Others

హెచ్‌ఐవి బిల్లులో మార్పులు ఎందుకు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టనున్న హెచ్‌ఐవి బిల్లుపై హెచ్‌ఐవి బాధితులు, ఆ వ్యాధి నివారణకు కృషి చేస్తున్న ఉద్యమకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చికిత్స విషయంలో తాము కొన్ని హక్కులను కోల్పోతామన్న ఆందోళన హెచ్‌ఐవి పీడితుల్లో కనిపిస్తోంది. మొదట రూపొందించిన ఈ బిల్లును కాస్తంత తేలికపరిచారు. ప్రభుత్వం ముందుగా చెప్పినట్టు బిల్లులో అంశాలు లేకపోవడం ఉద్యమకారులను నిరాశకు గురిచేస్తోంది. బిల్లులో చేరిన మార్పులే ఇప్పుడు ఆందోళనకు కారణమవుతున్నాయి.
భారత్‌లో 2.4 మిలియన్ల మంది హెచ్‌ఐవి బాధితులు ఉన్నారు. వీరికి తగిన చికిత్స తీసుకునే విషయంలో కొన్ని హక్కులను కల్పించేందుకు ఈ బిల్లులో అవకాశం కల్పించాలని కేంద్ర ప్రభుత్వం భావించింది. అయితే అసలు బిల్లులో కొన్ని మార్పులు చేశారు. దాని ప్రకారం చికిత్స బదులు నివారణకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. ఈ మార్పులతో కూడిన ‘డైల్యూటెడ్ హెచ్‌ఐవి బిల్లు’ను కేంద్ర మంత్రివర్గం గత నెలలో ఆమోదించింది. హెచ్‌ఐవి బాధితులకు తప్పనిసరిగా చికిత్స అందించేందుకు కొన్ని హక్కులు కల్పించేలా మొదట బిల్లును తయారు చేశారు. కానీ ప్రస్తుతం ప్రజలకు అందుబాటులో ఉంచిన బిల్లు ముసాయిదాలో చికిత్స కన్నా నివారణకు తీసుకోవలసిన చర్యలపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నట్లు మాత్రమే ఉంది. పైగా కొత్తచట్టంలో నిబంధనల ప్రకారం ‘నివారణ చర్యల’కు గ్యారంటీ ఏమీ లేదు. వీలైనంత వరకు మాత్రమే చర్యలు తీసుకునే వెసులుబాటుందని ఓ నిబంధన (క్లాజ్)లో ఉందని, ఇది ఆందోళకర విషయమని సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది ఆనంద్ గ్రోవర్ అభిప్రాయపడ్డారు. హెచ్‌ఐవి ముసాయిదా బిల్లును రూపొందించినపుడు ఆయనతో ప్రభుత్వ ప్రతినిధులు చర్చలు జరిపారు.
మనదేశంలో 25 లక్షల మంది హెచ్‌ఐవి బాధితులు ఉండగా, వీరిలో 25 శాతం మంది మాత్రమే ప్రస్తుతం ‘యాంటీ రెట్రోవైరల్ థెరపీ’ చికిత్స పొందుతున్నారు. నిజానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న హెచ్‌ఐవి బాధితుల్లో 41శాతం మందికి ఈ చికిత్స అందుతుండగా భారత్‌లో పరిస్థితి అంతకన్నా చాలా తక్కువ స్థాయిలో ఉంది. ‘గ్లోబర్ బర్డెన్ ఆఫ్ డిసీజెస్’ పరిశోధన ఈ విషయాన్ని వెల్లడించింది. ప్రజారోగ్యంపై కేంద్రప్రభుత్వం తీసుకువస్తున్న కొత్తచట్టం జాతీయ ఆరోగ్య పథకానికి నష్ట కలుగజేస్తుందని ఉద్యమకారులు భావిస్తున్నారు. హెచ్‌ఐవి బాధితులు చికిత్స తప్పనిసరిగా తీసుకునేలా హక్కు కల్పించే నిబంధనపై ప్రభుత్వం ఆసక్తి చూపడం లేదు. ప్రాణరక్షణ ఔషధాలను తక్కువ ధరలకే ఉత్పత్తి చేసే శక్తి భారతీయ ఔషధ రంగానికి ఉంది.
దేశవ్యాప్తంగా హెచ్‌ఐవి రోగులను కాపాడే బాధ్యత ఇప్పుడు పార్లమెంటేరియన్లపై ఉందని ‘సౌత్ ఈస్ట్ ఆసియా హెడ్ ఆఫ్ హ్యుమనటేరియన్ ఎయిడ్ ఆర్గనైజేషన్ మెడిసన్స్ సాన్స ఫ్రాంటైర్స్’ ప్రతినిధి లీనా మెగ్‌హనె అన్నారు. హెచ్‌ఐవి బాధితులను చులకనగా చూడకుండా, నాణ్యమైన చికిత్స కచ్చితంగా అందేలా కొన్ని నిబంధనలతో చట్టం రూపొందించాలని ప్రభుత్వం సంకల్పించింది. అయితే కొన్ని మార్పులు ఆందోళన కలిగిస్తున్నాయని హెచ్‌ఐవి సమాజం అభిప్రాయపడుతోంది. ప్రజారోగ్యానికి సంబంధించి స్వాతంత్య్రం వచ్చాక వస్తున్న కీలక బిల్లు ఇదని, ప్రస్తుతం పార్లమెంటులో కొనసాగుతున్న వాయిదాల పర్వం దీని ఆమోదానికి ఆటంకంగా మారిందని, ఈ చట్టంలోని 14వ క్లాజ్‌ను తొలగించాలని, అయితే తమ మొరను ప్రభుత్వం పట్టించుకుంటుందన్న ఆశ లేదని హెచ్‌ఐవి ఉద్యమకారుడు, ఢిల్లీ నెట్‌వర్క్ ఫర్ పాజిటివ్ పీపుల్ ప్రతినిధి పాల్ లున్‌డిమ్ అంటున్నారు.

- కృష్ణతేజ