తెలంగాణ

ఓయూ ఉద్రిక్తం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఉస్మానియా యూనివర్శిటీలో ఆర్ట్స్ కళాశాల వెనుక గల నీటి ట్యాంకులో ఓ యువకుడి మృతదేహం కలకలం రేపింది. బుధవారం ఉదయం గమనించిన సిబ్బంది మృతదేహాన్ని వెలికితీశారు. అయితే మృతుడు నిరుద్యోగం కారణంగానే ఆత్మహత్యకు పాల్పడ్డాడని భావిస్తూ ఓయూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. గ్రూప్-2 ఉద్యోగాల సంఖ్య పెంచాలని డిమాండ్‌తోనే చనిపోయాడంటూ విద్యార్థులు ఆరోపించారు. పోలీసులు మృతదేహాన్ని మార్చురీకి తరలిస్తుండగా విద్యార్థులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు భారీగా మొహరించడంతో విద్యార్థులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. మృతదేహం వివరాలు చెప్పకపోవడంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. మృతదేహం కుళ్లిపోవడంతో గుర్తించడం కష్టంగా మారింది. కాగా మృతుడు విద్యార్థేనని నిర్ధారణకు వచ్చిన విద్యార్థులు ఒక్కసారిగా పోలీసులపై విరుచుకుపడ్డారు. రాళ్లతో దాడికి దిగడంతో పోలీసులు లాఠీ చార్జి జరిపారు. ఈ ఘటనలో పలువురు విద్యార్థులు గాయపడ్డారు. ఓయూకు ఆనుకొనివున్న మాణికేశ్వర్ నగర్‌కు చెందిన కొందరు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. స్థానికంగా ఉండే ప్రసాద్ కుమారుడు బాబుగా గుర్తించారు. కాస్సేపట్లోనే అసలు విషయం తెలిసిన విద్యార్థులు శాంతించారు. ఇదిలావుండగా, మృతుడు విద్యార్థి కాదని, అడ్డా కూలీ అని తార్నాక పోలీసులు జరిపిన దర్యాప్తులో తేలింది. మృతదేహం ఓయూ ప్రధాన వాటర్ టాంక్‌లో కాదని, ఆర్ట్స్ కాలేజి వెనకగల చిన్న వాటర్ టాంక్‌లోనేనని, విద్యార్థులు నీటి సరఫరాపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఓయూ అధికారులు తెలిపారు. టాంక్‌ను వెంటనే శుభ్రం చేసి కొత్తనీటిని నింపుతున్నామని అధికారులు పేర్కొన్నారు.

చిత్రం.... ఓయూలో ఆందోళనకు దిగిన విద్యార్థులు