అంతర్జాతీయం

కోహ్లీపై మనసుపడ్డ పాక్ మోడల్ దారుణహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరాచీ: భారత క్రికెటర్ విరాట్ కోహ్లీని ప్రేమిస్తున్నానంటూ యూ ట్యూబ్‌లో వీడియో పోస్ట్ చేసి గతంలో సంచలనం సృష్టించిన పాక్ వివాదాస్పద మోడల్ ఖండీల్ బలోచ్ శనివారం దారుణహత్యకు గురైంది. సోషల్ మీడియాలో అశ్లీల ఫొటోలు పెట్టి తమ కుటుంబం పరువు తీసిందన్న ఆగ్రహంతో ఆమెను సొంత అనే్న హతమార్చాడని సమాచారం. టి-20 వరల్డ్ కప్‌లో కోహ్లీ ఆటను చూసి బలోచ్ మనసుపారేసుకుంది. అనుష్క శర్మను వదిలేసి తనను ప్రేమించాలంటూ ఆమె కోహ్లీ కోసం ఓ వీడియోను యూ ట్యూబ్‌లో పోస్ట్ చేసింది. పాక్ క్రికెటర్ అఫ్రీదిపై తిట్ల వర్షం కురిపిస్తూ ఆమె పోస్ట్ చేసిన వీడియో అప్పట్లో వివాదాస్పదమైంది. బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్‌ను ఉద్దేశించి కూడా ఆమె ఓ వీడియా క్లిప్ పెట్టింది. టి-20 వరల్డ్‌కప్‌లో పాకిస్తాన్ గెలిస్తే తాను నగ్నంగా నృత్యం చేస్తానని ఆమె ఆఫర్ ఇచ్చింది. తన అందచందాలతో కుర్రాళ్ల మదిలో గిలిగింతలు పెట్టిన ఆమె తన అశ్లీల ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం కుటుంబ సభ్యులకు ఆగ్రహం తెప్పించింది. కుటుంబం పరువును బజారుపాలు చేసిందని సొంత అనే్న ఆమెను అంతం చేయడం ఇపుడు సామాజిక మీడియాలో సంచలనం కలిగించింది.