AADIVAVRAM - Others
చూచిపోవే తల్లి!
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఇవి యేమి పూవులో
ఇవి యేమి తావులో
చెట్ల కొమ్మలు ఎంత పుకిలించెను..
ఎండ కన్నుల రంగు
ఎన్ని వనె్నలు పొంగు
ఇప్పుడీమేరలో ఇగిరించెను..
వనసీమకీ పూట
జన వాటి నీ చోట
కిరణాలు తోలుకొని యేతెంచెను..
చూచిపోవే తల్లి
చూచి పోరా తండ్రి
చిగురు వనె్నల దొనె్న చారణాలు..
చూచి పోవే తల్లి
చూచి పోరా తండ్రి
తులకించు మెలపులీ తోరణాలు..
తీపి ముసురే పట్టి
తేనె కాలువ గట్టి
తుమ్మెదలు మైకాన సొమ్మసిలెను..
కూతకైదువుతోటి
గుండె లోతుల రాచి
గరువంపు కోకిల కొమ్మెక్కెను..
పరువాల బిగి మీది
పైటంచు పొలిమేర
చూపు సంతగ తోచి చెలువారెను..
చూచిపోవే తల్లి
చూచిపోరా తండ్రి
ఆమనుల గుడి మ్రోగు పూలగంట
చూచిపోవే తల్లి
చూచిపోరా తండ్రి
కంటి లోగిలిలోని కలల పంట..
ఇలి దిగిన అచ్చరకు
మొరవంక మొలనూలు
కట్టింది ఆమని కనకమాలచ్మి..
వగరు చేదు పులుపు
తీపితో కలగలపు
రుచిని పంచిందీ ఋతుగామిని..
ఈ ఏడు శార్వరి
ఇది పూల వావిరి
పలుకులో పసదనము ప్రవచించెను..
చూచిపోవే తల్లి
చూచిపోరా తండ్రి
పుడమి మగ్గపునేత పట్టుచీర..
చూచిపోవే తల్లి
చూచిపోరా తండ్రి
కడిమి పూతల కొసలు సాగుమేర..
గందవొడి నొలికించు
కనె్నపూతరి గుండె
విరివంపు కవ చివ్వ కొనసాగెను..
నీడకొమ్మల నల్లి
నెనరు పుప్పొడి జల్లి
హరివిల్లు తనువంత విరియించెను..
అలరారు కుచ్చెళ్ల
పరువాల సెగ తడుము
పూల పరికిణి కట్టి పొలయించెను..
చూచిపోవే తల్లి
చూచిపోరా తండ్రి
చూపు దారుల మాయ కనికట్టును..
చూచిపోవే తల్లి
చూచిపోరా తండ్రి
ఏటికోసారొచ్చు ఎకదొట్టును.. *