తెలంగాణ

పోలీసుల కళ్లుగప్పి ఖైదీ పరార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్: నాంపల్లి కోర్టులో హాజరు పరచి తిరిగి వరంగల్ సెంట్రల్ జైలుకు తీసుకొస్తుండగా ఉప్పల సూరి అనే ఖైదీ ఎస్కార్టు పోలీసుల కళ్లుగప్పి పరారైన ఘటన సోమవారం జరిగింది. వాహనంలో వరంగల్‌కు సూరిని తరలిస్తుండగా జనగామ సమీపంలో యశ్వంతపూర్ వద్ద టాయ్‌లెట్ కోసమని ఆగారు. వాహనంలో నుంచి ఎస్కార్టు పోలీసులతో పాటు సూరి కిందకు దిగాడు. ఆ సమయంలో సూరి పరారయ్యాడు. ఈ సందర్భంగా పారిపోతున్న సూరిపై పోలీసులు కాల్పులు జరిపినా అతను చిక్కకుండా పోయాడు. సూరిని పట్టుకునేందుకు రెండు పోలీసు బృందాలు గాలింపు చర్యలు ప్రారంభించాయి.