్తూ ఆ భవనం చుట్టుపక్కల ‘మన నిర్లక్ష్యం’ కాలుష్యంగా తాండవిస్తోంది. ఐదారు దశాబ్దాల క్రితం రఘుపతి, కందుకూరి పేర్లు జంట పదాల్లో పాఠ్యపుస్తకాలలోనే కాదు పత్రికా సంపాదకీయాలలో కూడా తారసపడేవి. వెంకటరత్నం నాయుడినే కాదు పనిచేయాలనే ధోరణినీ; ప్రచారం కన్నా కార్యాచరణ ముఖ్యమనే నియమాన్నీ మన సామాజిక జీవితం నుంచి బహిష్కరించామా? అనే సందేహం బలపడుతోంది. (అందుకే ‘యాక్షన్’ ముఖ్యం. అంటే ‘యాక్టింగ్’ కాదు సుమా!)
‘‘ఒకవైపు ప్రబలంగా రెసిడెన్షియల్ స్కూళ్ళ తాకిడి వ్యాప్తి చేసిన ధోరణీ; ఇంకోవైపు నిరర్ధకమైన వనరుల మధ్య నిర్లక్ష్యపు పాఠశాలలు, ఈ రెండు కాకుండా విభిన్నంగా సాగాలని ఆటపాటల చదువు అనే ఆశావాదపు పోకడలు మరోవైపూ...’’ ఇది తెలుగు బాల్యపు వర్తమాన పరిస్థితిని వివరించే చట్రం. ఒక వర్గం మహాపెనుగులాటలో ఉంటే, ఇంకో వర్గం మరింత బాధ్యతా రాహిత్యంతో మునిగింది. ఈ నేపథ్యంలో రెండు దశాబ్దాలలో తెలుగునాట రూపుదిద్దుకున్న పోకడ బాలోత్సవాలు.. ప్రస్తుతం దిశా నిర్దేశనం చేసేలా కాకినాడ క్రియ దశాబ్దంగా సాగడమే కాదు, ఇటీవల సాధ్యమైనంత వైవిధ్యంగా, అర్థవంతంగా తనను తాను మలచుకుంది. దీనికి కాకినాడ ‘క్రియ’ మిత్రులకు అభినందనలు. ప్రచారం, ప్రారంభోత్సవం, గెస్టు, ప్రసంగాలు, వాగ్దానాలు, లేకుండా చాలా సహజంగా, నిరాడంబరంగా వివిధ పోటీలు జరుగుతాయి. ఇదే క్రియ విధానం, గొప్పతనం, విజయం! అందుకే అభినందనలు..
‘‘పది, పనె్నండు వేల మంది పిల్లలను కలవడం చిన్న సందర్భం కాదు. నాకు మాత్రం ఇది నాలుగేళ్ళ నిరీక్షణా ఫలితం. ఆ పిల్లల కళళు, నవవులు, కేరింతలు, పరుగులు చూడాలని వెళ్ళాను. బాల్యపు దోషం ఏమీ లేదు. వారిలో నిత్య ఉత్సాహం తాండవిస్తోంది. ఈ ఉత్సాహం మనకు బాధ్యతను గుర్తు చేస్తోంది. పనిచేయడమే ప్రధానం. పనిచేస్తూ పోవడమే ప్రచారం’’ అని పాటింపజేయగలిగితే అదే సోషల్ సైనె్సస్‌కూ, హ్యుమానిటీస్‌కూ పెద్ద పీట వేయడం అవుతుంది. ఇందులో పిల్లల పాత్ర ఏమీలేదు. కేవలం మన పాత్ర కీలకం. సుమారు 28 వివిధ రకాల పాత్రలు నిర్వహిస్తున్నారు. ఏ పోటీలు నిర్వహిస్తున్నారు? ఎలా నిర్వహిస్తున్నారు? అనే విషయాలు క్రియ చిరునామా కావాలి. ముఖ్యంగా ఏ పోటీలు అనేది లోతుగా చర్చించాలి. ఇదివరకు చర్చించినట్టు త్రిభుజం వరకే పరిమితం కాకూడదు. దీనికి సంబంధించి క్రియ పెద్ద ఎత్తున అంటే లోతయిన చూపు ప్రసరించాలి. దీనికి పెద్ద సమావేశం కన్న పలువురు ఇచ్చే సూచనలు స్వీకరించడం స్థాయిలో ప్రయోజనకరంగా ఉంటుంది. అలాగే కథలు చెప్పడంలో పోటీ విపరీతంగా ఉంది. వాటిలో వాట్సప్ కాపీకథలు పుష్కలంగా ఉన్నాయి. ‘చెప్పడం కన్న చేయడం మిన్న’ అని తెలుసుకోవడం, కాపీ తప్పు అని పిల్లలు గుర్తించడం చాలా అవసరం. అలాగే నిర్ణేతలుగా ఉన్నవారు తమ మేథో ప్రవర్తన, ఎవరి మెప్పుకోసమో ప్రయత్నించినట్టు బయటపడటం- వంటి చిన్న చిన్న లొసుగులను సవరించుకోవచ్చు. కాడిలాగే ఎద్దుకే రైతు దెబ్బ వేస్తాడు. దాంతో అది సాగడమే కాదు మరో ఎద్దునీ కూడా లాగుతుంది. అలాగే చక్కగా పనిచేసే ‘క్రియ’ మరింత అర్థవంతంగా సాగాలనే ఆశ మాత్రమే నా కలాన్ని కదిలించింది. అంతకుమించి మరేమీ లేదు !

- డా. నాగసూరి వేణుగోపాల్ 94407 32392