Others

సెక్షన్ 151 సీఆర్పీసీ పరిధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో విశాఖపట్నం ప్రస్తుతం కీలకంగా మారింది. జనవరి, 2017లో అప్పటి ప్రతిపక్ష నాయకుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్‌రెడ్డిని విశాఖపట్నం విమానాశ్రయంలో పోలీసులు నగరంలోకి ప్రవేశించకుండా నిరోధించారు. అక్కడనే అరెస్ట్‌చేశారు. ప్రస్తుత ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ అప్పుడు అధికారంలో ఉంది. ఇప్పుడు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు విశాఖ విమానాశ్రయంలో అటువంటి అనుభవమే ఎదురైనది.
ప్రతిపక్ష నేతగా జగన్మోహన్‌రెడ్డికి అప్పట్లో ‘వై’ కేటగిరి భద్రత ఉండగా, ఇప్పుడు ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడుకు ‘జడ్‌ప్లస్’ కేటగిరి భద్రత ఉంది. వీరిద్దరూ ఆయా సమయాలలో పోలీసుల వలయంలో ఉంటూ ఉండడంతో వారి కదలికలు పోలీసుల కనుసన్నలలోనే ఉంటూ ఉంటాయి. కాబట్టివారు చెప్పుకోదగిన (కాగ్నిజబుల్) నేరం చేసే అవకాశం లేదు. చెప్పుకోదగిన నేరం అంటే కనీసం మూడు సంవత్సరాల శిక్షార్హమైనది.
ఈ పూర్వరంగంలో అధికారంలో ఉన్నవారు తరచుగా తమ ప్రభుత్వ వైఫల్యాలపై ప్రచారంకోసం వెడుతున్న ప్రతిపక్ష నేతలను అడ్డుకోవడంకోసం ఉపయోగిస్తూ ఉండే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, 1973లోని సెక్షన్ 151 ఉంది.
ఈ చట్టం ప్రకారం చెప్పుకోదగిన నేరం చేయకుండా నిరోధించడంకోసం అరెస్ట్ చేయవచ్చు:
1. ఒకవ్యక్తి చెప్పుకోదగిన నేరం చేస్తున్నట్లు భావిస్తే, మెజిస్ట్రేట్ ఉత్తరువు అరెస్ట్ వారెంట్ లేకుండా ఒక పోలీస్ అధికారి ఎవరినైనా అరెస్ట్ చేయవచ్చు. మరోవిధంగా నేరం చేయకుండా అడ్డుకోవడం సాధ్యంకాదనిపించినప్పుడు ఆ విధంగా చేయవచ్చు.
2. ఈ చట్టంలోని సబ్ సెక్షన్(1) ప్రకారం ఆ విధంగా నిర్బంధంలోకి తీసుకున్న వారెవ్వరిని మరింకా నిర్బంధంలో ఉంచడం అవసరమైన పక్షంలో లేదా ఈ చట్టంలోని మరే నిబంధన ప్రకారం అయినా అధికారం పొందిన పక్షంలో లేదా అప్పుడు అమలులో ఉన్న మరే చట్టప్రకారం కాకుండా 24 గంటలకు మించి నిర్బంధంలో ఉంచరాదు.
సెక్షన్ 151 సీఆర్పీసీ అనేది పోలీసుల ముందస్తు నివారణ చర్యలకు సంబంధించింది. ఒక వ్యక్తి ఒక నేరం చేయడానికి ముందే దీనిని ఉపయోగించవచ్చు. సాధారణంగా, ఒక వ్యక్తి చెప్పుకోదగిన నేరం చేసినట్లయితే, అందుకు ఏడేళ్లకుపైగా శిక్షార్హత ఉండినట్లయితే సెక్షన్ 41ఏ సీఆర్పీసీ ప్రకారం అరెస్ట్‌చేస్తారు.
సెక్షన్ 151 సిఆర్‌పిసి క్రింద ఉండే అధికారం రాష్ట్రంలోని ముందస్తు నిర్బంధ చట్టాల వంటివి. ఈ నిబంధనలను చదివితే ఆ వ్యక్తి ఒక నేరం చేయడానికి సిద్ధంగా ఉన్నాడని, నిర్బంధంలోకి తీసుకోకుండా ఆ నేరాన్ని అడ్డుకోవడం సాధ్యంకాదని పోలీస్ అధికారి ఒక నిర్ణయానికి వచ్చి ఉండాలి.
పౌరులు దేశం అంతటా స్వేచ్ఛగా తిరిగే హక్కును రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(డి) ఇస్తుంది. చట్టంలో పేర్కొన్న ప్రక్రియ ప్రకారం కాకుండా ఏ వ్యక్తికి తన జీవన లేదా వ్యక్తిగత స్వాతంత్య్రాన్ని దూరం చేయరాదని ఆర్టికల్ 21 తెలుపుతుంది. స్వేచ్ఛగా సంచరించడానికి సంబంధించి సహేతుకమైన ఆంక్షలు విధిస్తూ ఎటువంటి చట్టంచేయకుండా నిరోధించి ఆర్టికల్ 19(5) ఆర్టికల్ 19(1)(డి)కి లోబడి ఉంటుంది.
చట్టం ఏర్పర్చిన ప్రక్రియ ప్రకారం ఒక వ్యక్తి స్వేచ్ఛను హరిస్తే అది ఆ హక్కు ఉల్లంఘన కిందకు రాదని ఆర్టికల్ 21 తెలుపుతుంది. అహ్మద్‌నూర్ మహమ్మద్ భట్టి కేసులో సెక్షన్ 151 సీఆర్‌పీసీని పరిశీలిస్తూ, చట్టంలోనే తగు రక్షణలు కల్పించబడినందున ఈ నిబంధన అసమంజసమైన లేదా ఏకపక్షంగా ఉండకూడదని సుప్రీం కోర్టు స్పష్టంచేసింది.
ఒక వ్యక్తిని మెజిస్ట్రేట్ ఉత్తర్వు లేదా అరెస్ట్ వారెంట్ లేకుండా అరెస్ట్ చేయడానికి సెక్షన్ 151లోని షరతులు ఏర్పర్చినట్లు రాజేందర్‌సింగ్ పఠనీయా, ఇతరులు ఢిల్లీ ప్రభుత్వం కేసులో సుప్రీంకోర్టు పేర్కొన్నది. నేరం చేయడానికి ఒక వ్యక్తి ఉద్దేశ్యం గురించి తెలుసుకున్నప్పుడే పోలీస్ అధికారి అరెస్ట్‌చేయాలని కూడా అత్యున్నత న్యాయస్థానం తెలిపింది.
మరో విధంగా అతనిని ఆ నేరం చేయకుండా అడ్డుకోలేమని ఆ పోలీస్ అధికారి నిర్ధారణకు వచ్చినప్పుడే అరెస్ట్ అధికారాన్ని ఉపయోగించాలని కూడా స్పష్టంచేసింది. ఈ షరతులు వీటిని ఉల్లంఘించినా రాజ్యాంగంలో ఆర్టికల్ 21, 22లు హామీఇచ్చిన ప్రాథమిక హక్కులను ఉల్లంఘించినట్లే కాగలదు.
పైగా మేనకాగాంధీ కేసులో రాజ్యాంగంలో సెక్షన్ 21 క్రింద చట్టంలో ఏర్పర్చిన ప్రక్రియ సహేతుకంగా, న్యాయబద్ధంగా, నిస్పక్షపాతంగా ఉండాలి. హేతుబద్ధం కాకుండా, విచక్షణా రహితంగా ఉండకూడదని సుప్రీంకోర్టు తెలిపింది. ‘వ్యక్తిగత స్వేచ్ఛ’ను సంకుచిత, కఠిన ధోరణిలో కుదించడం తగదని కూడా హితవుచెప్పింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21కు విస్తృతమైన వ్యాఖ్యానం కల్పిస్తూ వ్యక్తిగత స్వేచ్ఛని విస్తృత, ఉదార ధోరణిలో అర్ధంచేసుకోవాలని కూడా కోర్ట్ చెప్పింది.
సెక్షన్ 151 సీఆర్పీసీ క్రింద చర్యతీసుకొనే ముందు పోలీస్ అధికారి తప్పనిసరిగా ఆ వ్యక్తి ఎటువంటి చెప్పుకోదగిన నేరం చేసే అవకాశం ఉన్నదో అంటూ నమోదుచేయాలి. ముఖ్యంగా ‘వై’, ‘జెడ్’ క్యాటగిరీలలో భద్రత కల్పించిన నాయకుల విషయంలో ఈ విషయమై తగు కారణాలు చూపవలసిన భారం పోలీస్ అధికారులపై మరింత ఎక్కువగా ఉంటుంది.
క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లో సెక్షన్ 41ఏను ఒక సవరణ ద్వారా 2010 నవంబర్ 1నుండి చేర్చారు. తద్వారా తన అరెస్ట్ ద్వారా నేరారోపణకు గురైన వ్యక్తి హక్కులకు రక్షణ లభిస్తుంది. అసలు నేరం చేయకుండానే, ముందస్తుగా చర్యగా అరెస్ట్‌చేసే ముందు పోలీస్‌లు చాలా జాగరూకతతో వ్యవహరించాలి. తగిన ఆధారాలులేకుండా ఒక నేరంచేసే అవకాశం ఉన్నదంటూ సెక్షన్ 151 సిఆర్‌పిసి క్రింద అరెస్ట్ చేయడం ఆ వ్యక్తికి రాజ్యాంగంలో ఆర్టికల్ 21 హామీఇస్తున్న వ్యక్తిగత స్వేచ్ఛను హరించినట్లు కాగలదు.
ఆ విధంగా వ్యవహరించడమా ఏకపక్షంగా చర్యతీసుకున్నట్లు కాగలదు. కేవలం కోడ్ అరెస్టుకు అధికారం ఇస్తుంది కాబట్టి, పోలీసులు దానిని ఆశ్రయించలేరు. విచక్షణారహితంగా ఎటువంటి అరెస్ట్‌చేసినా రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1) (డి), ఆర్టికల్ 21లను ఉల్లంఘించినట్లు కాగలదని విషయాన్నీ సెక్షన్ 151 సిఆర్‌పిసి క్రింద చర్య తీసుకొనే ముందు పోలీస్ అధికారులు గుర్తుంచుకోవాలి.

- చిత్తరువు రఘు, హైకోర్ట్ న్యాయవాది craghuadvocate@gmail.com