Others

స్వేచ్ఛా సూచీలో అట్టడుగున దేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమెరికాకు చెందిన ప్రఖ్యాత సంస్థ ఫ్రీడం హౌస్ ప్రపంచ దేశాల్లో ఉన్న స్వేచ్ఛాయుత పరిస్థితులపై అధ్యయనంచేసి ఏటా నివేదిక విడుదల చేస్తుంది. ఫ్రీడం హౌస్ ఈ సంవత్సరం తాజా నివేదికను ఇటీవల వెల్లడిచేసింది. ఈ నివేదిక ద్వారా ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ ఈ యేటి ప్రపంచ స్వేచ్ఛా సూచీలో అట్టడుగున నిలిచింది. స్వేచ్చా సూచీనందు పతనానికి ఎన్‌ఆర్సీ, సీఏఏ, ఆర్టికల్ 370 రద్దు ఈ మూడే ప్రధాన కారణాలుగా పేర్కొంది. ఈ సంవత్సరం భారత్‌ను చర్చనీయాంశమైన దేశాల కేటగిరీలో చేర్చింది. ఈ కేటగిరీలో అశంతికి ఆలవాలమైన ఉక్రెయిన్, హాంగ్‌కాంగ్, టర్కీ, తునీషియా, సూడాన్, నైజీరియా, ఇరాన్, హైతీ తదితర దేశాల సరసన భారత్‌ను కూడా చేర్చింది. భారత్ స్థానం దిగజారడానికి ఆర్టికల్ 370 రద్దు, తదనంతర పరిణామాలు, అస్సోంలో ఎన్‌ఆరీసీ అమలు, దాని ప్రభావం, సీఏఏ అమలుకు యత్నం ఈ మూడింటి కారణంగానే భారత్ 88వ స్థానానికి పడిపోయి, జాబితాలో అట్టడుగున ఉన్న ‘ఫ్రీ’ కేటగిరీ దేశాల దగ్గర్లో నిలిచింది. ఈ నివేదిక ప్రజాస్వామ్య భారత్‌ను నియంతృత్వ చైనాతో పోల్చడం ఇక్కడ గమనార్హం. ఈ నివేదికలో వెల్లడైన అంశాలు ఈవిధంగా ఉన్నాయి. భారతదేశంలో భావప్రకటనా స్వేచ్ఛ, మత స్వేచ్ఛ, పౌర స్వేచ్ఛకు రాజ్యాంగం హామీ ఇస్తున్నప్పటికీ ఇటీవలి కాలంలో హిందూయేతరులపై మతపరంగా ప్రేరేపిత దాడులు చేసినట్లుగా, పాత్రికేయులు మరియు ఇతర ప్రభుత్వ విమర్శకులపై వేధింపులు పెరిగినట్లు తెలిపింది. ఇంకా ముస్లింలు, దళితులు, ఆదివాసీల విషయంలో చట్టపరమైన సమానత్వం పాటించటం లేదని, వారి అభివృద్ధికి రాజ్యాంగపరంగా ఉన్న ఏర్పాట్లు అమలుకాక ఆర్థికంగా మరియు సామాజికంగా అట్టడుగునే ఉన్నారని తెలిపింది. అస్సాంలో గత ఆగస్టులో జారీచేసిన పౌరుల రిజిస్టర్ దాదాపు రెండు మిలియన్ల మంది నివాసితులను మినహాయించి, వారికి ఎన్పీఆర్ చేయడం, అందులో అధికంగా ముస్లింలతోసహా జాతి బెంగాలీలు ఉండటం జరిగిందని, డిసెంబర్‌లో, పార్లమెంటు ముస్లింలపై వివక్ష చూపే కొత్త పౌరసత్వ చట్టాన్ని తీసుకొచ్చిందని, ఈ నేపథ్యంలో అనేక ప్రాంతాల్లో విస్తృత నిరసనలకు దారితీశాయని వాటిని అణిచివేసారని తెలిపింది. 2019 పార్లమెంటు ఎన్నికల్లో అధికార పార్టీ బీజేపీ మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసినప్పటికీ, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ పనితీరు మిశ్రమంగా కనిపిస్తుందని, సంవత్సరంలో చివరి మూడునెలల్లో మహారాష్ట్ర మరియు జార్ఖండ్ రాష్ట్రాలలో పట్టుకోల్పోయిందని తెలిపింది. 2019లో జరిగిన రెండు పరిణామాలవల్ల మైనారిటీల రాజకీయ హక్కులను, ముఖ్యంగా ముస్లింలను బలహీనపరిచాయని తెలిపింది. ఆగస్టులో, తూర్పు రాష్టమ్రైన అస్సాంలో పౌరసత్వస్థితిని సమీక్షించగా, కొత్త పౌరుల రిజిస్టర్ దాదాపు రెండు మిలియన్ల మంది అస్సాం నివాసితులను మినహాయించింది. వారిలో చాలామంది జాతి బెంగాలీ ముస్లింలు, పౌరసత్వం లేనివారుగా మార్చారు. మినహాయించినవారు 1971లో పొరుగున ఉన్న బంగ్లాదేశ్ స్వతంత్రమయ్యే ముందు వారు లేదా వారి పూర్వీకులు భారతదేశంలో నివసించినట్లు డాక్యుమెంటేషన్ ఇవ్వడంలో విఫలమయ్యారని ప్రభుత్వం ఆరోపిస్తోందని తెలిపింది. డిసెంబర్‌లో, పార్లమెంటు పౌరసత్వ సవరణ చట్టాన్ని ఆమోదించింది. ఇది ముస్లింమేతరులకు పొరుగున ఉన్న ముస్లిం మెజారిటీ దేశాలనుండి భారత పౌరసత్వానికి ప్రత్యేక ప్రవేశం కల్పించింది. అస్సాం రాష్ట్రంలో రిజిస్టర్ ద్వారా పౌరసత్వం పొందలేని స్థితిలోఉన్న బెంగాలీ హిందువులకు పౌరసత్వం లభించే ప్రయత్నం అని, ఇది వివక్షత కలిగిన చట్టంగా చూడబడిందని తెలిపింది. పెద్దఎత్తున రాజకీయ అవినీతి కుంభకోణాలు లంచం మరియు ఇతర దుర్వినియోగాలు పదేపదే బహిర్గతం అయ్యాయని, 2019లో అవినీతి ఆరోపణలపై పలువురు ఉన్నతస్థాయి ప్రతిపక్ష రాజకీయ నాయకులను అరెస్టుచేశారని, బిజెపికి అనుకూలంగా అధికారులు ఎంపిక చేసిన చట్టాలను అమలుచేస్తున్నారనే ఆరోపణలు వచ్చాయని తెలిపింది. 2005 సమాచార హక్కు (ఆర్టీఐ)చట్టం పారదర్శకతను మెరుగుపరచడానికి మరియు అవినీతి కార్యకలాపాలను బహిర్గతం చేయడానికి విస్తృతంగా ఉపయోగపడుతున్నదని, ప్రతి సంవత్సరం లక్షలాది అభ్యర్థనలు చట్టంక్రింద చేయబడతాయని, ఏదేమైనా, 80 మందికి పైగా సమాచార హక్కు చట్టం కార్యకర్తలు హత్యచేయబడ్డారని, వందలాది మంది దాడి చేయబడ్డారని, వేధించబడ్డారని తెలిపింది. జూలై 2019లో, పార్లమెంటు ఆర్టీఐ చట్టానికి సవరణలను ఆమోదించిందని, కేంద్ర మరియు రాష్టస్థ్రాయి సమాచార కమిషనర్ల జీతాలు మరియు పదవీకాలాలను కేంద్ర ప్రభుత్వ నియంత్రణలో ఉంచుతుందని, అందువల్ల వారిని రాజకీయ ఒత్తిడికి గురిచేస్తున్నదని తెలిపింది. ప్రస్తుత ప్రభుత్వంలో పత్రికా స్వేచ్ఛపై దాడులు పెరుగుతున్నాయి. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందే ఆన్‌లైన్‌నందు తప్పు సమాచారం విస్తృతంగా వ్యాపించిందని, జర్నలిస్టులు తమ పని సమయంలో వేధింపులు, మరణ బెదిరింపులు మరియు శారీరక హింసను ఎదుర్కొంటున్నారని, ఇటువంటి దాడులు కొన్ని పోలీసుల భాగస్వామ్యంతోకూడా జరిగాయని, 2019లో జర్నలిస్టులపై ఎటువంటి ఘోరమైన దాడులు జరగనప్పటికీ, జర్నలిస్టులను రక్షించే కమిటీ ప్రకారం, 2018లో వారి పనికి సంబంధించి ఐదుగురు, 2017లో నలుగురు మరణించారని తెలిపింది. రాజకీయ మరియు మతపరమైన సమస్యలపై ప్రొఫెసర్లు, విద్యార్థులు, సంస్థలను బెదిరించడం పెరిగినందున విద్యాస్వేచ్ఛ గతంలో ఉన్నంత ఇప్పుడు లేదని, ఇటీవలి సంవత్సరాలలో బలహీనపడిందని, హిందూ జాతీయవాద సంస్థ, రాష్ట్ర స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) యొక్క విద్యార్థి విభాగం, విద్యార్థులు మరియు ప్రొఫెసర్లపై దాడులతో సహా దేశవ్యాప్తంగా క్యాంపస్‌లలో హింసాత్మక వ్యూహలను ఉపయోగించిందని, బీజేపీ ప్రభుత్వం, ముఖ్యంగా పాకిస్తాన్‌తో భారతదేశ సంబంధాలు మరియు భారత కాశ్మీర్‌లోని పరిస్థితుల గురించి సున్నితంగా భావించే అంశాలపై చర్చించవద్దని విద్యావేత్తలు ఒత్తిడి చేశారని తెలిపింది.
2013లో ప్రారంభించిన దేశవ్యాప్త సెంట్రల్ మానిటరింగ్ సిస్టమ్, న్యాయ పర్యవేక్షణ లేకుండా ఏదైనా డిజిటల్ కమ్యూనికేషన్‌ను అడ్డుకోవడానికి అధికారులను అనుమతించడం, దుర్వినియోగ నిఘా పద్ధతులు ఆందోళనలను పెంచుతున్నది. వ్యక్తీకరణను అరికట్టడానికి చట్టాలు ఉపయోగిస్తున్నారని, పాకిస్తాన్ ఆధారిత ఉగ్రవాదులు భారత దళాలపై దాడిని జరుపుకున్నారనే ఆరోపణలతో 2019 ఫిబ్రవరిలో నలుగురు విద్యార్థులను దేశద్రోహానికి అరెస్టుచేశారని తెలిపింది. బహిరంగ సభలను పరిమితం చేయడానికి, కర్ఫ్యూలు విధించడానికి అధికారులకు అధికారం ఇచ్చే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ నిబంధనను అధికంగా ఉపయోగిస్తున్నదని, ఇటీవలి సంవత్సరాలలో నిరసనలను అరికట్టడానికి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు మొబైల్ మరియు ఇంటర్నెట్ సేవలను పదే పదే నిలిపివేసాయని తెలిపింది. శాంతియుత ప్రదర్శనలు జరుగుతుండగా వాటిని ఆపేందుకు రాష్ట్ర మరియు స్థానిక ప్రభుత్వాలు ప్రయత్నించాయని తెలిపింది. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు, అస్సాం పౌరుల రిజిస్టర్ ప్రక్రియను దేశవ్యాప్తంగా విస్తరించే ప్రతిపాదనలను అరికట్టడానికి చేస్తున్న నిరసనలను అడ్డుకోవడానికి ఇంటర్నెట్ను నిషేధించడమేకాక, ప్రత్యక్ష మందుగుండు సామగ్రిని ఉపయోగించాయని, సంవత్సరం చివరినాటికి నిరసన సంబంధిత హింసలో సుమారు 24 మంది మరణించారని, ఇంకా చాలామందిని అరెస్టుచేశారని తెలిపింది. ప్రభుత్వ, రాజకీయ శాఖల నుండి స్వతంత్రంగా ఉండాల్సిన న్యాయవ్యవస్థ ప్రభుత్వ జోక్యంతో నడుస్తుందని, న్యాయమూర్తులు ముఖ్యంగా సుప్రీంకోర్టు స్థాయిలో ప్రజాప్రయోజన వ్యాజ్యానికి ప్రతిస్పందనగా గణనీయమైన స్వయంప్రతిపత్తి మరియు క్రియాశీలతను ప్రదర్శించాల్సిన సందర్భాల్లో అయితే, న్యాయవ్యవస్థ దిగువస్థాయిలో అవినీతికి గురయ్యాయని తెలిపింది. చట్టాలు అమలులో భద్రతా అధికారులచే హింస, దుర్వినియోగం, అత్యాచారాలు జరిగినట్లు నివేదించబడింది. జైలు సిబ్బందిచే ఖైదీలపై, ముఖ్యంగా మైనారిటీలు మరియు షెడ్యూల్డ్‌కులాల సభ్యులపై దుర్వినియోగం సాధారణమయిన విషయంగా మారిందని, జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు నివేదించిన గణాంకాలు 2018లో 1,966 మరణాలు జ్యుడిషియల్ లేదా పోలీసు కస్టడీలో జరిగాయని సూచిస్తున్నాయని తెలిపింది. రాజ్యాంగ కుల వివక్షను నిషేధించినప్పటికీ చారిత్రాత్మకంగా వెనుకబడిన షెడ్యూల్డ్ తెగలు, దళితులు మరియు ప్రభుత్వం ‘ఇతర వెనుకబడిన తరగతులు’గా వర్గీకరించబడిన సమూహాలకు విద్య మరియు ప్రభుత్వ ఉద్యోగాలలో కోటాలను కేటాయించినా, ఆయా కులాల మరియు మైనారిటీల సభ్యులు సాధారణ వివక్షని, హింసను ఎదుర్కొంటున్నారు. న్యాయవ్యవస్థ అట్టడుగు వర్గాలకు సమాన రక్షణ కల్పించడంలో విఫలమవుతున్నదని తెలిపింది. లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా అంతర్జాతీయ మీటూ ఉద్యమంలో భారతీయ భాగస్వామ్యం ఈ సమస్యపై అవగాహన పెంచింది. కాని వేధింపుల సంఘటనలను నివేదించిన తరువాత కూడా ఆయా మహిళలపై ప్రతీకారం తీర్చుకుంటున్నారని తెలిపింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 పౌరులకు భారత భూభాగంలో ఏ ప్రాంతంలోనైనా నివసించే మరియు స్థిరపడే హక్కును ఇస్తుంది. ఏదేమైనా తిరుగుబాటు హింస, మత ఉద్రిక్తతలవల్ల దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఉద్యమ స్వేచ్ఛ దెబ్బతింటున్నది. 2019లో ఆంధ్రప్రదేశ్ 75 శాతం ఉద్యోగాలను స్థానికులకు కేటాయించాలని చట్టాన్ని రూపొందించిందని, ఇతర రాష్ట్రాలు కూడా ఇలాంటి విధానాలను పరిశీలిస్తున్నాయని తెలిపింది.

- వాసిలి సురేష్, 9494615360