పఠనీయం

ఐతిహాసిక పాత్రలు.. అందమైన అనువాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇతిహాస పాత్రలు
మరో కోణం నుంచి...
మూల రచన: వరేణ్యారెడ్డి
అనువాదం: డా.జె.చెన్నయ్య,
వెల: రూ.50/-
ప్రతులకు: ఎమెస్కో బుక్స్,
హైదరాబాదు,
మరియు
వారి విజయవాడ శాఖ
*
మన పురాణేతిహాసాలు జ్ఞానసంపదకు గనులు. మంచీచెడుల విశే్లషణలు. మానవ జాతి ఏది అనుసరించాలో, ఏది అనుసరించకూడదో చెబుతాయి. ఎందరో వ్యాఖ్యాతలు వీటి గురించి, వీటిలో వివరించబడిన అంతరార్థాల గురించి తమదైన ఆలోచనలు పాఠకులతో పంచుకున్నారు. కుమారి వరేణ్యారెడ్డి గొప్ప వారసత్త్వ సంపదను ఆర్జించుకున్న ప్రవాస భారతీయురాలు. జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డా.సి.నారాయణరెడ్డిగారి ముని మనవరాలు. ముత్తాతగారి ప్రేరణవల్ల కావొచ్చు లేదా సహజాతమైన ఉత్సుకతవల్ల కావొచ్చు. రామాయణ మహాభారతాలను క్షుణ్ణంగా చదివారు. మనసున బట్టించుకున్నారు. తన అంతర్దుష్టితో ఒక్కో పాత్రను తనదైన కోణంనుంచి పరిశీలించారు. వీటిలోంచి పది పాత్రలను ఏరి 'Through a Demons Eye' అన్న ఫుస్తకాన్ని ప్రచురించారు.
ఇంగ్లీషులో రాయబడ్డ ఈ పుస్తకాన్ని డా.జె.చెన్నయ్యగారు తెలుగులో ‘ఇతిహాస పాత్రలు మరో కోణంనుంచి’ అన్న టైటిల్‌తో ఎమెస్కోవారి ద్వారా తెలుగు పాఠకులకు అందిస్తున్నారు.
బాల్యంనుండే భారత రామాయణాలను ఉగ్గుపాలతో సేవిస్తున్న మనకు అంతగా క్రొత్తదనం కనిపించకపోయినా, గ్లోబుకు అవతలివేపు ఉంటూ, అక్కడి సంస్కృతి సాంప్రదాయాల మధ్య పెరిగిన ఈ చిన్నారి ఆలోచనలు ‘అద్భుతం’ అనిపిస్తాయి. పలు అవార్డులు, రివార్డులు అందుకున్న వరేణ్య మూల రచనకు డా.చెన్నయ్య అనువాదం ఎంత గొప్పగా ఉందంటే- ఈ పుస్తకం చదువుతున్నంతసేపూ ఇవి అనువాద వ్యాసాలుగా అనుపించవు. వివరిస్తున్న పాత్రలపై వరేణ్య తన ఆలోచనలను బోల్డ్ అక్షరాలతో ఇవ్వటం బావుంది. ఆయా పాత్రల ప్రాముఖ్యత, అవగాహననుబట్టి ఒక్కో వ్యాసం 13 పేజీలు సాగింది (రాధేయుడు) ఒక్కో వ్యాసం ఒక పేజీ (హిరణ్యాక్షుడు) లోనే వివరించబడింది. వరేణ్యరెడ్డి ఆలోచనల్లో ప్రతిఫలించిన ఈ ఐతిహాసిక పాత్రలు అనువాదకులు డా.చెన్నయ్యగారి కలం ద్వారా పాఠకుడికి ఆనందం కలిగించేలా చిత్రీకరించబడ్డాయి.

- కూర చిదంబరం