రంగారెడ్డి

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కెపిహెచ్‌బికాలనీ, జూన్ 5: పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యతని హైదర్‌నగర్ కార్పొరేటర్ జానకి రామరాజు అన్నారు. ఆదివారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా డివిజన్ పరిధిలోని హెచ్‌ఎమ్‌టి శాతవాహననగర్ కమ్యూనిటీ హాల్‌లో వేడుకలను నిర్వహించారు. కార్యక్రమానికి కార్పొరేటర్లు జానకి రామరాజు, దొడ్ల వెంకటేష్‌గౌడ్, డిప్యూటి కమిషనర్ రవీందర్ కుమార్ హాజరయ్యారు. జిహెచ్‌ఎంసి తరపున మొక్కలను పంపిణి చేశారు. పర్యావరణ పరిరక్షణకు తమవంతు సహకారం అందిస్తానని అధికారులు, కార్పొరేటర్లు ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో హెల్త్ ఇన్‌స్పెక్టర్ డా.దామోదర్, పట్టణ అటవీ అధికారి విక్రం, డిపిఓ హిరణ్మై, ఎలక్ట్రికల్ ఎడిఇ భద్రయ్య, సూపరింటెండెంట్ శ్రీకాంత్‌రెడ్డి, నర్సింహ పాల్గొన్నారు.
భరత్‌నగర్‌లో..
మూసాపేట భరత్‌నగర్‌లో ప్రపంచ పర్యావరణ దినోత్సవనాన్ని పురస్కరించుకొని మొక్కలను నాటారు. భరత్‌నగర్ వాకింగ్ గ్రౌండ్‌లో మొక్కలను నాటి పర్యావరణాన్ని పరిక్షరించాల్సిందిగా నినాదాలు చేశారు. భరత్‌నగర్ కాలనీ అసోసియేషన్ అధ్యక్షుడు పట్లోళ్ల నాగిరెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కల పెంపకంపై ఆసక్తిని కనబర్చాలని అన్నారు. కార్యక్రమంలో అమృత్‌పటేల్, జహంగీర్, వేణు, నాయుడు, రామ్మోహన్, శ్రీనివాస్ యాదవ్, రాజు, యూసఫ్, లక్ష్మినారాయణ పాల్గొన్నారు.
కుషాయిగూడ: రోజురోజుకు పెరిగిపోతున్న కాలుష్యానికి నగరం పూర్తిగా విషపూరితంగా మారిపోతుందని ఎయస్‌రావునగర్‌డివిజన్ కార్పొరేటర్ పావని మణిపాల్‌రెడ్డి అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కాప్రా సర్కిల్ పరిధిలోని ఎయస్‌రావునగర్ డివిజన్ ఎన్‌ఎస్‌సిలో మొక్కలు నాటి పర్యావరణను కాపాడాలని సూచించారు. అనంతరం విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన హరితహారంను విజయవంతం చేయాలని కోరారు. దేశంలోనే హరితహారంను ప్రవేశపెట్టిన తొలి ముఖ్యమంత్రి కేకెసిఆర్ అని పర్యావరణ పరిరక్షణకు విద్యార్ధులు ముందుకు రావాలని సూచించారు. నగరంలో ప్లాస్టిక్ వాడకంపై ప్రజలను చైతన్య పరిచి ప్లాస్టిక్ కవర్లను నిషేధించాలని కాలనీ ప్రజలతో ప్రతిజ్ఞ చేశారు. నగరం పూర్తిగా ప్లాస్టిక్ కవర్లతో కాలుష్యం అవుతుందని కృత్రిమ బ్యాగ్‌ల వాడకంలో ప్రజలను చైతన్యపరచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సురేందర్, రమా, మహిపాల్‌రెడ్డి, బాల్‌రాజ్ పాల్గొన్నారు.

ప్లాస్టిక్ రహిత సర్కిల్‌గా తీర్చిదిద్దాలి
* జోనల్ కమిషనర్ రఘుప్రసాద్

ఉప్పల్, జూన్ 5: ప్రజల భాగస్వామ్యంతో ప్లాస్టిక్ రహిత సర్కిల్‌గా ఉప్పల్‌ను తీర్చిదిద్దాలని జిహెచ్‌ఎంసి ఎల్‌బినగర్ జోనల్ కమిషనర్ రఘుప్రసాద్ పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా ఆదివారం చిల్కానగర్ డివిజన్‌లో యువతతో కలిసి ప్లాస్టిక్ కవర్లను నిషేధించాలని కోరుతూ ప్రజల్లో అవగాహన ర్యాలీ నిర్వహించారు. డిప్యూటి కమిషనర్ విజయకృష్ణ, అధికారులు, కార్పొరేటర్ జి.సరస్వతి, పర్యావరణ పరిరక్షణ సమితి సభ్యులతో కలిసి ఇంటింటికి వెళ్లి ప్లాస్టిక్‌ను వినియోగించడం వల్ల కలిగే అనర్థాలను వివరించారు.
ముఖ్యంగా క్యాన్సర్ వ్యాధి నుంచి బయటపడాలంటే ప్లాస్టిక్‌ను తరిమికొట్టాలన్నారు. ప్లాస్టిక్ రహిత సర్కిల్‌గా తీర్చిదిద్దాలంటే ప్రజలు అధికారులకు సహకరించాలని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణకోసం పరిసరాల పరిశుభ్రతకు జిహెచ్‌ఎంసి చేపట్టిన కార్యక్రమాల్లో ప్రజలు భాగస్వామ్యులు కావాలని డిప్యూటి కమిషనర్ విజయకృష్ణ పిలుపునిచ్చారు.
హబ్సిగూడలో పరిశుభ్రతపై అవగాహన
ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా ఆదివారం హబ్సిగూడలోని సాయి ప్రగతి ప్రైడ్ అపార్ట్‌మెంట్‌లో మహిళలకు పరిశుభ్రతపై అవగాహన కల్పించారు.
డిప్యూటి కమిషనర్ విజయకృష్ణ పర్యవేక్షణలో ఏఎంహెచ్‌ఓ, సిబ్బంది పాల్గొని తడిచెత్త, పొడిచెత్తను వేర్వేరుగా మున్సిపల్ సిబ్బంది తెచ్చే డబ్బాలలో వేయాలని పేర్కొన్నారు.
చెత్తను వృధాగా పారేయకుండా వర్మీ కంపోస్టుగా మార్చే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పేర్కొన్నారు.