పఠనీయం

మంచి మాటల నవ్యసూక్తం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చంద్ర గద్య శతకము
-నండూరి రామచంద్రరావు
పుటలు: 64
వెల: రూ.50
ప్రచురణ: విశ్వజ్యోతి ప్రజెంటేషన్స్

** ** * ** ****

‘మాటకు ప్రాణము సత్యము’ అన్నాడు బద్దెన. ‘సుతశతకంబు కంటె ఒక సూనృత వాక్యము మేలు’ అన్నారు నన్నయగారు అంతకు ముందే.
సంఘము, దాని దశ, దిశ, మానవుని ఆలోచన, ప్రవర్తనల తీరు మొదలైన వాటి గురించి ఎవరు ఏ మాట చెప్పినా అందులో ఒక సార్వకాలిక సత్యం - ఒక ఉదాత్త ధర్మం - కేంద్ర బిందువుగా, ఆ పలుకుకు ఆత్మలాగా ఉండాలని బద్దెన, నన్నయ అన్న మాటల సందేశము, సారాంశమూను.
ఇదే భావనతోను, జాత్యభ్యుదయ తాపత్రయంతోను నాలుగు మంచి మాటలతో సరళమైన భాషలో సూటిగా, నీటుగా (అందంగా) చేసిన ఒక సూక్తి రచన నండూరి రామచంద్రరావు ‘చంద్ర గద్య శతకం’. ఈ శతకంలోని గద్యములన్నిటికీ మకుటం ‘బ్రతుకు బాట మార్చుమాట ఇది చాటవోయి చంద్ర!’ అని.
ఇందులో వంద చతుష్పదులు, ఎనిమిది అష్టపదులు (అన్నీ వచనంలోనే) ఒక వచన కవిత ఉన్నాయి.
‘చెడిన గడియారమైనను దినమున రెండు తూర్లు సమయంబు తెలుపు/ మోడుబారిన చెట్టు మొదలంట నరికిన తలుపు రెక్కలు సేయవచ్చు’ అంటూ ఎవరికీ మేలుచేయని బ్రతుకు ఎంతో హీనం’ అని అన్న 70వ గద్యంలో చక్కని సందేశమే కాకుండా చెప్పే వాక్యాలలో బింబ ప్రతిబింబ భావం ఉండేట్టుగా చెప్పటం ఒక అలంకారం - ‘దృష్టాంతం’. అమ్మాయికి అబ్బాయిని కూర్చటమే గాదు అర్థం చేసుకునే అన్యోన్యత నేర్పాలి అంటారు నండూరి వారు. ‘మూడు దినంబుల పెళ్లి ఘనంబుగ జేసినను/ సర్దుబాటు నేర్పని జంట కలసి యుండునే?’ అనే 41వ గద్యంలో, ఈనాటి పెద్దలకు ఈ మాట ఒక చద్దిమూట, ఒద్దికైన సుద్ది.
కూటికి పేదైతే గుణానికి పేద కాదు అంటూ మన పెద్దలు చెప్తూ ఉండే నీతి సూక్తిని 63వ గద్యంలో ‘బ్రతుకున లేమి ఉండవచ్చు, మనసుకు కాదు’ అంటూ రచయిత పునర్విచిస్తూ మట్టిలో మాణిక్యాలలాగా కొందరు భాగ్యహీనుల్లోనూ పెద్ద మనసుగల వాళ్లుంటారు అనే ఉదాత్త మానవీయ భావాన్ని స్మరణావిష్కారం చేశాడు. పేదలు అని బీదసాదలను తక్కువగా చూడకు అని సమాజ జనులకు ఇచ్చే కాషన్ ఉంది ఇందులో. ప్రతి మాటకు, చేతకు ముందు వెనుకలాలోచించి ప్రవర్తించు అనే గంభీరమైన హెచ్చరిక ఉంది ఇలా చెప్పటంలో.
‘వేడిసెగ ఫలితంబు వెన్నకే తెలుసు..’ అన్న 8వ గద్యపు వాక్యం కడు గంభీర భావ సుందరంగా ఉంది. వెన్న అనేది ఉదాత్త చిత్తము, సౌమ్యము, సాధుత్వము, సమాజంలో ఒదిగి ఉండే తత్త్వము మొదలైన గుణాలున్న సత్పురుషునికి సంకేతం. వేడిమికి వెన్న తన స్థిరత్వాన్ని కోలుపోయినట్టుగా సత్పురుషుడు దుర్మార్గుల క్రౌర్యానికి విచలితుడై పోతాడు, బలైపోతాడు. వేడిసెగ అనేది క్రౌర్యానికి చిహ్నం. ఇంత ధ్వని ప్రధానంగా అమరింది ఆ సూక్తి.
‘పశువులకూ ఉండును కండలు, మాంసపు ముద్దలు దండగ’ అన్న 25వ గద్యంలోని వ్యంగ్యము, లలిత హాస్యము బాగున్నాయి. ‘మతములన్నియు మంచియే నేర్పు;... దృష్టిలోపమే గాని వేఱొండుకాదు’ అంటూ మతం ఒక మత్తు అనే నాస్తికులతోను, వామపక్ష భావజాల భౌతిక దాడులతోను ఈ శతక కర్త ఏ మాత్రమూ మోమాటపడకుండా విభేదిస్తాడు.
కొన్నికొన్ని చోట్ల శబ్ద దోషాలు, కొద్దిచోట్ల వాక్య దోషాలు ఉన్నాయి. అలాంటివి దొర్లకుండా జాగ్రత్త పడితే బాగుండేది.
ఈ పుస్తకం సామాజిక ధ్యాసగల ప్రతి వ్యక్తికీ ఒక సత్య ధర్మనీతి శతకం, గద్యరూప నవ్యసూక్తం.

- శ్రీపతి పండితారాధ్యుల పార్వతీశం 9849779290