Others

ప్రేమైక స్వరూపుడు వ్రజభూమి నివాసుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వైకుంఠం పరమాత్ముని ధామం. దివ్యమైనదీ ధామం. ఇందులో సత్యమూనిత్యమూ అయిన పరమాత్మ వ్యక్తుడై ఉంటాడని భక్తుల నమ్మకం. విష్ణ్భుక్తులకంతా వైకుంఠుడే సర్వశ్రేష్టమని, వైకుంఠం పరమోన్నతమైందనీ భావిస్తారు. గీతలో పరమాత్మ -
యద్గత్వాననివర్తంతే తద్ధామ పరమం మమ అంటూ తన స్థానం వైకుంఠమేనన్నారు. అందుకే ఇది విశిష్టమైన ప్రదేశం.
జనహృదయాలలో గోలోకధామం , సాకేతధామం, వైకుంట ధామమునకే పవిత్రప్రదేశములని భావన స్థిరపడింది. భాగవతంలో గజేంద్రమోక్ష ఘట్టములో పోతనగారు వైకుంఠపురాన్ని ఎంతోహృద్యంగా వర్ణించారు.
అలవైకుంఠపురంబులో నగరిలో ఆమూలసౌధంబుదా
పల మందార వనాంతరామృత సరః ప్రాంతేందుకాంతో
పలోత్పల పర్యంకరమావినోదుడని వర్ణించాడు.
ఆపన్న ప్రసన్నుని నివాసం వైకుంఠమే అని గజేంద్రమోక్ష ఘట్టంగా మనందరికీ వెల్లడైంది.
మూడు పాదాలలో భగవంతుడు విరాజిల్లుతున్నాడని పురుషసూక్తంలో వర్ణింపబడింది. అక్షర బ్రహ్మ ఒక పాదంలోజగత్తు ఉన్నది. అచట అరిషడ్వర్గాలకు తావులేదు. కామక్రోధ శోకలోభాదులులేవు. త్రిగుణాలల్లో రజోగుణం తమోగుణాదులకు తావులేదిచ్చట. కానీ ఒక్కవిశుద్ధి సత్త్వగుణమే ఇక్కడ వర్తిల్లుతూ ఉంటుం ది.
ఇంక వైకుంఠ శబ్ద విషయానికి వస్తే విగత కుంఠాదివికుంఠా అని అనగా ఏ బుద్ధి పూర్తిగా పరిశుద్ధమైనదో దానిని వికుంఠా అంటారు. కుంఠ అనగా కపటం, బుద్ధి యొక్క కాపట్యము అంటే సకామత బుద్ధి సకామముగా ఉన్నంత వరకు స్థూల వస్తువును జడవస్తువును ఆలోచిస్తున్నంత వరకు ఈ శరీరం గురించి భావిస్తున్నపుడు ఇది స్థూలంగా ఉంటుంది. సకామము- స్థూల బుద్ధి ద్వారా పరమాత్ముని బుద్ధి ద్వారానే మహాత్ములు పరమాత్ముని సాక్షాత్కరింపచేసుకుంటారు. సూర్యప్రకాశం ఏరీతిగా సూర్యకాంతి మణి ద్వారా అగ్నిని ప్రజ్వలింప చేస్తుందో అదేరీతిగా విశుద్ధ బుద్ధి ద్వారా పరమాత్మ ప్రత్యక్షవౌతాడు.
వికుంఠ అనగా శుద్ధ, బుద్ధి యందు ప్రకటింపబడినదానినే వైకుంఠం అంటారు. వైకుంఠం అన్నింటికంటే శ్రేష్టమైంది. అక్కడికి వెళ్లిన తరువాత జీవుడు ఈ జగత్తునకు రాడు. ఈవిషయ నిర్ణయంలో భాగవతంలో గోపికల మనో భావన వేరుగా ఉంది. గోపికల నివాసం వ్రజభూమి కదా. వ్రజ వనితలు పరమాత్ముని తో ఇలా అన్నారు. ఓ కృష్ణా! మా వ్రజభూమి వైకుంఠం కంటేమించిపోయింది. తే జన్మనాః తేవ్రజః వైకుంఠాదపి అధికం జయంతీ అంటూ వైకుంఠం కంటే వ్రజభూమి మహిమ మించిపోయింది. భక్తులు వైకుంఠమును బృందావనమును రెంటిని ఒక త్రాసులో తూస్తారు. భూమి భారంగా ఉంటుంది. ఆకాశం తేలిక అయిపోతుంది. ఈరెండింటి మధ్య వ్యత్యాసం మనోజ్ఞంగా ఉంటుంది వైకుంఠం నందు ఐశ్వర్యం ప్రదానంగా ఉంటే వ్రజభూమిలో ప్రేమే అధికంగా ఉంటుంది. వైకుంఠంలో శ్రీమన్నారాయణుడు అనంతకోటి బ్రహ్మాండ నాయుకనిగా, రాజాధిరాజుగా ఉంటాడు. పరమేశ్వరుడైనప్పటికినీ శ్రీకృష్ణుడు బాలునిరూపంలోనూ, గొల్లపిల్లలకు మిత్రునిగాను ఉంటాడు. భగవంతుడు వ్రజవాసులను ప్రేమించాడు. ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాడు. ద్వారకానాథుడుగా ఉన్నపుడు కృష్ణుని దగ్గర ఐశ్వర్యమే అధికంగా ఉన్నట్లుభాసిస్తే వ్రజవాసుడుగా ఉన్నపుడు ప్రేమైకరూపంతో భాసిల్లుతాడు.
గోపికలు చిన్ని బాలకుడైన పరమాత్ముని ఆడిస్తారు.హృదయానికి హత్తుకుని స్తన్యపానం చేయిస్తారు. బాలకులు కిష్టయ్యతో ఆడుకుంటారు. కోపం వస్తే దెబ్బలాడుతారు. కృష్ణయ్య చిలిపి చేష్టలకు ఆనందంతో ముగ్థులౌతారు. వైకుంఠంలో నారాయణునితో దెబ్బలాడగలరా? నృత్యం చేయగలరా? ఇది జరగని పనికదా!
అంతర్భహిశ్చతత్‌సర్వం వ్యాప్యనారాయణ స్థితః అని ఉంది. కావున వ్రజ ధూళి చాలా పవిత్రమైంది. కృష్ణావతార ఆవిర్భావంతోశోభతో అలరారింది. వ్రజవాసులు పుణ్యశ్లోకులు. పరమాత్ముని పొంది తరించిన జీవులు గోపికలు. గోపాలురు. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః

- పి.వి. సీతారామమూర్తి 9490386015