పఠనీయం

ఇదొక దైవీ మానసిక చికిత్స

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైత్రి
ద్వితీయ తృతీయ సంపుటాలు-
రచన: జలంధర, వెల:175 + 150,
ప్రతులకు: నవోదయ, కాచిగూడ
హైదరాబాద్-27.
ఫోన్: 040-24652387
*
జలంధర ఇటీవలి కాలంలో బాగా ప్రాచుర్యం పొందిన రచయిత్రి. ఈమె ఆంధ్రభూమి వారపత్రికలో పాఠకుల ప్రశ్నలకు జవాబు ఇచ్చే శీర్షికను సమర్థవంతంగా నిర్వహిస్తూ ఎందరో బాధాతప్తుల దాహార్తిని తీరుస్తూ ఉంది. ఇందుకు ఈమె ఆధునిక వైద్య శాస్త్రం సైకాలజీ మాత్రమే కాక భారతీయ ప్రాచీనమయ విశ్వాసాలలోని అంతరార్థాలను అవగాహన లుప్తమయింది.
కొందరు తపస్వులు శాపనుగ్రహశక్తిని కలిగి ఉంటారు. ఇదెలా సాధ్యం? అని ఆశ్చర్యపడనక్కరలేదు. వారి వాక్కుల్లో విద్వత్తు రెండూ ప్రవహిస్తూనే ఉంటాయి. అందువలన వారి దర్శన స్పర్శ, హస్త మస్తక సంయోగాది ప్రక్రియల వలన అద్భుతాలు జరగటం మనము చూస్తూనే ఉన్నాము. జైనులలో శే్వతాంబరులు అని ఉన్నారు. క్రైస్తవులు కూడా తెల్లని గౌన్లు ధరిస్తారు. ఈ కలర్ సింబల్ వారిలో సాత్విక శక్తి పెరగడానికి దోహదం చేస్తుంది. శైవులు భస్మం ధరించి రుద్రాక్షమాలలు వేసుకొని శివోహం అంటూ ఉంటారు. ఇలా ధ్యానం చేయటంవలన వారిలో మంగళకరమైన భావనలు ఉత్పన్నవౌతాయి. శివమ్ అంటే మంగళం అనే కదా అర్థం! ఇదే పూజాదికాల రహస్యం.
శ్రీమతి జలంధర లోగడ పున్నాగపూలు అనే నవలతో ప్రసిద్ధురాలైనారు. ఇపుడు పాఠకుల ప్రశ్నలకు జవాబులిస్తూ ఉన్నారు. తాజమహల్ ఎక్కడ ఉంది? అంటే ఆగ్రాలో ఉత్తరప్రదేశ్‌లో అని జవాబు చెప్పడానికి చాలా పోటీ పరీక్షల గైడ్లు ఉన్నాయి. కాని మనిషి అంటే ఎవరు? అతనిలోని అంతర్లీనమైన శక్తులను ఎలా వెలికి తీసుకొని వచ్చి వాటిని నిత్యజీవితానికి ఉపయోగించుకోగలము అనే విషయంలో మనకు చాలా తక్కువగా విజ్ఞానం పత్రికలలో అందుతున్నది. ఈ కొరతను కొంతవరకు జలంధర తీరుస్తున్నది. ఈమె తండ్రిగారు శ్రీ గాలి బాలసుందరరావు వైద్య విద్యావేత్త కావటం ఆ విజ్ఞానాన్ని భర్త అందించిన శ్రౌత, శైవ సంప్రదాయాలను అవగతం చేసుకుని వాటికి ఈమె ఆధునిక భాష్యం చెప్పడానికి ఒక మంచి ప్రయత్నం మొదలుపెట్టింది. ఎఫర్మేషన్, విజువలేషన్, పాజిటివ్ ఎనర్జీ, సెల్ఫ్ హిప్నోసిస్- ఇలాంటి అంశాలపై ఆంగ్లంలో కొన్ని గ్రంథాలున్నాయి. ఇవి చదివితే మన విశ్వాస్థాయి (కాన్ఫిడెన్స్ లెవెల్)ను పెంచుతాయి.
ఓల్డ్ టెస్ట్‌మెంట్‌లో మోజెస్ ఉన్నాడు. ఆధునికంగా చర్చిల్ ఉన్నాడు. నా మిత్రుడు ఇటీవలే పోయిన ద్వానా శాస్ర్తీ ఉన్నాడు. వీరందరికీ నత్తి ఉంది. ఐనా జీవితాల్లో తమ తమ రంగాల్లో చాలా విజయాలు సాధించారు. ఇది ఎలా జరిగింది? అంటే ఆత్మవిశ్వాసం. చౌకీదార్‌గా చాయ్‌వాలాగా పనిచేసిన కేశూభాయ్ పటేల్, నరేంద్ర మోడీలు ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు ఎలా కాగలిగారు? ఆ మాటకొస్తే ఆంటోనియో మైనో ఒక బార్‌లో అటెండర్‌గా పనిచేస్తూ ఉండేది. తైమూర్ లంగ్ అనేవాడు చరిత్రలో కుంటివాడు. అల్లా ఉద్దీన ఖిల్జీ హోమో సెక్యువల్. ఐనా వీరు సాధించిన విజయాలు అసామాన్యమైనవి. ఇదంతా కేవలం ఆత్మవిశ్వాసంవల్లనే సాధ్యమైంది.
మనం చేసే పూజలు ఉపాసనలు అర్థరహితమైన ఆచారకాండలు కావు. కాకుంటే వాటి అర్థం అంతరార్థం ఈ అనంతకాల ప్రభావంతో కాల ప్రవాహంలో మరుగున పడిపోయాయి. దెయ్యాన్ని సీసాలో బంధించటం ఏమిటి? గురజాడ అప్పారావు కన్యాశుల్కంలో ఎగతాళి చేయడం ఆయన అజ్ఞానానికి చిహ్నం. లేని దయ్యాన్ని సీసాలో బంధించటం ద్వారా మాంత్రికుడు ఒక హిప్నోటెక్నిక్‌ను పేషెంట్‌కు మానసిక చికిత్స అందించాడని అర్థం. గుడికి వెళ్లి పూజ చేస్తే దేవుడు వరాలు ఇవ్వడు. మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగి మీ వెంట దైవీశక్తి ఉందనే విశ్వాసం మీ పనులలో మీరే స్వశక్తితో విజయం సాధించుకోగలుగుతున్నారు. ఈ అంశం భారతీయులకు వేలాది సంవత్సరాల క్రితమే తెలుసు. ఇటీవల పాశ్చాత్య దేశాల్లో ఈ అంశంపై అనేకానేక గ్రంథాలు సెమినార్లు స్టడీ సెంటర్లు ధ్యాన కేంద్రాలు మొదలైనాయి.
రోగాన్ని మందు కొంతవరకే నయం చేస్తుంది. తక్కిన క్యూర్ మనశరీరంలోని శక్తియే నయం చేస్తుంది. ఎందుకంటే దేవుడు మనల్ని బుట్టించినపుడే శరీరంలో ఔషధం, బాండేజీ కూడా పెట్టి సృజించాడు. శరీరంలో ఎన్నో షాక్ అబ్జార్వర్స్ ఉన్నాయి. ఇవి ఇలా పనిచేస్తాయని మనకు తెలియదు.
శాడిస్టుల బారాత్‌కు పాజిటివ్ ఎనర్జీ శస్త్ర చికిత్స ఒక పాఠకుడు రమణ మహర్షి గురించి తెలుపవలసిందిగా జలంధరను కోరాడు. అందుకామె కావ్యకంఠ గణపతిముని గ్రంథాన్ని ఆధారం చేసకొని పరిమిత వాక్యాలలో రమణ తత్వాన్ని అందించింది. రమణుడు వౌనభాషి. నిశ్శబ్ద బ్రహ్మతత్వంలో సమాధానం చెప్పవచ్చునని రమణుడు నిరూపించాడు.
ఒకామె తన ఇంట్లో అత్తగారిపోరువల్ల ఉద్యోగం పోగొట్టుకున్నట్టు వ్రాసింది. మళ్లీ ఉద్యోగం ఎలా వస్తుంది అని ప్రశ్నించింది. సమస్యలు ఉద్యోగంలో లేదు అత్తగారిలో ఉంది. ఆమె కోడలును కూతురులా చూచుకోలేకపోతున్నది. చాలామంది కోడళ్ళు అత్తను కన్నతల్లిలా చూచుకోలేకపోతున్నారు. ఇవే గృహకలహాలకు మూలకారణం. జలంధర ఇచ్చిన జవాబులు వారం వారం పాఠకులు చదివి అవతల పడేసేవి కావు. అందువలన ఈ మానసిక చికిత్సా విధానాన్ని నవోదయ పుస్తక ప్రచురణ సంస్థవారు ఇప్పటికి మూడు భాగాల్లో గ్రంథ రూపంలో తెచ్చి త్వరలో నాల్గవ భాగం కూడా రాబోతున్నట్టు తెలిపింది. ఈ మొత్తం కలిపి ఒక సంపుటంగా తీసుకురావటం ద్వారా తెలుగులో చాలా సామాజిక సమస్యలకు మానసిక చికిత్స ఎలా చేయవచ్చునో తెలిపే శాస్త్రం కరతాలమలకం కాగలుతుంది. ఇదొక కొత్త కోణం కాబట్టి విస్తృతప్రచారం అవసరం. దీనివలన తాగుడు వ్యభిచారం దొంగతనం రేప్ హత్యా రాజకీయాలు కూడా తగ్గుతాయి. జీడిపాకం లాంటి టెలీ సీరియల్స్‌లోని లేడీవిలన్స్ (వాంప్స్) అందించే సంస్కారంలో భారతీయ కుటుంబాలు నరకప్రాయమవుతున్నాయి. వీటికి అనివార్యమైన చికిత్స నేటి ప్రస్తుత కర్తవ్యం. ఈ శాస్త్రం జనాదరణ పొందుతుందని ఆశిద్దాం.

- ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్